Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Lemon For Diabetes:నిమ్మరసంతో షుగర్ నియంత్రణ!!ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..
Lemon For Diabetes: డయాబెటిస్ (Diabetes) నిర్ధారణ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది. రోజువారీ జీవితం నిబంధనల వలలో చిక్కుకుంటుంది.అబ్బబ్బా..ఒక్క డయాబెటిస్ తో వెయ్యి ఆంక్షలు పాటించాలి. తినే విషయంలో పెద్ద మార్పు వస్తుంది. రోజువారీ మెను నుండి చాలా ఇష్టమైన ఆహారాల(Foods)కు స్వస్తి పలకాలి.అలాగే చాలా వరకు ఇష్టం లేని ఆహారాలు జోడించాలి. అయితే రోజు వారి ఆహారంలో కొన్ని ఆహారాలను మాత్రం మిస్ చేయకూడదు. అలాంటి ఆహారంలో నిమ్మకాయ(Lemon) ఒకటి.
విటమిన్ సి (Vitamin C) మరియు ఫైబర్(Fiber) అధికంగా ఉండే నిమ్మకాయలు లేదా అటువంటి పండ్లను మధుమేహానికి 'సూపర్ ఫుడ్స్' అంటారు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, నిమ్మరసం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.

నిమ్మకాయలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది మరియు కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ సి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలో ఉండే పోషకాలు జీవక్రియను పెంచుతాయి. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే మధుమేహాన్ని నియంత్రించడానికి నిమ్మకాయను ఎలా ఉపయోగించాలి? ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
డయాబెటిస్ పేషంట్స్ లో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి నిమ్మరసం:
ఆహారంలో నిమ్మరసం
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, మీ రోజువారీ ఆహారంలో నిమ్మరసం తినడం అలవాటు చేసుకోండి. అది అన్నం కూర లేదా పాస్తా ఇలా ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా ఆహారంలో కొన్ని చుక్కల నిమ్మరసం జోడించవచ్చు. పప్పు, వెజిటబుల్ కర్రీలు, సలాడ్లు కూడా నిమ్మరసంలో కలుపుకోవచ్చు.
గోరువెచ్చని నీటితో నిమ్మ రసం
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగడం మధుమేహ నివారణలలో ఒకటి. ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో సగం నిమ్మరసం కలపండి. ఈ పానీయం మధుమేహాన్ని నియంత్రించడమే కాదు. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
డిటాక్స్ వాటర్(Detox Water)
నిమ్మరసంతో డిటాక్స్ వాటర్ తయారు చేయండి. రోజంతా అప్పుడప్పుడు ఈ పానీయాన్ని సిప్ చేస్తూ ఉండండి. డిటాక్స్ వాటర్ మన శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.
పిండి పదార్ధాలకు నిమ్మరసం జోడించండి
అన్నం, బంగాళదుంపలు, దుంపలు మరియు మొక్కజొన్న వంటి పిండి పదార్ధాలకు నిమ్మరసం జోడించండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు మరియు శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
