For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోహపు పాత్రలలో తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా?

లోహపు పాత్రలలో ఆహారం తీసుకోవడం మూలంగా మీ శారీరిక ఆరోగ్యం అనేక రకాలుగా ప్రయోజనం పొందుతుంది. ఆయుర్వేదం ప్రకారం, మీ కఫ, పిత్త మరియు వాత దోషాలు మీరు తినే పాత్రల కారణంగా ప్రభావితమవుతాయని చెప్పబడింది.

|

లోహపు పాత్రలలో ఆహారం తీసుకోవడం మూలంగా మీ శారీరిక ఆరోగ్యం అనేక రకాలుగా ప్రయోజనం పొందుతుంది. ఆయుర్వేదం ప్రకారం, మీ కఫ, పిత్త మరియు వాత దోషాలు మీరు తినే పాత్రల కారణంగా ప్రభావితమవుతాయని చెప్పబడింది. ఈ దోషాలు మానవ శారీరిక ధర్మాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ దోషాలలో ప్రతి ఒక్కటీ మన శరీరంలో వివిధ పాత్రలను కలిగి ఉంటుంది మరియు ఈ దోషాల యొక్క అసమతుల్యత మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కూడా.

Do You Know The Benefits Of Eating In Metal Utensils


ఈ వ్యాసంలో, లోహపు పాత్రలలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరిగింది.

మీ ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే లోహపు పాత్రలు :

1. రాగి

2. వెండి

3. కాంస్యం

4. బంగారం

5. ఇత్తడి

Do You Know The Benefits Of Eating In Metal Utensils

1. రాగి :

తాగునీటిని నిల్వ చేయడానికి తరచుగా రాగి పాత్రలను ఉపయోగించడం పరిపాటి. ఇలా చేయడం మూలంగా మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఉంటుంది. రాగి నిజానికి ఒక యాంటీ మైక్రోబయల్ మెటల్. జర్నల్ ఆఫ్ హెల్త్, పాపులేషన్ అండ్ న్యూట్రిషన్ 2012 లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నీటిని రాగి పాత్రలో 16 గంటలు నిల్వ చేయడం మూలంగా నీటిలో కాలుష్య కారకాలుగా ఉన్న హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేయడంలో మరియు, నీటిని శుద్ది చేయడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది.

రాగి పాత్రలలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు :

1) రక్తం నిర్విషీకరణలో సహాయపడుతుంది

2) మీ జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది

3) బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది

4) అనామ్లజనకాలను అందిస్తుంది

5) క్యాన్సర్ వ్యాధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది

6) మెదడు పనితీరును ప్రేరేపిస్తుంది

Do You Know The Benefits Of Eating In Metal Utensils

2. వెండి :

వెండి పాత్రలు కూడా యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. సూక్ష్మ జీవులను నాశనంచేసే తత్వాలు కలిగి ఉన్నందున, శిశువులకు వెండి ఆధారిత స్పూన్లు మరియు సామానులను ఉపయోగించడం ద్వారా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పురాతన సామ్రాజ్యాలలో రాజులు కూడా వెండి సామాన్లను విపరీతంగా వాడేవారు. వెండి కంటైనర్లలో ఆహారపదార్ధాలు మరియు పానీయాల నిల్వలు, వాటిని భద్రపరుచుకోవడంలోనే కాకుండా, ఎక్కువసేపు తాజాగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

వెండి పాత్రలలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు :

1) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

2) ఫ్లూ, జలుబు వంటి రోగాలతో పోరాడుతుంది.

3) చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

4) క్రిములను చంపుతుంది

Do You Know The Benefits Of Eating In Metal Utensils

3. కాంస్యం :

కాంస్య పాత్రలలో వంట చేయడం మరియు ఆహారం తీసుకోవడం మూలాన, మీ ఆరోగ్యానికి వివిధ మార్గాల్లో సహాయపడుతుందని చెప్పబడింది. కానీ వాటిని వినియోగించేటప్పుడు మిమ్ములను మీరు హాని చేసుకోకుండా జాగ్రత్తవహించవలసిన అవసరం ఉంటుంది. పాతబడిన కాంస్య సామాగ్రిని ఉపయోగించడం మానివేయాలి, ఎప్పటికప్పుడు వాటి స్థానంలో కొత్త పాత్రలను మార్పిడి చేయవలసి ఉంటుంది. పాతబడిన కాంస్య పాత్రలలో ఆర్సెనిక్ వంటి పదార్ధాలు ఉంటాయి. ఈ పదార్ధాలు దీర్ఘకాల వినియోగం మూలంగా మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు.

సిట్రస్ ఆధారిత పండ్లు, టమోటాలు లేదా వెనిగర్ కలిగి ఉన్న ఆహారాన్ని కాంస్య పాత్రలలో ఉంచడం తగదు. మీ ఆరోగ్యానికి అపాయకరమైన ప్రతికూల చర్యలను కలిగించే నెయ్యి, వెన్న మొదలైన వాటిని కాంస్య పాత్రలలో వినియోగించడం మానుకోండి. అంతేకాకుండా, అధిక సమయం కాంస్య పాత్రలలో ఆహారాన్ని నిల్వ చేయకూడదని సూచించబడింది.

కాంస్య పాత్రలలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు :

1) రక్తం శుభ్రపరుస్తుంది

2) ఆకలి పెంచుతుంది

3) జ్ఞాపక శక్తి పెరుగుతుంది

Do You Know The Benefits Of Eating In Metal Utensils

4. బంగారం :

మనలో అనేక మంది బంగారు పాత్రలలో తినేంత స్థోమతను కలిగి ఉండరు. కానీ, వాటిలో ఆహారం తీసుకోవడం మూలంగా మన ఆరోగ్యానికి అనేక మార్గాల్లో సహాయం చేస్తుందని చెప్పబడింది. ఇప్పటికీ వెండి కంచాలలో మద్యలో బంగారు తాపడం చేయించుకుని వినియోగించేవారు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. పూర్వపుకాలాలలో రాజులు, రాణులు భోజనాలకై బంగారు పాత్రలను వినియోగించడం పరిపాటిగా ఉండేది. బంగారు పాత్రలలో ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, బంగారు ఆభరణాలు ధరించడం కూడా మీ ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుందని చెప్పబడింది.

బంగారు పాత్రలలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు :

1) కంటి చూపును మెరుగుపరుస్తుంది

2) మూడు దోషాలను(వాత, పిత్త, కఫ) ఆరోగ్య పద్దతిలో కొనసాగించుటకు సహాయం చేస్తుంది.

3) మీ శరీరాన్ని బలపరుస్తుంది

Do You Know The Benefits Of Eating In Metal Utensils


5. ఇత్తడి :

ఇత్తడి పాత్రలలో 70% రాగి మరియు 30% జింక్ నిక్షేపాలు ఉంటాయి; ఈ లోహాలలోని ఆరోగ్యకర లక్షణాల కారణంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడగలవని చెప్పబడింది. ఇత్తడి పాత్రలలో వంట మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మిగిలిన పాత్రలతో పోల్చినప్పుడు, ఇత్తడి పాత్రలలో వండిన వంటలలో, మీ ఆహారపు పోషక విలువలలో అత్యల్పంగా కేవలం 7 శాతాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. మీ ఆహారాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

ఇత్తడి పాత్రలలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు :

1) రోగనిరోధకశక్తిని పెంచుతుంది

2) వైరల్ వ్యాధులను దూరంగా ఉంచుతుంది

3) శ్వాస సంబంధిత వ్యాధులతో పోరాడుతుంది

4) దీర్ఘకాలిక నొప్పి, పార్కిన్సన్స్ వ్యాధి, మొదలైన వాత సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

English summary

లోహపు పాత్రలలో తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా?

Do You Know The Benefits Of Eating In Metal Utensils
Desktop Bottom Promotion