Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
Smart Watches: స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా? అయితే ఈ రోగాలు రావడం ఖాయం!
ప్రస్తుత కాలంలో అందంగా కనిపించడం, ఫ్యాషన్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఒక మనిషి ఎలాంటి వాడో అనేది కేవలం అతడిని చూసి చెప్పేస్తున్నారు. అందుకే చాలా మంది స్మార్ట్ వాచెస్ ధరిస్తుంటారు. అయితే స్మార్ట్ వాచ్ ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఈ స్మార్ట్ వాచ్ తీవ్రంగా నష్టపరుస్తాయని పేర్కొంటున్నారు. ఈ స్మార్ట్ వాచ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏ విధమైన రోగాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చర్మ వ్యాధులు
అందంగా కనిపించాలని, పైగా ఫ్యాషన్‌తో ఉండాలని చాలా మంది స్మార్ట్ వాచెస్ వేసుకుంటూ ఉంటారు. అయితే అవే పెను ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ స్మార్ట్ వాచెస్ వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ తయారీలో పాటీ ఫ్లోరో అల్కైల్, పర్‌ప్లోరో హెక్సనోయిక్ యాసిడ్స్ ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతగానో హాని చేస్తాయి. ఇవి శరీరంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు.

ఈ రసాయనాలు శరీరంలో సులభంగా కలిసిపోవు. పైగా శరీరంపై అలానే అంటుకొని ఉంటాయి. దీని కారణంగా సమస్యలు వస్తాయి. ఈ రసాయనాల వల్ల సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్, చర్మ సమస్యలు, చర్మ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
సుమారు 21 రకాల స్మార్ట్ వాచెస్‌ను పరిశీలించిన తరువాత ఈ నిర్ధారణకు వచ్చామని దీనిపై పరిశోధనలు జరిపిన నిపుణులు పేర్కొంటున్నారు. రోజులో ఎక్కువ సేపు స్మార్ట్ వాచెస్ ధరించి ఉంటున్న వ్యక్తులకే ఈ రోగాలు వస్తాయని చెబుతున్నారు. మితంగా చాలా తక్కువగా స్మార్ట్ వాచ్ ధరించే వారికి ప్రమాదం తక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.
స్మార్ట్ వాచెస్ వల్ల ఉపయోగాలు
స్మార్ట్ వాచెస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన సంఘటనల్లో కొందరి ప్రాణాలు కూడా కాపాడతాయి. మనం ఎంత ఫిట్‌గా ఉన్నాము, ఎలాంటి పనులు చేస్తున్నాము?, ఎంత దూరం నడుస్తున్నాము అనేది మనకు తెలుపుతూ ఉంటుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నా ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
