Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఆస్కార్ అవార్డ్స్ 2016: రెడ్ కార్పెట్ మీద షైన్ అయిన పాప్ స్టార్ లేడీ గాగ
కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు..అందరిలో అవార్డుల హడావిడి ఆరంభం అవుతుంది. ముఖ్యంగా అందరి ద్రుష్టి ఆస్కార్ అవార్డుల మీదే ఉంటుంది. ఆస్కార్ అవార్డుల ఉత్సవం ప్రారంభోత్సవంలోనే అద్భుత అందాలను ఆరబోస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ లో పాపులర్ సెలబ్రేటీలు ఈ ఆస్కార్ సంబరాలను అంబారన్నంటేలా జరుపుకుంటారు.
ఈ సంవత్సరం ఒక సర్ ప్రైజ్ ఏంటంటే పాప్ సింగర్ లేడీ గాగా కూడా ఆస్కార్ సందడి చేయనున్నారు. ఇంతకీ ఎవరీ లేడీ గాగా అనుకుంటున్నారా...?సుదీర్ఘ పాప్ సంగీత చరిత్రలో ఎందరో ధృవతారలు సంగీతాభిమా నులను ఓలలాడించారు. ఇప్పుడు అదే సంగీతాభిమానులను ఓ పాతికేళ్ళ యువతి తన గానామృతంతో మైమరపింపజేస్తోంది. ఎల్లలు లేని ఈ సంగీత ప్రపంచంలో ప్రస్తుతం రారాణిగా వెలుగొందుతున్న ఆ యువ గాయకురాలే లేడీ గాగ .

ఆమె మైక్ పట్టుకుందంటే చాలు విశ్వవ్యాప్తంగా అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అనతి కాలంలోనే పాప్ సంగీతానికి దశ-దిశగా ఎదిగిన లేడీ గాగ..పాప్ అభిమానులకు ఆరాధ్య దేవతగా అవతరించింది. గాగ గొంతు నుంచి జాలువారే ప్రతి పదం ప్రస్తుతం సంగీతాన్నే శాసించగలుగుతోందంటే అతిశయోక్తి కాదేమో...

మరి అంతటి శక్తిసామర్థ్యాలున్న లేడీ గాగ ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ 2016లో 5 కస్టమైజ్డ్ డ్రెస్సులు ధరించిన తర్వాత ఫైనల్ గా ఒక స్టన్నింగ్ డ్రెస్ లో రెడ్ కార్పెట్ మీద దర్శనమిచ్చింది. ఆమె డిజైనర్ ఫ్రెండ్ బ్రాడన్ మాక్స్ వెల్ డిజైన్ చేసిన డ్రెస్ లో హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. రెడ్ కార్పెట్ మీద పాప్ సింగర్ నడుస్తుంటే చూడటానికి ఫ్యాబులస్ గా వైట్ ప్లాజో ప్యాంట్ లో డీప్లై నెక్న్ లైన్ తో స్కిన్ రివీల్ చేస్తూ ప్రేక్షకులకు అందాలను కనువిందు చేసింది.


పాప్ సింగర్ లేడీ గాగ ఈ వైట్ డ్రెస్ మీదకు మినిమల్ యాక్సెసరీస్ ధరించింది. ఇక ఎప్పుడూ ట్రెండీగా కనిపించే ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా ఫ్యాన్సీగా కనిపించింది. ఈ లుక్ లో లేడీగాగ ఆస్కార్ రెడ్ కార్పెట్ 2016 ఫ్యాషన్ స్టైల్ ను అంగీకరించింది. గ్లిట్టరింగ్ సిల్వరీ మేకప్ తో మెరిసేటి సింపుల్ జ్యువలరీతో ఒక ఏజింల్ లుక్ ను సొంతం చేసుకుంది. మరి ఆస్కార్ అవార్డ్స్ 2016 లో రెడ్ కార్పెట్ సెలబ్రెటీల్లో లేడీ గాగ ఒక బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీగా మనం చూడవచ్చు.



Click it and Unblock the Notifications
