Latest Updates
-
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే.. -
ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.! -
శుక్ర గ్రహ గోచారం.. ఈ మూడు రాశుల వారికి కెరీర్లో కొత్త అవకాశాలు.! -
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్‌గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.!
పంటి నొప్పి భరించలేకపోతున్నారా? ట్యాబ్లెట్స్ లేకుండానే నొప్పిని తగ్గించే చిట్కా ఇదే
మన శరీరంలో ఏ భాగంలో నొప్పి లేదా మంట వచ్చినా భరించగలం కానీ ఒక్క పంటి నొప్పి మాత్రం భరించలేనిది. పంటి నొప్పి ఎలా ఉంటుందో దాన్ని అనుభవిస్తే గానే ఇంకొకరు చెప్పలేదు. పన్ను నొప్పి వచ్చినప్పుడు సుత్తితో పళ్లన్నీ ఊడకొట్టుకోవాలని కూడా అనిపిస్తుంటది..ఆ నొప్పి బాధ అలాంటిది. నిద్ర పట్టదు.. ఏది తినాలనిపించదు, ఏదీ తాగాలని అనిపించదు ఇలా నరకం చూస్తుంటారు. ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కొద్దిసేపు బాగానే ఉంటుంది..మళ్లీ నొప్పి స్టార్ట్ అవుతుంది. దీన్ని మించిన నరకం లేదురా బాబోయ్ అనుకుంటారు ఆ సమయంలో.
తరచుగా చిగుళ్ళ వాపు, దంతాల కుహరం లేదా సున్నితత్వం వల్ల పంటి నొప్పి వస్తుంటది. పిల్లలు, పెద్దలు ఎవ్వరికైనా ఎప్పుడైనా పంటి నొప్పి ప్రామ్లమ్ రావచ్చు. పంటి నొప్పి ట్యాబ్లెట్లు కిడ్నీలను నేరుగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకోవడం అంత మంచిది కాదు.. మన వంటగదిలోనే పంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించే మెడిసిన్స్ ఉన్నాయి. వాటిిని వాడితే మీ పంటినొప్పి సమస్యకు తాత్కాలికంగా చెక్ పెట్టవచ్చు.

ఉల్లిపాయ
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. ఉల్లిపాయ కేవలం కూరల్లో రుచికే కాకుండా అనేక ఇతర బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. ఉల్లిగడ్డలో క్రిమినాశక,యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఉల్లిగడ్డ ముక్కను చిన్నగా కోసి..నొప్పి ఉన్న చోట నెమ్మదిగా నమలండి. ఈ చిట్కా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వెంటనే పన్ను నొప్పి ఆగిపోతుందట.
వెల్లుల్లి
వంటగదుల్లో తప్పనిసరిగా ఉండే మరో పదార్థం వెల్లుల్లి. దీన్ని కూరల్లో రుచి కోసం వాడుతుంటాం. అయితే వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి పంటి నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. పన్ను నొప్పి ఉంటే వెల్లుల్లి రెబ్బను మెత్తగా చేసి దానికి కొంచెం ఉప్పు వేసి ఆ పేస్ట్ ను నొప్పిగా ఉన్న పన్నుపై రాయండి వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది.
లవంగం నూనె
లవంగ మొగ్గలు అందరి వంటదుల్లో ఉంటాయి. లవంగం నూనె పంటి నొప్పికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యూజెనాల్ అనే ఒక ముఖ్యమైన సమ్మేళనం ఉంటుంది, ఇది సహజమైన నొప్పి నివారిణిగా (అనాల్జేసిక్), క్రిమినాశక మందుగా పనిచేస్తుంది. అందుకే ఇది చాలా డెంటల్ ప్రొడక్ట్స్‌లో కూడా ఒక ప్రధానమైన పదార్థం. యూజెనాల్ అనే పదార్థం నొప్పి ఉన్న ప్రదేశంలో నరాలను తాత్కాలికంగా తిమ్మిరి చేస్తుంది, దీనివల్ల నొప్పి వెంటనే తగ్గుతుంది. కొద్దిగా లవంగం నూనెను ఒక దూదిపై వేసి నొప్పి ఉన్న పంటిపై లేదా చిగుళ్లపై సున్నితంగా ఉంచండి. దాన్ని కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి.
ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి
ఇది అందిరికీ తెలిసిన చిట్కానే. పన్ను నొప్పి అనగానే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించాలని అందరూ సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా తగ్గిపోతుంది, వాపు తగ్గుతుంది. రోజుకు 3-4 సార్లు ఇలా ఉప్పు నీళ్లలో నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా పంటి బాధ తగ్గుతుంది.
ఐస్ ప్యాక్
పంటి నొప్పికి చాలా ప్రభావవంతమైన హోం రెమెడీస్ లో ఇదొకటి. కోల్డ్ కంప్రెస్ వేయడం వల్ల నరాలు తిమ్మిరి చెందుతాయి, నొప్పి తగ్గుతుంది. ఐస్ ను ఒక గుడ్డలో చుట్టి చెంప బయటి భాగంలో పావు గంట సేపు అప్లై చేయండి. దీంతో పాటు పటిక నీటితో పుక్కిలించడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

పసుపు పేస్ట్
వంటగదిలో అది పేదవాడి ఇళ్లు అయినా లేదా పెద్ద కోటీశ్వరుడు ఇళ్లు అయినా సరే పసుపు వంటగదిలో ఉండి తీరుతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి, ఇవి పన్ను నొప్పికి ప్రయోజనకరంగా ఉంటాయి. పసుపు పొడిని కొద్దిగా నీరు లేదా తేనెతో కలిపి పేస్ట్ లా చేసి నొప్పిగా ఉన్న పన్నుపై రాస్తే నొప్పి తగ్గిపోతుంది.
పుదీనా టీ
పుదీనా టీలో చల్లదనాన్ని, నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. పంటి నొప్పి విపరీతంగా ఉండి మీకు తక్షణ ఉపశమనం కావాలంటే పుదీనా టీ తయారు చేసి, అది చల్లబడిన తర్వాత దానితో పుక్కిలించండి. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుదీనా టీ తాగవచ్చు కూడా.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications