Latest Updates
-
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తూ పడుకుంటున్నారా?.. మీకు ఈ సమస్యలు రావడం పక్కా!
ప్రతి ఒక్కరూ రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మొబైల్ చూస్తూ పడుకుంటున్నారు. ఇది సర్వసాధారణమైన ప్రక్రియగా మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు పడుకునే ముందు కొంత సేపు రీళ్లు చూస్తూ నిద్రపోతారు. కొంతమంది మొబైల్ ఫోన్ పట్టుకుని అలానే నిద్రపోతారు. కొంతమంది అయితే తెల్లారేవరకు మొబైల్ చూసి తెల్లారిన తరువాత పడుకునే వ్యక్తులు ఉన్నారు.
మీకు కూడా నిద్రపోయే ముందు రీల్స్ చూసే అలవాటు ఉంటే ఈ వార్త తప్పక చదవండి. ఎందుకంటే పడుకునే ముందు రీల్స్ చూడటం వల్ల మీకు ఎలాంటి హాని కలుగుతుందో ఈ స్టోరీలో వివరించాము పూర్తిగా చదవండి. BMC జర్నల్‌లో ప్రచురించబడిన ఇటీవలి అధ్యయనం ప్రకారం, పడుకునే ముందు రీల్స్ చూడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని తేలింది. ఆ సమస్యలు ఏంటంటే?

అధిక రక్తపోటు
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ టీమ్ జరిపిన ఈ స్టడీలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా, పగటిపూట కంప్యూటర్ ముందు, టీవీ ముందు లేదా వీడియో గేమ్‌లు ఆడటం కంటే రాత్రి పడుకునే ముందు రీల్స్ చూసినప్పుడు రక్తపోటు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. నిద్రపోతున్నప్పుడు రీల్స్ చూడటం అనేది యువకులలో హై బీపీకి కారణమవుతుందని పేర్కొన్నారు.
నిద్ర పట్టదు
రాత్రిపూట కళ్లపై ఎక్కువ నీలిరంగు లైట్లు పడటం వల్ల నిద్ర పట్టదు. దీనివల్ల శరీర బరువు పెరగడం, కళ్ళుపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరగడం, యూరిక్ యాసిడ్ పెరగడం వంటి సమస్యలు వస్తాయని తెలిసింది.
గతంలో దీనిపై బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు విశ్లేషణాత్మకంగా వివరణను అందించారు. రాత్రిపూట రీళ్లు చూడటం వల్ల అధిక రక్తపోటు, రక్తపోటు వస్తాయని బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు వివరించాడు. అలాగే చిన్న పిల్లలు కూడా రాత్రి పడుకునే ముందు మొబైల్ చూడడం వల్ల వారిలో మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని, వారిలో నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే మొబైల్స్ బంద్ చేయడం మేలు.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన అంశాలన్నీ పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అవి కచ్చితమైనవి అని మేము చెప్పడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications