Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు, బూజు.. వీటిని తినడం సురక్షితమేనా.?
మన కిచెన్‌లో ఉల్లిపాయ లేని వంటకాలు చాలా అరుదు. కూరల్లో, వేపుళ్లలోనే కాదు సలాడ్‌గాను ఉల్లిపాయను ఇష్టంగా తింటారు. అయితే వాటిపై అప్పుడప్పుడూ నల్ల మచ్చలను చూస్తుంటాం. అసలు ఆ మచ్చలు ఎందుకు వస్తాయి.? వాటిని తినవచ్చా.? లేదంటే అలాగే పారవేయాలా.? పోషకాహార నిపుణుల సలహాలు ఇక్కడ చూద్దాం..

వంటల్లోకి ఉల్లిపాయలను కోసే క్రమంలో దానిపై పొర లేదా లోపలి పొరల్లో తరచుగా నల్లటి మచ్చలు కనిపించడం లేదంటే ఒకరకమైన పొడి లాంటి పదార్థం కనిపించడం గమనించే ఉంటారు. ఇది మురికి, బూజు పట్టడమా లేదంటే ఉల్లిపాయ పాడైపోయిందా అనే విషయం కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. అయితే వాటిని పారేయడం ఇష్టం లేక శుభ్రంగా కడిగి వంటలోకి వాడేస్తారు. లేదంటే మరీ ఎక్కువగా ఉంటే పారవేస్తాము. కానీ అసలు అలాంటి ఉల్లిపాయలను తినడం సురక్షితమేనా అనేది అసలైన సందేహం..
మచ్చలు ఎందుకు వస్తాయి..
ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలన్నీ ఒకే విధంగా ఉండవని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అది పై పౌరపై పేరుకుపోయిన దుమ్ము, మట్టి కావచ్చు. వీటిని పొట్టు తీసి శుభ్ర పరిచి వాడుకోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఇది లోపలి పొరల వరకూ వ్యాపించి ఉంటుంది. ఇదే బ్లాక్ మోల్డ్ అనే ఫంగస్ కావచ్చు. పంట కోత సమయంలో.. తేమ, వేడి కారణంగా సరైన గాలి లేకపోయినా, నిల్వ ఉంచిన సందర్భాల్లో ఇలా జరుగుతుంది.
వాటిని వాడవచ్చా..
ఉల్లిపాయ తొక్కలపై ఉండే నల్లటి మచ్చలు సాధారణంగా మట్టిలో కనిపించే మామూలు ఫంగస్ కారణంగా ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఇది అంటువ్యాధి కాదు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. అయితే వీటిని వినియోగించే ముందు శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి.
ఉల్లి పొరలపైన బయట ఉండే స్వల్ప బూజు వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ బూజు లోపలి పొరలకు వ్యాపించినా.. ఉల్లిపాయ మొత్తం మెత్తబడిపోయినా జాగ్రత్తగా ఉండాలి. ఉల్లిపాయ మొత్తం బూజుతో కుళ్లిపోయినట్లు ఉంటే వాటిని తినడం సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అనారోగ్యానికి దారి తీస్తుందా.?
ఉల్లిపాయలపై స్వల్ప పరిమాణంలో బూజు ఉంటే అది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఎలాంటి చేటు చేయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొంతమందికి ఈ బూజు కారణంగా తుమ్ములు, ఆయాసం, కళ్ల మంట వంటి ప్రతికూల చర్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు వీటిని తినే విషయంలో జాగ్తత్త వహించాలని సూచిస్తున్నారు. ఉల్లిపాయపై ఎండిన పొరల్లో మాత్రమే ఈ నల్లటి పొడి, బూజు ఉండి లోపలి ఉల్లిపాయ పొరలు గట్టిగా శుభ్రంగా ఉంటే.. పొట్టు తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత తినవచ్చని చెబుతున్నారు.
నిపుణుల సలహా
అయితే ఉల్లిపాయలపై నల్లటి మచ్చలకు కారణమైన శిలీంధ్రం హానికరం కాకపోయినా.. కొన్ని సందర్భాల్లో ఇది ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. వీటిని ఎక్కువ కాలం పాటు తరచూ తీసుకుంటే కిడ్నీలు, లివర్‌కు నష్టం కలిగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ మైకోటాక్సిన్ అధిక వేడికి నశించదని.. వంటల్లో ఉపయోగిస్తే ఇది చనిపోదు. అందుకే వీటిని వంటల్లోకి వాడేముందు ఇలాంటి మచ్చలున్న ఉల్లిపాయను బాగా పరశీలించిన తర్వాతే వాడాలని.. దుర్వాసన వచ్చినా, మెత్తబడి పోయి లోపలి పొరలు సైతం పూర్తిగా నల్లగా మారినా వాటిని తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
