Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పెరుగులో ఇది కలిపి తింటే..షుగర్ టెన్షనే ఉండదు,బరువు తగ్గడానికి సులభమైన మార్గం!
ప్రస్తుతం అందరి లైఫ్ లు బిజీగా మారిపోయాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. సమయానికి తినకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర , ఊబకాయం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇవి రెండూ మనల్ని అనేక ఇతర జబ్బుల బారిన పడేలా చేస్తాయి. అయితే ఈ సమస్యలకు మన వంటింట్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం దాగి ఉంది. అదే పెరుగు, అవిసె గింజల కలయిక. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగులో కొద్దిగా అవిసె గింజల పొడిని కలిపి తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.
ఈ ఆరోగ్యకరమైన కలయికతో లాభాలెన్నో
రక్తంలో చక్కెర అదుపులో
అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా రిలీజ్ అయ్యేలా చూస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా కంట్రోల్ లో ఉంటాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.

బరువు తగ్గడానికి సులువైన మార్గం
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరం. అవిసె గింజల్లోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. పెరుగులోని ప్రోటీన్ జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వు కరిగేలా ప్రోత్సహిస్తుంది.
జీర్ణవ్యవస్థకు బలం
పెరుగు,అవిసె గింజల కలయిక జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అవిసె గింజల్లోని పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తే.. పెరుగులోని మంచి బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గుండెకు రక్షణ
అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని దూరం చేస్తాయి. పెరుగు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం
అవిసె గింజలను నేరుగా కాకుండా, దోరగా వేయించి పొడి చేసుకుని లేదా నానబెట్టి తినడం ఉత్తమం. ఎందుకంటే అప్పుడే శరీరం వాటిలోని పోషకాలను పూర్తిగా గ్రహిస్తుంది. కాబట్టి రోజూ ఒక కప్పు పెరుగులో చెంచాడు అవిసె గింజల పొడిని కలుపుకుని తినండి. అవిసె గింజలను మరీ ఎక్కువగా తినవద్దు, ఇది గ్యాస్ లేదా అజీర్తికి కారణం కావచ్చు. గర్భిణులు, లో బీపీ ఉన్నవారు,ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
