Latest Updates
-
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.!
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం, చురుగ్గా ఉండేందుకు ప్రతిరోజూ యోగా చేయడం తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. యోగా ద్వారా శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా, సంతోషంగా ఉంటారు. అయితే యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. కొన్ని ఆసనాలు వేయడం సులభమైతే, మరికొన్ని చాలా కష్టంగా ఉంటాయి. ఈ క్రమంలో మొదటిసారి యోగా చేయడం ప్రారంభించిన వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

గతంలో యోగా చేయాలనుకునేవారు సమీపంలోని యోగా సెంటర్లకు వెళ్లేవారు. కానీ సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది యోగాకి సంబంధించి ఇన్‌స్టా, యూట్యూబ్ ఇలా పలు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సులభంగా చేయగలుగుతున్నారు. మరికొందరు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా యోగా నేర్చుకుంటున్నారు. అయితే కొత్తగా యోగా మొదలుపెట్టినవారు ట్రైనర్ లేకుండా చేయాలని భావిస్తున్నట్లయితే ఈ పొరపాట్లు చేయకూడదని.. లేదంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యోగా సాధన ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడినా, కొన్ని తప్పులు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కండరాలకు గాయం కావడం, అలసట, గుండెపై ఒత్తిడి, ఆయాసం, తలతిరగడం ఇంకా పలు రకాల సమస్యలు తలెత్తవచ్చు. అందుకే యోగా ప్రారంభించేముందు ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.
వార్మప్‌ను నిర్లక్ష్యం చేయొద్దు
జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లకు ముందు వార్మప్ చేయడం ఎంత అవసరమో, యోగాసనాలు వేసే ముందు కూడా దానికి శరీరాన్ని సిద్ధం చేసుకోవడం అంతే అవసరం. మీరు ఇంట్లో డైలీ పనులు పూర్తి చేసుకున్న తర్వాతే యోగాలోకి దిగాలి. వార్మప్ చేసిన అనంతరం మీకు శరీరానికి తగిన యోగాసనాలు వేయండి. లేదంటే క్లిష్టమైన వ్యాయమాలు వేసేటప్పుడు కండరాలు అలసిపోయే ప్రమాదం ఉంది.

శ్వాస తీసుకోవడంలో ఈ పొరపాట్లు వద్దు
యోగా, ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాసపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. శ్వాస విధానంలో తప్పులు ఉంటే మీ శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా అంతర్గత అవయవాలపై కూడా తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తుందని నిపుణులు అంటున్నారు.

అధిక ఒత్తిడి ప్రభావం
మీరు యోగా సాధన చేయడం ప్రారంభించినప్పుడు కష్టమైన ఆసనాలను మొదటిరోజే మొదలుపెట్టకండి. కఠినమైన ఆసనాలు చేయడానికి మీ శరీరం సిద్ధంగా ఉన్నప్పుడే వాటి జోలికి వెళ్లాలి. ముందుగా సింపుల్‌గా ఉండే యోగాసనాలతో మొదలుపెట్టి మీ బాడీ చెప్పినట్లుగా కఠినమైన యోగాసనాలు మెల్లగా ప్రాక్టీస్ చేయకండి. సాధారణంగా కఠినమైన ఆసనాలు వేయడానికి ట్రైనర్లు కొన్ని చిట్కాలను చెబుతారు. ఆ చిట్కాలు తెలియకుండా మీ శరీరాన్ని ఎక్కువగా వంచితే అది కండరాలు, కీళ్లపై ప్రభావం చూపించవచ్చు.
భంగిమపై అవగాహన
యోగాసనాల సమయంలో మీరు వేసే ఆసనానికి సంబంధించి సరైన భంగిమలపై అవగాహన ఉండాలి. శరీర అమరిక, భంగిమ సరిగా లేకపోతే మీపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ఇలా యోగాను మీరు మొదటిసారి ప్రారంభించినప్పుడు వార్మప్‌తో మొదలు పెట్టి యోగాసనాలు వేసుకోవాలి. యోగా సెషన్ ముగిసిన తర్వాత విశ్రాంతి భంగిమ లేదా శవాసనం వేయడం చాలా ముఖ్యం. దీంతో శరీరానికి యోగా ప్రయోజనాలు అందుతాయి. లేదంటే మానసికంగా అలసట, కండరాల నొప్పికి దారితీయవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
