Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నిశ్శబ్దంగా వచ్చే మృత్యువు..జిమ్ లో, పెళ్లిలో కుప్పకూలుతున్న యువత..AIIMS రిపోర్ట్ లో సంచలన నిజాలు
సోషల్ మీడియాలో ఈ మధ్య మనం తరచూ చూస్తున్న వీడియోలు..పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వరుడు, బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలిన క్రీడాకారుడు, లేదా జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు. ఎలాంటి అనారోగ్యం లేని, పూర్తి ఫిట్ గా కనిపించే యువత ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడుస్తుంటే..అసలేం జరుగుతోందన్న ఆందోళన ప్రతి కుటుంబంలోనూ మొదలైంది.
ఈ హఠాన్మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS)..ఐసీఎంఆర్ (ICMR) సహకారంతో ఒక అధ్యయనాన్ని చేపట్టింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో ప్రచురితమైన ఈ రిపోర్ట్ గుండె బద్దలయ్యే నిజాలను బయటపెట్టింది.

యువతే టార్గెట్
మే 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షల్లో హఠాన్మరణం చెందిన వారిలో ఏకంగా 57.2 శాతం మంది 18 నుండి 45 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. వీరిలో అత్యధికులు పురుషులే. చనిపోవడానికి ఒక గంట ముందు వరకు వీరంతా తమ పనుల్లో చురుగ్గా ఉన్నవారే.
అసలు కారణం ఇదేనా?
చాలామంది అనుమానిస్తున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ దీనికి కారణం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ మరణాలకు ప్రధాన కారణం మన జీవనశైలి,అంతర్గత ఆరోగ్య సమస్యలే.
నిశ్శబ్దంగా వచ్చే గుండెపోటు
యువతలో సంభవించిన హఠాన్మరణాల్లో 42.6 శాతం కేసులకు గుండె జబ్బులే కారణం. పోస్టుమార్టంలో తేలింది ఏంటంటే.. వీరి గుండె రక్తనాళాల్లో 70 శాతానికి పైగా పూడికలు (బ్లాకేజెస్) ఉన్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా, లోపల గుండె మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉందని ఇది నిరూపిస్తోంది.
అంతుచిక్కని మరణాలు
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే..21.3 శాతం కేసుల్లో మరణానికి స్పష్టమైన కారణం పోస్టుమార్టంలో కూడా దొరకలేదు. వైద్య పరిభాషలో వీటిని గుండెలో తలెత్తే విద్యుత్ లోపాలుగా(ఎలక్ట్రికల్ డిసార్డర్స్)అనుమానిస్తున్నారు. ఇవి జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ. గుండె నిర్మాణం బాగానే ఉన్నా దాని లయ తప్పడం వల్ల మరణం సంభవిస్తుంది.
శ్వాసకోశ సమస్యలు,మద్యం
క్షయ (TB), న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులు కూడా యువత ప్రాణాలను హరిస్తున్నాయి. ఇక మితిమీరిన మద్యం సేవించడం వల్ల, నిద్రలో వాంతులు లేదా ఇతర ద్రవాలు శ్వాసనాళంలోకి వెళ్లి ఊపిరి ఆడక చనిపోయిన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది.
మనం ఏం చేయాలి?
నిపుణుల సూచన ప్రకారం..నాకు వయసు తక్కువ, నేను ఫిట్ గా ఉన్నాను అనే అపోహను యువత వీడాలి. 25 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ (ECG), గుండె పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులో గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే, జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది.
స్మోకింగ్, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. గుండె అనేది ఒక ఇంజిన్ లాంటిది. అది ఆగిపోయేంత వరకు పని చేస్తూనే ఉంటుంది, కానీ ఆగిపోయాక మనం చేయగలిగింది ఏమీ ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications