Latest Updates
-
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.!
Healthy street foods: ఆరోగ్యానికి మేలు చేసే స్ట్రీట్ ఫుడ్స్ ఇవే..రుచి,ఆరోగ్యం రెండూ కలిసి..
మనదేశంలో ఇంట్లో చేసుకునే ఫుడ్ కన్నా స్ట్రీట్ ఫుడ్ ని తినేందుకు ఇష్టపడేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. బయటి ఫుడ్ తో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ మంచి టేస్ట్ ఉంటుదన్న కారణంతో స్ట్రీట్ ఫుడ్ ని ఇష్టపడుతుంటారు ఎక్కుమంది. అయితే కొన్ని రకాల స్ట్రీట్ ఫుడ్స్ రుచిగా ఉండటమే కాకుండా కడుపుకు మేలు చేస్తాయి..వాటి తయారీలో ఉపయోగించే పదార్థాల వల్ల అవి రుచిగా మారడమే కాకుండా గ్యాస్, ఉబ్బరం, బరువు వంటి అనేక ప్రాబ్లమ్ప్ నుంచి మనకు రిలీఫ్ ఇస్తాయి. అయితే అమృతం అయినా లీటర్ల కొద్దీ తాగితే విషంగా మారిపోతుంది అనే సామెతలాగా కడుపుకు మేలు చేసే ఆహారాలు అయినా మితంగా తినడం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మేలు చేసే ఆ స్ట్రీట్ ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
ఢోక్లా
మీరెప్పుడైనా గుజరాత్ వెళ్తే అక్కడ రోడ్ల మీద,హోటల్స్ లో ఢోక్లా అనే ఒక ఆహార పదార్థాన్ని గమనించవచ్చు. గుజరాత్ స్పెషల్ గా చెప్పబడే ఢోక్లాను శెనగపిండితో తయారుచేస్తారు..దీనిని ఆవిరిలో వండుతారు. ఢోక్లాలో జీర్ణక్రియకు మేలు చేసేలా మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఢోక్లా..తక్కువ ఫ్యాట్, తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం.

మిసల్ పావ్
మిసల్ పావ్ అనేది మహారాష్ట్రకు చెందిన పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఇది మొలకెత్తిన బీన్స్ తో చేసిన కూర, పావ్ తో వడ్డిస్తారు. దీనిని తరచుగా స్పైసీగా, కారంగా తయారుచేస్తారు. మహారాష్ట్రలో ఏ మూలకు వెళ్లినా మిసల్ పావ్ కనబడుతుంది. ఇందులో ఫైబర్, ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుందని చెబుతారు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది అతిగా తినకుండా కూడా నిరోధిస్తుందని చెబుతారు.
పానీ పూరీ
పానీపూరిని కొందరు గొలగప్ప అని కూడా పిలుస్తుంటారు. మనదేశంలో స్ట్రీట్ ఫుడ్ అంటే ఎక్కువమందికి గుర్తుకొచ్చేది ఇదే. సాయంత్రం అయితే చాలు భారతదేశంలో మూరుమూల పల్లెటూర్లలో కూడా పానీపూరీ బండ్ల దగ్గర క్రౌడ్ ఉంటుంది. ఇక,అమ్మాయిలకు సాయంత్రం అయితే పానీపూరీ కావాల్సిందే అంటూ తరచూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా కనబడుతుంటాయి. దీని కారంగా ఉండే నీటిని జీలకర్ర, పుదీనా, ఇంగువ, చింతపండుతో తయారు చేస్తారు. ఇది గ్యాస్ ను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపర్చడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఎక్కడ పడితే అక్కడ పానీపూరీ తిన్నారంటే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే కాబట్టి శుభ్రంగా ఉండే ప్లేస్ లోకి వెళ్లి పానీపూరీని ఆస్వాదించడం బెటర్.

మొక్కజొన్న
పిల్లలు,పెద్దలు అందరికీ నచ్చేది మొక్కజొన్న. దీనిని బొగ్గులపై కాల్చుకొని నిమ్మకాయ పిండి, చాట్ మసాలా పూసి తింటే ఆ మజా మాటల్లో వర్ణించలేనిది. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్కజొన్ననను తింటుంటే సూపర్ గా ఉంటుంది. మొక్క జొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని ప్రత్యేకత..ఎలాంటి నూనె లేకుండా ఉండటమే.
dమూంగ్ దాల్ చాట్
మొలకెత్తిన మూంగ్ లేదా కాల్చిన మూంగ్ పప్పుతో తయారు చేసే చాట్‌లో ఫైబర్, ప్రోటీన్, తాజా కూరగాయలు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా తేలికగా,కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.ఫలితంగా ఇది బరువు తగ్గడం సులభతరం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications