Latest Updates
-
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.?
ధూమపానం ఆరోగ్యానికి హానికరం, పొగాకు కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా.. కొందరు వాటికి దూరంగా ఉండలేరు. అయితే పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల పురుషులకి మరో ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని.. ఫలితంగా వంధ్యత్వం కూడా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది వీర్యకణాల ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు.

పొగాకు నమలడం, సిగరెట్లు తాగడం వల్ల పురుషుల్లో వీర్యకణాల ఆరోగ్యం దెబ్బతింటుందని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. వీర్య కణాల సంఖ్య పడిపోవడం, చలన శీలత తగ్గిపోవడంతో పాటు ఆ కణాల డీఎన్‌ఏకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లకు తోడుగా ఈ వ్యసనం కూడా వారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిపోయేలా చేస్తుంది.
పొగాకు అలవాటు ఫెర్టిలిటీపైనే కాదు.. చిన్న వయసులోనే గుండెపోటుకు సైతం దారితీస్తుంది. ధూమపానం అలవాటు ఉన్న మహిళలకూ వీటి దుష్ప్రభావం వర్తిస్తుంది. మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థకి నష్టం కలిగిస్తుంది. కాగా, ఇటీవల విడుదలైన ఎన్‌ఎఫ్‌హెచ్-6 నివేదిక.. భారతీయుల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై ఆందోళన వ్యక్తం చేయడమే ఇందుకు ఉదాహరణ. నగరాల్లో పెరుగుతున్న ఫెర్టిలిటీ కేంద్రాలే ఇందుకు నిదర్శనం.
అయితే సాధారణంగా ప్రజల్లో ఒక అపోహ ఉంటుంది. పొగాకు నమలడం లేదా ధూమపానం ద్వారా నోటి క్యాన్సర్ లేదా దంత సమస్యలు తలెత్తుతాయని భావిస్తారు. కానీ అది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ అలవాటును మానుకోవాలని గైనకాలజిస్ట్ నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఈ రోజువారీ వ్యసనం.. వీర్యకణాల నాణ్యతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
పొగాకులో నికోటిన్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటిని పీల్చడం, నమలడం ద్వారా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గడం, చలనం లేకపోవడం, ఇన్‌ఫెక్షన్, నాణ్యత క్షీణించడం, రూపురేఖలపై ప్రభావం ఇలా చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ ఫలితంగా కణాలు అండాన్ని చేరుకోలేక గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి.

హార్మోన్ల సమతుల్యత
పొగాకు ఉత్పత్తులను సేవించడం శరీరంలో హార్మోనల్ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది. సంతానోత్పత్తిలో కీలకమైన టెస్టోస్టెరాన్‌తో పాటు ఇతర హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అలవాట్లు రిపీట్ అయితే క్రమంగా హార్మోన్ల అసమతుల్యత పెరిగి భవిష్యత్తులో సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది.
సంతానం కోసం ఎదురుచూస్తున్న పురుషులు ముఖ్యంగా పొగాకుతో పాటు ఇతర వ్యసనాలు మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. వీటితోపాటు జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. వీర్య కణాల ఆరోగ్యంగా ఉత్పత్తి అవడానికి ప్రతిరోజూ సమతుల్య ఆహారం తప్పనిసరి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర ఉండేలా చేసుకోవాలి. సంతానోత్పత్తి ప్రక్రియలో ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. అయినప్పటికీ పిల్లలు కావడంలో ఇబ్బంది పడుతుంటే సంతానోత్పత్తికి సంబంధించిన ఆందోళనల గురించి గైనకాలజిస్టు నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
