Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
Samantha Ruth Prabhu: చాలా కాలం తర్వాత అలా కనిపించిన సమంత, సామ్ ఈజ్ బ్యాక్
సమంత.. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం, అభినయంలో మరెవరికీ తీసిపోని టాలెంట్. ఎలాంటి తరహా పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించే మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రస్ సమంత రూత్ ప్రభు.
సమంత.. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం, అభినయంలో మరెవరికీ తీసిపోని టాలెంట్. ఎలాంటి తరహా పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించే మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రస్ సమంత రూత్ ప్రభు.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో పిచ్చెక్కించే సమంత.. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయింది. మయోసైటిస్ వ్యాధి బారిన పడి మంచం పైనుండే యశోధ సినిమా డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత కోలుకుని శాకుంతలం పూర్తి చేసింది.

వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలతో సతమతమై ఎదురొడ్డి నిలబడింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకుని పోరాడింది. తనను తాను మల్చుకుంటూ మరింత రాటుదేలుతూ తిరిగి తన పూర్వ స్థితికి చేరుకుంది.

ఒకవైపు వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు.. మరోవైపు ఒప్పుకున్న ప్రాజెక్టులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని, ఆఖరికి వాటిపై గెలిచి నిలిచింది. సమంత ఈజ్ బ్యాక్ అనేలా మారిపోయింది.

చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది సమంత. తన గ్లామరస్ ఫోటోలను పోస్టు చేస్తూ పాత సమంత వచ్చేసిందనే మెసేజ్ పంపిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. సమంత లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ను సమంత తన భుజాలకెత్తుకుంది. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఓ ట్రెండీ వేర్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ పిక్స్ లో సమంత చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. వెస్టర్న్ వేర్ లో సమంత అందంగా దర్శనమిచ్చింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో కుర్ర హృదయాలను మరోసారి దోచేసేందుకు సిద్ధమైంది.
ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఓ సిరీస్ లో ప్రస్తుతం సమంత నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ హిమాచల్ ప్రదేశ్ లోని నైనిటాల్ సిటాడెల్ లో జరుగుతోంది. అనంతరం సౌతాఫ్రికాలోనూ షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తోంది సమంత.



Click it and Unblock the Notifications
