మీ పిల్లలు హైట్‌ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.!

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా వారి ఆరోగ్యం, తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే ఇది వారి ఎత్తుపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఎత్తు విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇందుకు పోషకాల లోపమే కారణం కావచ్చు. దీనిపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు. ఇక్కడ చూద్దాం..

Children are not growing taller these deficiencies are the main factors

ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లలు ఆరోగ్యంగా పెరిగి, అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. అందుకు తగినట్లుగా ఆహారం, ఇతరత్రా విషయాల్లో పేరెంట్స్‌ చర్యలు తీసుకుంటారు. అయితే పిల్లల ఎత్తు విషయంలో కేవలం ఆహారమే కారణం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలు, శారీరక శ్రమ, నిద్ర, ఇలా చాలా విషయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమస్యలను కొన్ని ముఖ్యమైన, సమతుల్యమైన పోషకాలను తీసుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు.

చిన్నారులు ఎత్తు పెరిగేందుకు బాల్యం, కౌమారదశ చాలా కీలకం. ఈ దశలో శరీరానికి తగినంత శక్తి, ప్రోటీన్ , విటమిన్లు, ఖనిజాలు తగినంతగా తీసుకోవాలి. ఇవి లోపిస్తే వారి శారీరక ఎదుగలపై దుష్ప్రభావం చూపిస్తాయి.

Children are not growing taller these deficiencies are the main factors

పోషకాహార నిపుణుల సలహా ప్రకారం పిల్లల పెరుగుదలకు ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, ఐరన్ వంటి పోషకాలు చాలా అవసరం. కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రోటీన్ కండరాలు దోహదపడతాయి. ఎముకలను బలోపేతం చేయడానికి, ఆరోగ్యంగా పెరగడానికి కాల్షియం, విటమిన్ డి కీలకం. ఐరన్‌ శరీరంలో ఆక్సిజన్‌ సరఫరాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవి అందడం ద్వారా పిల్లలు చురుకుగా, శక్తివంతంగా ఎదుగుతారు. జింక్, మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లను.. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పప్పులు, గుడ్లు, తృణధాన్యాలు, ఇతర పోషకాహారాలు పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి దోహదపడతాయి.

రోజువారీ అలవాట్లు

అయితే కేవలం ఆహారం మాత్రమే కాకుండా రోజువారీ అలవాట్లు కూడా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి. సరైన నిద్ర, చిన్నపాటి వ్యాయామాలు, క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనడం, ఆటల్లో చురుగ్గా ఉండటం వంటివి పిల్లల ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ముఖ్యంగా పిల్లలు స్క్రీన్‌కు దూరంగా ఉండాలి. కంప్యూటర్‌, మొబైల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. పుష్కలంగా నీరు తాగడం, ఒత్తిడికి దూరంగా ఉండటం పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయి.

చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి

పిల్లల ఎదుగుదలపై చెడు అలవాట్లు తీవ్రంగా ప్రభావం చూపుతాయి. ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, షుగర్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండటం, తగినంత నిద్ర లేకపోవడం కారణంగా పిల్లల శారీరక, మానసిక ఎదుగల తగ్గిపోవడానికి కారణమవుతాయి. ఈ అలవాట్లకు దూరంగా ఉంచుతూ మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా కాపాడుకోవాలి.

రోజూ ఇవి తప్పనిసరి

పీడియాట్రిషియన్స్‌ సలహా ప్రకారం.. పిల్లలకు ప్రతి రోజూ గుడ్లు, చికెన్‌, చేపలు, పప్పులు వంటి ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. రోజూ 8 నుంచి 10 గంటల పాటు ఒకే సమయంలో సరైన నిద్ర పోయేలా చూడాలి. ప్రతి రోజూ సూర్యుని వెలుతురు తగిలేలా ఒక 20 నిమిషాల పాటు ఉదయం లేదా సాయంత్రం ఆడించాలి.

ఇన్‌డోర్‌ గేమ్స్‌ కంటే ఔట్‌ డోర్‌ గేమ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా శారీరకంగా శ్రమ పెరిగి ఆరోగ్యంగా పిల్లలు ఎత్తు ఎదిగేందుకు దోహదపడుతుంది. బాస్కెట్‌ బాల్‌, సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ లాంటి ఆటలు పిల్లల్లో శారీరక ఎదుగుదలకు దోహదపడుతుంది. హైట్‌ను పెంచే ఎక్సర్‌సైజులు చేయించాలి. పిల్లలు నిటారుగా సరిగ్గా నిలబడేలా చూడాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, June 9, 2026, 10:03 [IST]
Desktop Bottom Promotion