Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్‌లెట్లు పెరుగుతాయా?
వర్షాలు పడటం మొదలు కాగానే జ్వరాలు, వివిధ వ్యాధులు చుట్టుముడతాయి. ఈ సమయంలో చాలా మందిని డెంగ్యూ బాధిస్తుంది. డెంగ్యూ వచ్చిన చాలా మంది ప్లేట్‌లెట్లు తగ్గడం సాధారణంగా జరుగుతుంది. ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గడం వ్యాధి తీవ్రతకు సంకేతం. ప్లేట్‌లెట్లు సంఖ్యను పెంచడాన్ని ప్రాధాన్యతగా తీసుకుని చికిత్స అందించాల్సి ఉంటుంది.
ప్లేట్‌లెట్లు తగ్గిన చాలా మంది వాటిని ఎలా పెంచుకోవాలా అని మదనపడిపోతుంటారు. జ్వరం ఒత్తిడి ఒకవైపు, ప్లేట్‌లెట్లు లేక అవస్థ మరోవైపు బాధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి ఆకుల రసం తాగాలని చాలా మంది సూచిస్తుంటారు. ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు బొప్పాయి ఆకుల రసం తాగితే నిజంగానే ప్రయోజనం ఉంటుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లేట్‌లెట్ల కోసం బొప్పాయి ఆకులు:
బొప్పాయి ఆకుల్లో అసిటోజెనిన్ అనే ప్రత్యేకమైన పైటోకెమికల్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల కౌంట్ ను పెంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. డెంగ్యూతో బాధపడే వ్యక్తుల్లో బొప్పాయి ఆకులు సమర్థవంతంగా పని చేస్తాయి. త్వరగా కోలుకునేలా చేస్తాయి. బొప్పాయి ఆకుల్లో ప్లేవనాయిడ్లు, కెరోటిన్లు వంటి అనేక సహజ మొక్కల సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి రక్త కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి.
బొప్పాయి ఆకుల రసం ఎలా తయారు చేసుకోవాలి?
- ముందుగా బొప్పాయి ఆకులను శుభ్రంగా కడుక్కోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఒక గిన్నె తీసుకొని అందులో ఆకులు మునిగే వరకు నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
- ఆ నీరు క్రమంగా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.
- ఆ నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి.
- ఆకు పసరు కాబట్టి చేదుగా ఉంటుంది. దానిని తాగలేము అనుకుంటే అందులో తేనె, బెల్లం కలుపుకోవచ్చు.
- పెద్దలు రోజూ రెండు సార్లు 30ml, పిల్లలైతే 5-10ml తీసుకోవాలి.
ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచే ఆహారాలు:
ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి విటమిన్-సిని మంచి మోతాదులో తీసుకోవడం ముఖ్యం. ఆరెంజ్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, కాలీఫ్లవర్ సూప్, గుమ్మడికాయ సూప్, పైనాపిల్ జ్యూస్, బెల్ పెప్పర్, టొమాటో సలాడ్ తో స్ట్రైర్-ఫ్రైడ్ బ్రొకలీని తీసుకోవచ్చు. మాంసకృత్తులు, విటమిన్-కే, ఐరన్ తీసుకోవాలి. వీటి కోసం పప్పు, వేయించిన వేరుశెనగలు, ఆకు కూరలు, గుమ్మడి గింజలు తినాలు. విటమిన్ బి-12 అధికంగా ఉండే ఆహారాలు తక్కువ ప్లేట్‌లెట్ల సమస్యకు మంచి పరిష్కారం.
ప్లేట్‌లెట్ల సంఖ్యను తగ్గించే ఆహారాలు:
డెంగ్యూ జ్వరం బాధిస్తున్న సమయంలో చాలా మందిలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది. అలాంటి సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అందులో ఆవుపాలు, క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం మానుకోవాలి. ఇవి ప్లేట్‌లెట్ల సంఖ్యను తగ్గిస్తాయి. పరిస్థితిని మరింతగా దిగజారుస్తాయి. అలాగే పూర్తిగా కోలుకునే వరకు టానిక్ వాటర్, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం మంచిది.
బొప్పాయి ఆకు రసం ప్రయోజనాలు:
- బొప్పాయి ఆకు రసం డెంగ్యూ, మలేరియా చికిత్సో ప్రభావవంతంగా పని చేస్తుంది.
- బొప్పాయి ఆకు రసం బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడానికి రోజూ బొప్పాయి ఆకు రసం తాగడం మంచిది.
- అధిక ప్రోటీన్ లో ఉన్నట్లయితే.. బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వల్ల ప్రోటీన్ ను అమైనో ఆమ్లం, పెప్డైడ్ లుగా విభజించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ ఈ పని చేస్తుంది. శరీరంలో మంచి శోషణను సులభతరం చేయడానికి ప్రోటీన్ వినియోగానికి బొప్పాయి ఆకు రసం మంచిది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
