Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
కేన్స్ 2018: రెడ్ కార్పెట్ పై దీపిక హొయలు
మెట్ గాలా 2018లో ప్రబల్ గురుంగ్ ఎరుపు దుస్తులతో “ హెవేన్లీ బాడీస్ : ఫాషన్ అండ్ కాథలిక్ ఇమాజినేషన్ ” నేపధ్యానికే భిన్నంగా హాజరై సెన్సేషన్ సృష్టించిన దీపిక పడుకునే, 8 నుండి 19 మే వరకు జరగనున్న కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చి మరలా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చిత్రోత్సవాలైన ఈ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మొదటి రోజైన ఫ్రెంచ్ రివేరలో దీపిక హాజరయింది. ఒక ఉత్కృష్టమైన జ్యూహైర్ మురాద్ కేప్ గౌను ధరించి రెడ్ కార్పెట్ పై అప్రయత్నంగానే తనదైన సోయగంతో అందరి దృష్టిని ఆకర్షించగలిగింది.

డీప్ నెక్లైన్ కలిగిన స్కిన్నీ డ్రస్ ధరించిన దీపిక సన్నని ఫ్రేమ్ కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లుగా కనిపించింది. ఖచ్చితత్వంతో కూడిన ఎంబ్రాయిడరీ చేసిన షీర్ ఫాబ్రిక్ మరియు అంతర్లీనంగా చేతితో మెరుగులు దిద్దిన క్రాఫ్టెడ్ కేప్ తో సెక్సీ లుక్ కలిగి ఉండేలా డ్రెస్ తీర్చిదిద్దబడింది. తద్వారా ఒక ప్రత్యేకమైన శైలిని ప్రతిబింబించేలా దీపిక కనిపించింది.
'ఎక్స్ఎక్స్ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ క్సాన్డర్ కేజ్' లో విన్ డీజిల్ పక్కన అద్భుతమైన నటనను ప్రదర్శించి, తనకంటూ హాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన మార్క్ కలిగి ఉండేలా చేసుకోగలిగిన దీపికా పడుకునే, కేన్స్ లో చూపరుల దృష్టిని తన నుండి మరల్చుకోనీయకుండా చేయడంలో సఫలీకృతమైందనే చెప్పవచ్చు. ఆమె తన దుస్తులకు సరైనజోడీగా సున్నితమైన చెవిపోగులను జతచేసింది. మరియు బుజంపై నుండి జాలువారిన అలల వంటి జుట్టుతో దీపిక ఇచ్చిన హొయలు విస్మయానికి గురిచేసింది అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు.

కంగానా వలెనే మేము కూడా, దీపికా జుహైర్ మురాద్ గౌన్లో ఇరగదీసిందని మేము భావిస్తున్నాము. ఈ ఇద్దరు గ్లామర్ డాల్స్ తమ సర్టోరియల్ స్టేట్మెంట్ దుస్తులలో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నారు.

ఈ గౌన్లో దీపికా ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలుపండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలకై, మా పేజీని సందర్శిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications
