Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
ప్రయాణాల్లో కంగనా ధరించే ఫ్యాషన్ దుస్తులు
కంగనా రనౌత్ చూడటానికి సాదా సీదా గా ఉన్నా క్లాసీ గా ఉంటుంది.ఆమె ని ఎన్ని రకాల దుస్తులలో చూసామో.కంగనా ఎప్పుడూ కూడా తన డ్రెస్సింగ్ తో మనల్ని నిరాశ పరచదు. ఇటీవల కంగనాని ఎయిర్ పోర్ట్ లో చూసాము. ప్రయాణం లో ధరించే దుస్తులలో ఫ్యాషన్ గురించి మనం ఆమె నుండి నేర్చుకోవాలి అనిపించింది తనని చూస్తే.ఆమె సినిమాల్లాగే ఆమె వేసుకున్న దుస్తులు కూడా నీటు గా మరియు సింపుల్ గా ఉన్నాయి.

ప్రింటెడ్ కాటన్ డ్రెస్స్
ఎడమపక్కగా చిన్న స్లిట్ తో, మెడ చుట్టూ నల్లటి దారాలతో చేసిన లాంగ్ డ్రెస్ దూరపు ప్రయాణాలప్పుడు చక్కటి ఎంపిక.సౌకర్యవంతం గా ఉంటూ ఫ్యాషనబుల్ గా కూడా ఉండటం ఈ డ్రెస్ ప్రత్యేకత.

బ్రౌన్ కలర్ బూట్స్
తను ధరించిన డ్రెస్స్ కి కాంట్రాస్ట్ గా ఉండే బూట్లు ఎంచుకుంది కంగన.బూట్లలో బ్రౌన్ కలర్ ఎప్పుడూ బాగుంటుంది.

బ్లేజర్
ఒక్కసారి మీరు ప్రయాణం మొదలుపెట్టాకా ఇంక ఆపడం కుదరదు కదా. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతే చలి నుండి కాపాడుకోవడానికి బ్లేజర్ దగ్గరుండాలి కదా.గ్రే కలర్ లో చెక్స్ ఉన్న బ్లేజర్ ని కంగనా ధరించింది.

ఏవియేటర్ సన్ గ్లాసెస్
మీరు ప్రయాణం లో ధరించే మీ దుస్తుల మీదకి భారీ నగలేమీ ధరించక్కర్లేదు. ఒక మంచి జత సన్ గ్లాసెస్ ఉంటే చాలు.

బ్లాక్ బ్యాగ్
ప్రయాణాల్లో బ్యాగ్ కంటే ముఖ్యంగా కావాల్సినదేముంది చెప్పండి?? ఫ్యాషనబుల్ గా ఉండే బ్లాక్ స్లింగ్ బ్యాగ్ ని ఎంచుకుంది కంగన. మీ ప్రయాణం లో అవసరమయ్యే సామాగ్రి అంతా దాంట్లో పట్టేట్లుగా ఉంది ఈ బ్యాగ్.



Click it and Unblock the Notifications
