Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కె అహితేజ గారి సూచనలు..
ఈ వర్షా కాలంలో కొంచెం జలుబు చేయగానే మెడికల్ షాపులకు వెళ్లి మందులు తెచ్చుకొని వేసుకుంటారు. అలా చేస్తే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది. చిన్న జలుబుకు కూడా ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆరోగ్యకరం కాదు. ఆయుర్వేద వైద్యులు ఈ వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు వివరించారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని శ్రీ ధృతి ఆయుర్వేద పంచకర్మ చికిత్సాలయంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కె. అహి తేజ గారు మనకు వర్షా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. వాటిని ఆయన మాటల్లోనే నేరుగా తెలుసుకుందాం.

వార్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ చల్లని వాతావరణంలో మనకు ఇమ్యునిటీ చాలా అవసరం, లేదంటే రోగాల బారిన పడతాము. ఇమ్యునిటీ బాగా ఉండాలంటే ముందుగా ఆహారంపైన దృష్టి పెట్టాలి. ఆహారం ద్వారా మాత్రమే మనం ఇమ్యునిటీని పూర్తిగా పెంచుకోవచ్చు. ఇదే సరైన విధానం కూడా. పోషకాలు బాగా తీసుకుంటే ఇమ్యునిటీ మనకు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.ఇమ్యునిటీలో కూడా రెండు రకాలుంటాయ్. యాక్టివ్ ఇమ్యునిటీ, ఇంకా ప్యాసివ్ ఇమ్యునిటీ. ఆహారం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగితే దాన్ని యాక్టివ్ ఇమ్యునిటీ అంటాం, మందుల ద్వారా రోగనిరోధక శక్తి పెరిగితే దాన్ని ప్యాసివ్ ఇమ్యునిటీ అంటాము.

ఇమ్యునిటీ పెరగాలంటే వైటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. నేరుడు పండు, బత్తాయ్, టమాట, కివి పళ్లు, ఇవి తీసుకోవడం వల్ల మనకు ఇమ్యునిటీ పెరిగి చాలా దోహదపడుతుంది.ఆకుకూరలు లాంటివి తీసుకోవడం కూడా మంచిదే, అయితే వీటిని గోరువెచ్చని నీళ్లల్లో కడిగి వండుకోవాలి. ఈ వర్షాకాలంలో కాకరకాయ తినడం కూడా చాలా మంచిది. పసుపును కూడా వంటకాల్లో వాడడం వల్ల శరీరంలో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే బయటకు వెళ్లిపోతుంది.
నీటిని కూడా కాచుకొని తాగాలి. ఎండా కాలంలో రోజుకి సుమారు 4 లీటర్ల నీటిని తాగుతాం. అయితే ఈ వర్షాకాలంలో 2.5 నుంచి 3 లీటర్ల వరకు తాగాలి. ఇమ్యునిటీ పెరగాలంటే శరీరంలో నీళ్లు కూడా చాలా అవసరం, లేదంటే రోగనిరోధక శక్తి పెరగదు. ఆహారంతో పాటు నిద్రకూడా చాలా అవసరం. నిద్ర లేకపోతే కూడా ఇమ్యునిటీ పడిపోతుంది. ప్రతీ రోజు కనీసం 6 గంటల నుంచి 8 గంటల వరకు కచ్ఛితంగా నిద్రపోవాలి. ఈ రోజు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా రోజుకు 6 గంటలు మాత్రం కచ్ఛితంగా నిద్రపోవాల్సిందే.
ప్రతీ రోజు అరగంట సేపు యోగా, లేదంటే వ్యాయామం చేయాలి. ప్రస్తుతం కేరళలో నిఫా వైరస్ లాంటివి వ్యాపిస్తున్నాయి.చర్మ రోగాల బారినపడకుండా ఉండాలంటే స్నానపు నీటిలో వేపాకులను ఉపయోగించాలి. వేపాకుల్లో యాంటీ వైరల్ లక్షణాలుంటాయ్. రోజు రాత్రి పాలల్లో 1 చిటికెడు పసుపు గోరువెచ్చని పాలల్లో వేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి ఆకులను తినడం, లేదంటే మనం తాగే టీలో వేసుకొన్నా ఇమ్యునిటీ పెరుగుతుంది. అల్లం, శొంటి లాంటివి నీళ్లల్లో కలుపుకొని తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉంటాయ్.
వర్షాకాలంలో బయట వెళ్లి వచ్చే వారు స్నానం చేయడం మానేస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. వర్షాకాలమైనా తప్పకుండా తలస్నానం చేయాలి. నువ్వుల నూనెను తలకు రాసుకొని తలంటుకోవడం చేయడం వల్ల ఈ వర్షాకాలంలో తలకు కావాల్సిన వేడి అందుతుంది.
పైన ఇచ్చిన వివరాలన్నీ ఆయుర్వేద డాక్టర్ కె అహి తేజ ఇచ్చారు. ఉప్పల్‌లో శ్రీ ధృతి ఆయుర్వేద పంచకర్మ చికిత్సాలయంలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయుర్వేదంలో ఎండి పూర్తి చేశారు. పంచకర్మ చేయడంలో నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications