లైంగిక సమస్యలకు దివ్యౌషధం..మహిళలకు అయితే ఆ నొప్పులు కూడా మాయం

ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న చాలా జంటలలో సంతాన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం లేదని వాపోతున్నాయి జంటలు. పిల్లల కోసం రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నా కొందరికి ఫలితం లేకుండా పోతుంది. అయితే ఆయుర్వేదంలో ఇలాంటివాటికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మూలికలు సంసతాన సమస్యలు, లైంగిక సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి ఆయుర్వేద మూలికల్లో శతావరి టాప్ ప్లేస్ లో ఉంటుంది.

వేల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో శతావరి ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీని శాస్త్రీయ నామం ఆస్పరాగస్ రేసిమోసస్(asparagus racemosus). ఈ మూలిక మహిళల ఆరోగ్యానికి ఒక దివ్యౌషధం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఇది కేవలం మహిళలకే మాత్రమే కాదండోయ్ పురుషులు,పిల్లలు కూడా దీని ప్రయోజనాలను పొందవచ్చు. శతావరిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, ఫోలేట్, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు శతావరిలో లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శారీరక,మానసిక,చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి శతావరి సహాయపడుతుంది.

amazing health benefits of shatavari this ayurvedic herb increase sperm count solves fertility issues

శతావరి ప్రయోజనాలు ఇవే

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
రోగనిరోధక శక్తిని పెంచడంలో శతావరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాలను నష్టం నుండి కాపాడతాయి. శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారు శతావరిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పురుషులకు మేలు
శతావరి కేవలం మహిళలకే కాదు, పురుషుల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరమైనది. శతావరి పురుషులలో సంతానోత్పత్తి శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం శతావరిలోని సారం వీర్య కణాల సంఖ్యను పెంచడం ద్వారా పురుషులలో వంధ్యత్వ సమస్యను తగ్గిస్తుంది. దీనివల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది కాబట్టి పురుషులకు ఉపయోగకరంగా ఉంటుంది.

మహిళలకు దివ్యౌషధం
శతావరి స్త్రీల ఆరోగ్యానికి ఒక దివ్యౌషధం. దీనిని స్త్రీ టానిక్ గా వర్ణిస్తారు. శతావరి మహిళల్లో సంతానోత్పత్తికి, లైంగిక ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తుంది. పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వారు ఈ మొక్కను తినడం వల్ల గర్భం దాల్చడం సులభం అవుతుంది. పాలిచ్చే తల్లులు దీన్ని సేవించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. రుతుక్రమం సక్రమంగా లేని సమస్యలను కూడా తగ్గిస్తుంది, పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి,నడుము నొప్పిని నివారిస్తుంది. మెనోపాజ్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలైన వేడి ఆవిర్లు, మానసిక కల్లోలం, నిద్రలేమి వంటి వాటిని కూడా శతావరి తగ్గిస్తుంది. శతావరి హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి, లైంగిక కోరికలను పెంచడానికి సహాయపడుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
శతావరి చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. చర్మం ఆరోగ్యానికి అవసరం అయే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి శతావరి సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
శతావరి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. శతావరిలో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని నివారించడానికి, ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే సమస్యలను శతావరి తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

శారీరక, మానసిక బలాన్ని పెంచుతుంది
శారీరక, మానసిక అలసటను నివారించడంలో శతావరి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నరాలను శాంతపరచడానికి, మంచి నిద్రను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. శతావరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా,శక్తివంతంగా ఉంటారు.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది
శతావరి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది, శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా శతావరి నివారిస్తుంది, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

శతావరిని ఎలా ఉపయోగించాలి?
శతావరిని వివిధ రూపాల్లో ఉపయోగించవచ్చు. శతావరి చూర్ణం, శతావరి క్యాప్సూల్స్, శతావరి సిరప్, శతావరి టాబ్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. శతావరి చూర్ణాన్ని పాలతో లేదా నీటితో కలిపి తీసుకోవచ్చు. శతావరి క్యాప్సూల్స్, టాబ్లెట్లను నేరుగా నీటితో తీసుకోవచ్చు. శతావరి సిరప్‌ను నేరుగా లేదా నీటిలో కలిపి తీసుకోవచ్చు.
దీనిని ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు ఉపయోగించడం మంచిది. కొంతమందికి శతావరి అలెర్జీని కలిగిస్తుంది. అధిక మోతాదులో తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, March 22, 2025, 14:02 [IST]
Desktop Bottom Promotion