Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
గణేష్ చతుర్థి వేడుకల్లో మెరిసిన ఆలియా భట్, రణబీర్ కపూర్
అంబానీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి పండుగ వేడుకల్లో బాలీవుడ్ అందాల భామ, కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో రణబీర్ కపూర్ జంటగా పాల్గొన్నారు.

అంబానీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి పండుగ వేడుకల్లో బాలీవుడ్ అందాల భామ, కపూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో రణబీర్ కపూర్ జంటగా పాల్గొన్నారు. వీరిద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సులతో అందరి చూపును తమవైపు తిప్పుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరిలో వీరి జోడి హైలెట్ గా నిలిచింది. ఎందుకంటే వీరు వేసుకున్న దుస్తులు అంత ప్రకాశవంతంగా ఉన్నాయి మరి. అంతేకాదు ఎప్పుడు వెస్ట్రన్ కల్చర్ డ్రస్సులు వేసుకునే ఆలియా భట్ ఈసారి అకస్మాత్తుగా చీరలోనూ తన అందంగా ఉంటానని నిరూపించింది. రణబీర్ కూడా మెరిసేపోయే సాంప్రదాయ దుస్తులనే ధరించారు.

చాలా రోజుల తర్వాత ఆలియా భట్ చీర కట్టులో కనిపించింది. ఆమె ఎప్పుడూ ధరించే జీన్స్, టీషర్ట్స్, ఇతర డ్రెస్సుల కంటే చీరలోనే చాలా అందంగా, ప్రకాశవంతంగా మెరిసిపోయింది. ఇక ఆమె దుస్తులను ఓ సారి డీకోడ్ చేద్దాం. లేత ఆకుపచ్చ కలర్ చీరతో లేటెస్ట్ గా గణేష్ చతుర్థి వేడుకలకు ఎంట్రీ ఇచ్చింది. ఆ చీరకు భిన్నంగా ఉండే జాకెట్ ను ధరించింది. అది కూడా అందంగా కనిపించే బ్యాక్ లెస్ పింక్ జాకెట్. అందుకు తగ్గట్టే ఇయర్ రింగ్స్ ను కూడా చక్కగా మ్యాచింగ్ అయ్యేలా సెట్ చేసుకుంది. దీంతో అందరిలో ఆమె దుస్తులే హైలెట్ గా నిలిచాయి. ఇక ఆమె మేకప్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే తను ఎంత అందంగా ఉంటుందో ఎలా మేకప్ వేసుకుంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ధరించిన జ్యువెలరీ సైతం హైలెట్ గా నిలిచింది.

ఇంకోవైపు రణబీర్ కపూర్ తన సాంప్రదాయ దుస్తులతో ఆలియాతో కలిసి అంబానీ వేడుకలకు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అతని దుస్తులను ఒకసారి డీకోడ్ చేద్దాం. రణబీర్ వేడుకల సమయంలో చాలాసార్లు కుర్తా, పైజామా వంటి డ్రెస్సులను ధరించి అలరించాడు. ఈసారి కూడా ఆలియాతో జోడిగా అలాంటి డ్రెస్సునే ధరించాడు. కానీ ఈసారి ధరించిన ట్రెడిషనల్ డ్రెస్సులో ట్రెండీగా కనిపించాడు. ఎందుకంటే తన ధరించిన డ్రస్సులో ఎక్కువగా వెండి ఎక్కువగా కనిపించింది. దీంతో రణబీర్ కంటే అతని డ్రెస్ వెండి కాంతులతో వెలిగిపోయింది. దీంతో వీరిద్దరి జోడి ఈ వేడుకల్లో హైలెట్ నిలిచింది.



Click it and Unblock the Notifications