Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
Weight Loss Tips: తృణధాన్యాలను ఇలా తింటే సులభంగా బరువు తగ్గొచ్చు
ఆరోగ్యంగా ఉండాలనుకునేవారికి, బరువు తగ్గాలనుకునే చాలా మందికి తృణధాన్యాలు మంచి ఎంపిక. తృణధాన్యాలు తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. చిరు ధాన్యాల ద్వారా లభించే అనేక పోషకాలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా తృణధాన్యాలు మంచి ఎంపిక అవుతాయి. అయితే తృణధాన్యాలను ఎలా తింటే సులభంగా బరువు తగ్గొచ్చు, ఒంట్లోని కొవ్వు కరిగించడానికి చిరు ధాన్యాలను ఎప్పుడు, ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ చక్కెర తృణ ధాన్యాలు ఎంచుకోవాలి:
తృణధాన్యాల్లో చక్కెర శాతం ఎక్కువగానే ఉంటుంది. అందుకే బరువు తగ్గడం కోసం తృణ ధాన్యాలు తినాలని నిర్ణయించుకుంటే.. తక్కువ చక్కెర శాతం ఉండే ధాన్యాలు ఎంచుకోవడం కీలకం. ప్రతి సర్వ్‌కు 10 గ్రాముల కంటే తక్కువ చక్కెర ఉన్న ధాన్యాలు తినడం కీలకం. బరువు తగ్గడానికి చక్కెర ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
తాజా పండ్లు, కూరగాయలతో పాటు..:
తాజా పండ్లు, కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీని వల్ల త్వరగా ఆకలి అవదు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బెర్రీలు, అరటి పండ్లు, యాపిల్స్ వంటివి తృణధాన్యాలతో పాటు తినడానికి మంచి ఎంపికలు.
తక్కువ కొవ్వు, మొక్కల ఆధారిత పాలు:
బరువు తగ్గడానికి తృణ ధాన్యాలు తినాలని నిర్ణయించుకుంటే పాల గురించి కచ్చితంగా ఆలోచించాలి. ఫుల్ ఫ్యాట్ పాలలో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నప్పుడు కొవ్వును చాలా తక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు తీనేటప్పుడు బాదం పాలు, సోయా పాలు వంటి తక్కువ కొవ్వు ఉండే పాలను, మొక్కల ఆధారిత పాలను తీసుకోవాలి.
ఎంత తింటున్నారో గమనించుకోవాలి:
తృణ ధాన్యాలు ఆరోగ్యకరమైనవే. అయితే ఎంత తింటున్నామన్నది కూడా చాలా కీలకం. హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా కూడా అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. తృణధాన్యాల సర్వింగ్ పరిమాణం సాధారణంగా ఒక కప్పు మాత్రమే. ఎక్కువ తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు రావొచ్చు.
తృణధాన్యాలు తినడం ద్వారా బరువు తగ్గాలనుకుంటే వాటిని ఎలా తినాలో కచ్చితంగా తెలిసి ఉండాలి. తృణ ధాన్యాలైనా మరే ఇతర ఆహార పదార్థాలైనా మితంగా మాత్రమే తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్ కదా అని అతిగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తృణధాన్యాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు తినడం, తక్కువ కొవ్వు ఉన్న పాలను, మొక్కల ఆధారిత పాలను తీసుకోవడం మర్చిపోవద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications