Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
స్టార్ సిగ్నేచర్ స్టైల్:అమితాబ్ బచ్చన్ ఎక్కువగా అభిమానించే వెల్వెట్ కోట్లు
భారతీయ సినిమాలలో అత్యంత గౌరవాదరణలు కలిగిన అమితాబ్ ఒక లెజెండరీ నటుడు.ఆయన ఖాతాలో ఎన్నో బాక్సాఫీసు విజయాలున్నాయి.అమితాబ్ ఇప్పటివరకూ దాదాపు 180 సినిమాలలో నటించారు.వావ్, ఎన్ని సినిమాలో!.
జంజీర్,దీవార్ సినిమాల ద్వారా అమితాబ్ కి గుర్తింపు లభించింది.జంజీర్ సినిమాలో నటనకి గానూ బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు పడ్డాడు.అమితాబ్ కి అసంఖ్యాక అభిమానులున్నారు.ఆయన అభిమానులు ఆయనని ఫాలో అవుతూ ఆయన తన దుస్తుల విషయం లో అనుసరించే అసమాన స్టైల్ ని తాము కూడా అనుసరించాలనుకుంటారు.

భారత దేశంలో మరియూ విదేశాలలో ఆయన ఒక రోల్ మోడల్.భారతీయ సినిమాకి చేసిన సేవలకి గానూ భారత ప్రభుత్వం ఆయనని, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. సాధించిన ఈ విజయాలే కాకుండా అమితాబ్ తన లుక్స్ విషయం లో చాలా జాగ్రత్త తీసుకుంటారు.
ఆయన అల్ట్రా ఫ్యాషనబుల్ అనచ్చు.ఆయనకంటూ ప్రత్యేకమైన ఒక స్టైల్ ఉంది. అదే ఆయన ఎప్పుడూ ధరించే వెల్వెట్ కోట్లు.ఏదైనా సభలు లేదా అభిమానులకి దర్శనమిచ్చినప్పుడూ ఆయన ఎక్కువగా వెల్వెట్ కోటు ధరించే కనిపిస్తారు.ఆయనకి ఈ వెల్వెట్ కోట్లంటే ఎంత ఇష్టమో చెప్పడానికి మేము కింద ఇచ్చిన మూడు ఉదాహరణలు చూడండి.

మొదటగా తన సినిమా ఆజ్ కీ రాత్ హై జిందగీ ఫస్ట్ లుక్ విడుదల సభ లో ఆయన ధరించీ పూల పూల వెల్వెట్ కోటు.పొడుగైన ఈ అందగాడి మీద ఆ కోటు అసమానం గా వెలిగిపోయింది.పదిహేడేళ్ళ కుర్రడి నుండీ డెబ్భై ఏళ్ళ ముదుసలి వరకూ అమితాబ్ స్టైల్ ని అనుకరించాలనుకుంటారు.
ఇక రెండోది,బ్లాగింగ్ యాప్ విడూదల కార్యక్రమం లో అమితాబ్ బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంటు మీద ధరించిన మెరూన్ వెల్వెట్ కోటు.మెరూన్ కోటు లో అమితాబ్ డాషింగ్ గా కనిపించారు.ఆ కోటు అమితాబ్ ని ప్రత్యేకం గా నిలబెట్టింది అనచ్చు.

ఇక ఆఖరుది ఈ మధ్య ఒక పుస్తక విడుదల కార్యక్రమం లో అమితాబ్ ధరించిన ఒక మెత్తటి కోటు. వెల్వెట్ కోటు కాకపోయినప్పటికీ ఆయన ఆ కోటులో కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు. కాదంటారా??తనకి మాత్రమే ప్రత్యేకం లేదా ట్రేడ్ మార్క్ అనగలిగిన కోటు ధరించినప్పుడు అభిమానులని తన లుక్స్ తో ఎప్పుడూ నిరాశకి గురిచెయ్యారు అమితాబ్.ఈ కార్యక్రమం లో అమితాబ్ ధరించిన గ్రే సూట్ ఆయనకి అతికినట్టుగా సరిపోయింది.



Click it and Unblock the Notifications
