Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేస్తే చనిపోతారట.. పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా అందరి జీవితాలు మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని కూడా మార్చుకుంటున్నారు. అందుకే చిన్నతనంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో 45 దాటిన తరువాత వచ్చే బీపీలు, షుగర్‌లు, మధుమేహం, డయాబెటిక్, ఒబేసిటీ చిన్న తనంలోనే వచ్చేస్తున్నాయి. పదేళ్లు నిండని వారికి కూడా షుగర్ వ్యాధి వచ్చి పడుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది. అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అప్పటి వరకు మన కళ్ళముందే ఆఫీసులో పని చేస్తూ పార్టీల్లో డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో మృతి చెందుతున్నాడు. ఈ గుండెపోటు మరణాలపై తాజాగా జరిపిన అధ్యయనంలో సంచనల నిజాలు వెలుగులోకి వచ్చాయి. చలికాలంలో కొంతమంది చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

చల్లని నీటితో స్నానం చేస్తే గుండెపోటు..
చలికాలంలో చాలా మంది చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. ఇది గుండెపోటుకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు చల్లని నీళ్లను ఒక్కసారిగా తలమీద పోసుకున్నప్పుడు ఒక్కసారిగా రక్తప్రసరణ సంకోచానికి గురవుతుంది. దీనివల్ల రక్త ప్రసారంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలా అంతరాయం ఏర్పడినప్పు గుండెపోటు సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకే స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేయండి..
అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి, ఈ ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు పరిష్కార మార్గం కూడా ఉందని వెల్లడించారు. చలికాలంలో చల్లని నీటితో స్నానం చేసేటప్పుడు నీటిని మొదటగా తలపైన కాకుండా.. ముందు కాళ్ళ మీద, వీపు మీద, మెడ మీద పోసుకోవాలట. ఆ తరువాత తలపై పోసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా చలికాలంలో వేడి నీళ్లతో లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని నిపుణులు చెబుతారు. కానీ నీళ్లు అందుబాటులో లేని వ్యక్తులు పైన పేర్కొనబడిన విధంగా చేయాలని వెల్లడించారు.
చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
చల్లని నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి మన శరీరానికి కనిష్ట ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. అలాగే చర్మంలోని తేమ పోకుండా అలానే సురక్షితంగా కనిపిస్తుంది. చర్మం పొడి బారడం, పగిలిపోవడం వంటి సమస్యలు సతాయించవు. అందుకే చలికాలంలో వేడి నీటితో కన్నా చల్లని నీటితో స్నానం చేయడం మంచిదే, కానీ పైన వెల్లడించిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన విషయాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను బోల్డ్ స్కై తెలుగు నిర్ధారించడం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications