Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
Nirmala Sitaraman: కేంద్ర ఆర్థికమంత్రి ధరించిన చీర ప్రత్యేకత ఇదే..పెద్ద కథే ఉందిగా
ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీర అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రతీ బడ్జెట్ కి ప్రత్యేకతలు ఉండే చీరలను ధరిస్తున్నారు నిర్మలా సీతారామన్. మనదేశ సంస్కృతి, సంప్రదాయాల్ని, హుందాతనాన్ని ప్రదర్శించేలా నిర్మలా సీతారామన్ చీరల్ని ఎంచుకుంటున్నారు. ఎక్కువగా ఆమె చేనేత చీరల్నే ఇష్టపడుతుంటారు. అవే ఎక్కువగా బడ్జెట్ సమయంలో ధరిస్తుంటారు. 2025 బడ్జెట్ వేళ కూడా చేనేతపై ఇష్టాన్ని ప్రదర్శించారు. ఈసారి బీహార్ లోని మిథిలా ప్రాంతంలో సాంప్రదాయ జానపద కళారూపాన్ని తెలిపేలా ఉన్న చీరను ధరించారు.
బంగారు అంచుతో గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, ఒక శాలువాతో నిర్మలాసీతారామన్ ఇవాళ బడ్జెట్ సందర్భంగా కనిపించారు. ఆమె చీరపై హస్త కళాకారులు ముద్రించిన చేపల ఆర్ట్ ఆకట్టుకుంది. ఇది ప్రఖ్యాతి చెందిన మధుబని ఆర్ట్ కళంకారీ చీరె. బిహార్‌లోని మధుబని జిల్లా ఈ కళంకారీకి పెట్టింది పేరు.

ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి నిర్మలాసీతారామన్ కు కానుకగా ఇచ్చారు. ఓ కార్యక్రమం నిమిత్తం కేంద్ర ఆర్థికమంత్రి మధుబని వెళ్లినప్పుడు మిథిల ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన సందర్భంగా దులారీదేవిని కలిసి ముచ్చటించారు. ఆ సమయంలో కళాకారిణి అయిన దులారీవేవి తాను డిజైన్ చేసిన ఈ చేనేత చీరను నిర్మలాసీతారామన్ కి గిఫ్ట్ గా ఇచ్చి బడ్జెట్ రోజున దీనిని ధరించాలని కోరారు.ఇచ్చిన మాట ప్రకారం నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ సందర్భంగా ఈ చీర ధరించారు. కాగా, మధుబని ఆర్ట్స్ తో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీ దేవిని 2021 లోనే పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది.
2019లో తొలిసారిగా కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్.. ఇప్పటివరకు 7సార్లు(2024లో మధ్యంతర, ఓటాన్ అకౌంట్ బడ్జెట్) బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ 8 సార్లు ఆమె ధరించిన చీరల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి 1న కాంతా చీరలోనిర్మలా సీతారామన్ కనిపించారు. అయోధ్యలో అప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో రామా బ్లూ కలర్ చీర ధరించారు. ఈ చేనేత పట్టు చీరపైన గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీ ఉంది.



Click it and Unblock the Notifications
