Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
శరీరంలోని విషపదార్థాలను తరిమికొట్టి.. ఆయుష్షు పెంచే బ్రహ్మాస్త్రం లాంటి 3 ఫుడ్స్!
ప్రతిరోజూ మన ఇంటిని, బయట శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. మన లోపలి అవయవాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. అందులో విషపదార్థాలు (ట్యాక్సిన్స్) లేకుండా ఉన్నప్పుడే అది వంద శాతం చురుగ్గా పనిచేస్తుంది. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం పీల్చే కలుషిత గాలి, తాగే నీరు, తినే కల్తీ ఆహారం ద్వారా అనేక రసాయనాలు, విషపదార్థాలు మన శరీరంలో పేరుకుపోతున్నాయి.

ఇలా వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరు మందగిస్తుంది. జీవక్రియలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ అలసటగా అనిపించడం, ఆలోచనలు స్పష్టంగా లేకపోవడం (బ్రెయిన్ ఫాగ్), జీర్ణ సంబంధిత సమస్యలు, చర్మంపై దద్దుర్లు, ముడతలు రావడం వంటివి జరుగుతాయి. మరి వీటికి చెక్ పెట్టాలంటే శరీరాన్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ (విషపదార్థాల తొలగింపు) చేసుకోవాలి. మన శరీరాన్ని సహజ సిద్ధంగా శుభ్రపరిచి, నవ యవ్వనంగా ఉంచే 3 అద్భుతమైన ఫుడ్స్ ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.
అవిసె ఆకు
అవిసె ఆకు శరీరానికి చేసే మేలు వర్ణనాతీతం. మన పూర్వీకులు ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు లేదా దుఃఖంలో ఉన్నప్పుడు, మరుసటి రోజు తప్పనిసరిగా ఈ ఆకుకూరను వండుకుని తినేవారు. దీని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. ఇది రోగకారక క్రిములు, ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేస్తుంది. నెలకు ఒక్కసారైనా ఈ అవిసె ఆకును కూరగా వండుకుని తింటే, శరీరంలోని మలినాలు, వ్యర్థాలన్నీ డీటాక్స్ అయిపోయి బయటకు వెళ్లిపోతాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

ఉస్తికాయ
చూడటానికి చిన్నగా, తినడానికి కాస్త చేదుగా ఉండే ఉస్తికాయ (Turkey Berry) చేసే మేలు అంతా ఇంతా కాదు. వారానికి కనీసం ఒక్కసారైనా దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది కడుపులో పేరుకుపోయిన నులిపురుగులను సమూలంగా నాశనం చేస్తుంది. పేగులలో వచ్చే అల్సర్, ఇతర జీర్ణకోశ సమస్యలను నయం చేయడంలో దీనికి మించిన మందు లేదు. ఇందులో ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, రక్తహీనతను తరిమికొట్టడానికి సాంప్రదాయ వైద్యంలో దీనిని బ్రహ్మాస్త్రంలా ఉపయోగిస్తారు.

ఉసిరికాయ
ఉసిరికాయను ప్రతిరోజూ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, రోజుకో ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోవని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉసిరిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి, రోగనిరోధక శక్తిని ఉక్కులా మారుస్తుంది. శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడి కణాలను రక్షిస్తుంది. తద్వారా చర్మం నిగారింపుతో మెరుస్తుంది, జుట్టు రాలడం తగ్గుతుంది. మీ శరీరం లోపల, బయట ఎప్పుడూ శుభ్రంగా ఉండాలంటే రోజుకో ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోవడం బెటర్ అని చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications