Latest Updates
-
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
మీ బ్రెయిన్ పవర్ పెరగాలా? ఎయిమ్స్ డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్స్ మీకోసమే!
మన శరీరంలో గుండె, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి మనం ఎంతగానో శ్రద్ధ తీసుకుంటాం. కానీ ఈ అవయవాలన్నింటినీ నియంత్రిస్తూ, శరీరమంతటికీ క్షణాల్లో సందేశాలను పంపే మన దేహానికి కమాండ్ సెంటర్ లాంటి మెదడు గురించి ఎప్పుడైనా ప్రత్యేకంగా ఆలోచించామా? మన దైనందిన జీవితంలో మెదడు పాత్ర వెలకట్టలేనిది. అందుకే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం అత్యంత అవసరం.

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ (AIIMS) హాస్పిటల్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రియాంక షెహ్రావత్, మెదడును ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడానికి అవసరమైన పలు కీలక విషయాలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. కేవలం మనం తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా, కొన్ని ప్రత్యేకమైన రోజువారీ అలవాట్లు మన మెదడును ఎలా చురుకుగా ఉంచుతాయో ఆమె సులభంగా వివరించారు.
విటమిన్ బి12: మెదడుకు ప్రాణాధారం
మెదడు, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అత్యంత కీలకమైన పోషకం విటమిన్ బి12. ఇది మెదడుకు ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే..చిన్నచిన్న విషయాలకే మతిమరుపు రావడం, ఏకాగ్రత దెబ్బతినడం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా నరాల బలహీనత, చేతులు, కాళ్లలో తరచుగా తిమ్మిర్లు రావడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ రోజువారీ డైట్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉండేలా చూసుకోవడం మెదడు ఆరోగ్యానికి తొలిమెట్టు.
మెదడును ఉరకలెత్తించే సూపర్ ఫుడ్స్
మీరు తినే ఆహారమే మీ మెదడు తీరును నిర్ణయిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఆహారాలు మెదడుకు అమృతం లాంటివి. ప్రతిరోజూ మీ భోజనంలో గుప్పెడు వాల్‌నట్‌లు, బాదంపప్పులతో పాటు తాజా ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోండి. వాల్ నట్ లు, బాదంపప్పులలో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లంతో పాటు మెదడుకు అవసరమైన అనేక అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచి, మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేస్తాయి.
కంటినిండా నిద్ర.. మెదడుకు భద్ర
శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, రోజంతా శ్రమించే మెదడుకు కూడా అంతే అవసరం. మీ మెదడు మరుసటి రోజు చురుకుగా పనిచేయాలంటే ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నాణ్యమైన నిద్ర తప్పనిసరి. సరైన నిద్రలేకపోతే మీ పనితీరు గణనీయంగా పడిపోతుంది. అందుకే రాత్రిపూట ఒకే సమయానికి పడుకుని, ఉదయం ఒకే సమయానికి నిద్రలేచే అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పడుకునే ముందు మొబైల్స్, టీవీలు చూడటం (స్క్రీన్ టైమ్) పరిమితం చేయడం వల్ల గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
బ్రెయిన్ జిమ్ తో అద్భుతమైన చురుకుదనం
శరీరానికి వ్యాయామం చేసినట్లే, మెదడుకు కూడా వ్యాయామం అవసరం. దీనినే 'బ్రెయిన్ జిమ్' అంటారు. ఉదాహరణకు మీరు సాధారణంగా కుడి చేతితో చేసే పనులను అప్పుడప్పుడు ఎడమ చేతితో చేయడానికి ప్రయత్నించండి. చేతులను మార్చి పనులు చేయడం వల్ల మెదడులోని ఎడమ, కుడి రెండు భాగాలు ఉత్తేజితం అవుతాయి. ఇది మీ మానసిక చురుకుదనాన్ని అమాంతం పెంచుతుంది. ఆలోచనా పరిధిని విశాలం చేస్తుంది.
శారీరక దృఢత్వమే.. మానసిక బలం
ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. మెదడు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే శారీరక వ్యాయామం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు, వాకింగ్ లేదా రన్నింగ్ చేయండి. అలాగే కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా సరైన భంగిమను పాటించండి. మెడ, వెన్ను కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయడం వల్ల మెదడుకు రక్తప్రసరణ సజావుగా సాగి, ఒత్తిడి దూరమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
