Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
అల్యూమినియం పాత్రలలో వంట చేస్తున్నారా?..ఆరోగ్యానికి పెను ముప్పు?
మన ఇళ్లల్లోని వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ఒక భాగమైపోయాయి. తేలికగా ఉండటం, తక్కువ ధరకే లభించడం, త్వరగా వేడెక్కడం వంటి లక్షణాల వల్ల వీటి వాడకం సర్వసాధారణం అయిపోయింది. పొద్దున నుంచి రాత్రి దాకా చేసే వంటలన్నింటికి అవే ఆధారం. అయితే రోజూ మనం వాడే ఈ పాత్రలు మన ఆరోగ్యానికి మంచివేనా? లేక తెలియని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామా? ఈ ప్రశ్న ఎందరినో వేధిస్తోంది.
అల్యూమినియం పాత్రలు నిజంగా హానికరమా?
నిపుణుల పరిశోధనల ప్రకారం అల్యూమినియం ఒక లోహం కాబట్టి నేరుగా పాత్రను ఉపయోగించడం హానికరం కాదు. అసలు సమస్య పాత్రతో కాదు దాన్ని వాడే విధానంతోనే వస్తుంది. అల్యూమినియం పాత్రలను సరైన పద్ధతిలో ఉపయోగించనప్పుడు అది నెమ్మదిగా మన ఆరోగ్యానికి హాని కలిగించడం మొదలుపెడుతుంది.

వంట చేసే సమయంలో ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల దగ్గర పాత్రలోని అల్యూమినియం అంశాలు మనం వండుతున్న ఆహారంలోకి స్వల్ప మొత్తంలో కరిగిపోతాయి. సాధారణంగా ఇది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అయితే టమాటాలు, చింతపండు, నిమ్మరసం, వెనిగర్ వంటి ఆమ్ల గుణాలు (పుల్లని పదార్థాలు) ఉన్న ఆహార పదార్థాలను అల్యూమినియం పాత్రలలో వండినప్పుడు ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇలాంటి సందర్భాలలో ఎక్కువ మొత్తంలో అల్యూమినియం ఆహారంలోకి చేరుతుంది.
శరీరంపై అల్యూమినియం ప్రభావం
మన శరీరం ప్రతిరోజూ సుమారు 2-10 మిల్లీగ్రాముల అల్యూమినియంను గ్రహించగలదు. ఇంత తక్కువ మోతాదును మన కిడ్నీలు ఈజీగా ఫిల్టర్ చేసి బయటకు పంపేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు వాడటం వల్ల తక్షణ ప్రమాదం ఉండదు. కానీ ప్రతిరోజూ అల్యూమినియం పాత్రల్లో ముఖ్యంగా పుల్లని పదార్థాలను వండటం, ఆహారాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచడం వంటివి చేసినప్పుడు శరీరంలోకి చేరే అల్యూమినియం మోతాదు పెరుగుతుంది. కిడ్నీలు ఫిల్టర్ చేయలేనంత అధికంగా అల్యూమినియం శరీరంలో పేరుకుపోయినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఈ అదనపు అల్యూమినియం మెదడు, ఎముకలు, కాలేయం, కిడ్నీలలో ఉండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
దీర్ఘకాలిక దుష్ప్రభావాలు
-శరీరంలో అధిక అల్యూమినియం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలకు ఇది ఒక కారణంగా చెప్పబడుతోంది.
-ఇది శరీరంలోని కాల్షియంను గ్రహించే శక్తిని తగ్గించి, ఎముకలను పెళుసుగా మార్చగలదు.
-కిడ్నీలపై అధిక భారం పడి, వాటి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.
-శరీర రోగనిరోధక వ్యవస్థ పొరబడి తన సొంత కణాలపై దాడి చేసే తీవ్రమైన ఆటో ఇమ్యూన్ వ్యాధులు ప్రేరేపించబడవచ్చు.
-ఇతర అవయవాలతో పాటు గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

అల్యూమినియం పాత్రల వాడకంతో కలిగే నష్టాలను నివారించడానికి ఇలా
-పులుసు, సాంబార్, టమాటా పచ్చడి, నిమ్మరసం వాడే వంటకాలను అల్యూమినియం పాత్రలలో వండకండి. వీటి కోసం స్టీల్ లేదా మట్టిపాత్రలను ఎంచుకోవడం ఉత్తమం.
-వండిన ఆహారాన్ని అల్యూమినియం పాత్రలలో ఎక్కువసేపు నిల్వ ఉంచవద్దు. వంట పూర్తయిన వెంటనే స్టీల్ లేదా గాజు పాత్రలలోకి మార్చండి.
-పాత్ర లోపలి భాగంలో గీతలు పడినా లేదా దెబ్బతిన్నా, దానిని వెంటనే పక్కన పెట్టేయండి. దెబ్బతిన్న ప్రదేశం నుండి అల్యూమినియం త్వరగా ఆహారంలోకి చేరుతుంది.
-వీలైనంత వరకు అల్యూమినియం పాత్రల వాడకాన్ని తగ్గించి, స్టెయిన్ లెస్ స్టీల్, ఐరన్, మట్టి, గాజు వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications