Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
బెండకాయ కూర తింటున్నారా?.. అయితే ముందుగా ఈ విషయం తెలుసుకోండి.. లేకపోతే ఇక అంతే!
మనలో చాలా మందికి బెండకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది బెండకాయను తింటూ ఉంటారు. అయితే బెండకాయ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ బెండకాయను తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని పలు నివేదికల్లో వెల్లడైంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు ఇంకా చాలా మంది ఉపయోగాలు ఈ బెండకాయతో లభిస్తాయట. ఆ ఉపయోగాలు ఏంటి? బెండకాయ తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు
బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా మంచిదట. తరచుగా బెండకాయను తినడం వల్ల.. చర్మం మృదువుగా మారడంతో పాటు నిగనిగలాడుతుందని చెబుతున్నారు. ఈ బెండకాయలో విటమిన్ సీ, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి తినడం వల్ల చర్మం కాంతి వంతంగా మెరిసిపోతుంది. ఈ బెండకాయలు తినడం వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది.

క్లియర్ కట్ చర్మం..
బెండకాయలను తినడం వల్ల చర్మం క్లియర్ కట్‌గా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు, ముడతలు లేకుండా ఉండాలంటే.. బెండకాయ పేస్ట్‌ను మెత్తగా రుద్దుకొని ముఖంపై పూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా బెండకాయలోని ఔషధ గుణాలు ముఖంపై ఉండే ముడతలు, మొటిమలు, మచ్చలను దూరం చేస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.
చర్మం తాజాగా ఉండడం..
ఈ చలికాలంలో చర్మం తరచుగా పొడిబారుతూ ఉంటుంది. చర్మం పొడిబారకుండా ఎప్పుడూ తాజాగా ఉండాలంటే బెండకాయతో ఫేస్ మాస్క్ తయారుచేసుకోవాలి సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల.. ముఖం ఎప్పుడూ తాజాగా కనిపిస్తుందని చర్మ నిపుణులు పేర్కొంటున్నారు.
కొలాజెన్ ఉత్పత్తి అవుతుంది..
చర్మం అందంగా కనిపించాలన్నా, ఎప్పుడూ యవ్వనంగా ఉండాలన్నా మన శరీరంలో కొలాజెన్ తగిన మొత్తంలో ఉండాలి. అయితే ఈ బెండకాయ కూరను తరచుగా తిన్నా, బెండకాయ ఫేస్ మాస్క్ వేసుకున్నా కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, చర్మం అందంగా యవ్వనంగా మారుతుంది. చాలా అందంగా కనిపిస్తుంది.
చుండ్రు సమస్యకు చెక్..
మనలో చాలా మందిని వెంటాడే సమస్య చుండ్రు. ఈ సమస్యను చెక్ పెట్టేందుకు చాలా మంది చాలా రకాల టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయితే బెండకాయ రసాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ రసాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య తొలిగిపోవడంతో పాటు జుట్టు బలంగా మారుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు సమస్యను శాశ్వతంగా తొలిగించుకోవాలంటే బెండకాయ గుజ్జును తలకు రాసుకుంటే మంచి ఫలితం దొరుకుతుంది.
జుట్టు పెరుగుదలకు..
జుట్టు ఎదుగులకు..
చాలా మంది జుట్టు పెరుగుదలకు నానా రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. వాటితో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే బెండకాయ పేస్ట్‌ను తలకు రాసుకోవడం వల్ల.. జుట్టు కుదుర్లు గట్టిగా తయారవుతాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. బెండకాయను వేడి నీటిలో మరిగించి తాగినా, జుట్టుకు రాసుకున్నా మంచి ఫలితాలు పొందొచ్చు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications