Latest Updates
-
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు!
ఎండాకాలంలో ఈ 5 తింటే మీ ఆరోగ్యం పదిలం..రుచి,ఆరోగ్యం రెండూ ఒకేసారి
సమ్మర్ లేదా ఎండాకాలంలో ఆరోగ్యంపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈ సీజన్ లో శరీరం వేడికి గురై అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ పై చాలా ఎక్కువ శ్రద్ధ చూపాలి..ఎందుకంటే ఎండాకాలంలో జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది. ఎండాకాలంలో 5 రకాల ఫుడ్స్ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా శరీరం చల్లగా,శక్తివంతంగా ఉంటుంది. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి.
ఎండాకాలంలో తినడానికి 5 బెస్ట్ ఫుడ్స్ ఇవే
పెరుగు అన్నం
సాధారణంగా సమ్మర్ మొదలవగానే ఎండవేడి దెబ్బకి చల్లగా ఏదైనా తినాలపిస్తుంది. ఈ సమయంలో చాలామంది పెరుగు అన్నం తింటుంటారు. ఎండాకాలంలో ఆరోగ్యానికి అనేక రకాలుగా పెరుగు అన్నం మేలు చేస్తుంది. పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో ఎండాకాలంలో తరచుగా వచ్చే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. చర్మాన్ని తేమగా,మృదువుగా ఉంచుతుంది. శరీరంలో కొవ్వను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సమ్మర్ లో శరీరం వేడెక్కకుండా కాపాడుతుంది.

లెమన్ రైస్
నిమ్మకాయ రసంతో చేసే పులిహోర అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. దక్షిణ భారతదేశంలో పొద్దున్నే ఎక్కువమంది తినే ఫుడ్ ఐటమ్స్ లో పులిహోర ఒకటి. ఎండాకాలంలో పులిహోర తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం. ఎండాకాలంలో శరీరంలో వెంటనే అలసిపోతుంది..పులిహోర శరీరానికి తక్షణశక్తినిస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నా భోజనానికి ఇది బెస్ట్ ఆప్షన్. పులిహోర తయారీకోసం కొందరు ఎక్కువనూనె వాడతారు. అయితే వేసవిలో అధిక నూనె తీసుకోవడం వల్ల అజీర్ణం,ఇతర సమస్యలు వస్తాయి కాబట్టి పులిహోరను తక్కువ నూనెతో తీసుకుంటే మంచిది.
వెజ్ పులావ్
ఎండాకాలంలో వెజ్ పులావ్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వెజ్ పులావ్ లో ఎక్కువగా కూరగాయలు,బియ్యం ఉంటాయి. ఇవి తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి కావాల్సిప విటమిన్లు,ఫైబర్,మినరల్స్ లభిస్తాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. కూరగాయలలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది..అలాగే వండేటప్పుడు నీళ్లు ఉపయోగిస్తారు. దీంతో ఇది డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ నూనెతోనే దీనిని తయారుచేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది..ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
టమాటో రైస్
టమాటో రైస్ కూడా చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఎండాకాలంలో మధ్యాహ్నా భోజనంగా టమాటో రైస్ తీసుకోవచ్చు. సాధారణంగా ఎండాకాలంలో కొన్నిసార్లు ఆకలి మందగిస్తుంది కాబట్టి ఇది ఆకలిపి పెంచడానికి సహాయపడుతుంది. టమాటోలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. టమాటోలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సమ్మర్ లో రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సి చాలా అవసరం. టమాటోల్లో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కిచిడి
బియ్యం, పెసర పప్పుతో చేసే కిచిడి సమ్మర్ లో తినడానికి బెస్ట్ ఫుడ్. ఎండాకాలంలో కడుపుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది. డీహైడ్రేషన్ నివారించడానికి సహాయపడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారికి ఇది తినడానికి మంచిది. తర్వగా జీర్ణం అయిపోతుంది. కిచిడిలో దోసకాయ,సొరకాయ వంటి నీటిశాతం ఎక్కువ ఉండే కూరగాయలు జోడిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications