Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మగవాళ్లలో కూడా రొమ్ము క్యాన్సర్?..ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే!
రొమ్ము క్యాన్సర్ అనగానే అది కేవలం మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి అని సమాజంలో చాలామంది భావిస్తుంటారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. పురుషుల్లో కూడా ఈ మహమ్మారి వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చాలా అరుదుగా కనిపించినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. మగవారికి రొమ్ము క్యాన్సర్ ఏమిటి? అనే అవగాహనా లోపం, సిగ్గు కారణంగా చాలామంది పురుషులు వ్యాధి ముదిరేదాకా డాక్టర్లను సంప్రదించడం లేదు. దీనివల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అదే ప్రారంభ దశలోనే గుర్తిస్తే ట్రీట్మెంట్ ద్వారా దీనిని నయం చేయడం నూటికి నూరు శాతం సాధ్యమవుతుంది.

పురుషుల్లో ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
సృష్టికార్యంలో భాగంగా పురుషుల ఛాతీ భాగంలోనూ కొద్దిపాటి బ్రెస్ట్ టిష్యూ (రొమ్ము కణజాలం) ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ లేదా హార్మోన్లలో వచ్చే అనూహ్య మార్పుల వల్ల ఈ కణాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పురుషుల శరీరంలో ఎస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరిగినప్పుడు ఈ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అలాగే వయసుకు మించిన అధిక బరువు (ఊబకాయం), కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్న చరిత్ర (జన్యుపరమైన కారణాలు), వృషణాలకు సంబంధించిన కొన్ని వ్యాధులు కూడా పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కు దారితీస్తాయి.
శరీరం ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
పురుషులు తమ ఛాతీ భాగంలో వచ్చే కింది మార్పులను గమనిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.
గడ్డలు ఏర్పడటం: ఛాతీ భాగంలో లేదా ఒకవైపు రొమ్ము దగ్గర నొప్పిలేని చిన్న గడ్డలా తగలడం దీని తొలి లక్షణం.
ఆకృతిలో మార్పులు: ఛాతీ పరిమాణం మారడం, నిపుల్ (చనుమొన) లోపలికి కుచించుకుపోవడం జరుగుతుంది.
చర్మం ఎర్రబడటం: ఛాతీపై చర్మం రంగు మారి ఎర్రగా కందిపోవడం, చర్మం మందంగా మారడం లేదా గుంటలు పడినట్లు కనిపించడం.
స్రావాలు: రొమ్ము (నిపుల్) నుంచి రక్తం లేదా ఇతర ద్రవాలు కారడం. కొన్నిసార్లు అక్కడ గాయాలు కూడా కావచ్చు.
వాపులు: చంకల కింద ఉన్న లింఫ్ నోడ్స్ ప్రభావితమై వాపు రావడం, కాలర్ బోన్ (మెడ కింది ఎముక) దగ్గర గడ్డలు ఏర్పడటం.

ఆధునిక వైద్యంతో అధిగమించవచ్చు
పై లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ నిపుణులు)ను సంప్రదించాలి. డాక్టర్లు శారీరక పరీక్షలతో పాటు, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ వంటి స్కాన్లు చేస్తారు. అవసరమైతే బయాప్సీ ద్వారా క్యాన్సర్ ను నిర్ధారిస్తారు. వ్యాధి ఏ దశలో ఉందనే దాన్ని బట్టి సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్, లేదా హార్మోన్ థెరపీ వంటి అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా వ్యాధిని నయం చేస్తారు.
నివారణ మన చేతుల్లోనే ఉందా?
క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.
ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి.
ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.
జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి.. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు (మాస్టర్ హెల్త్ చెకప్) చేయించుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications