Latest Updates
-
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి!
మన శరీరంలో విరామం లేకుండా పనిచేసే అవయువం కాలేయం(లివర్). మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, దానిని శక్తిగా మార్చి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే అద్భుతమైన ఇంజిన్ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కాలేయం లేనిదే మన మనుగడ లేదు. కానీ మనకు తెలియకుండానే రోజువారీ జీవితంలో మనం చేసే కొన్ని ఆహారపు తప్పుల వల్ల ఈ అతి ముఖ్యమైన అవయవం తీవ్ర ప్రమాదంలో పడుతోంది.

ప్రస్తుతం భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. దాదాపు 38 శాతం మంది పెద్దలు ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. గతంలో పెద్దవయసు వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి కారణంగా నేడు పసిపిల్లలను కూడా వేధిస్తుండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం.
మద్యం తాగకపోయినా లివర్ పాడవుతుందా?
కాలేయం పాడవ్వాలంటే కేవలం మందు తాగాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? ఆల్కహాల్ ఎంతటి ప్రమాదకరమో, మనం రోజూ ఇష్టంగా తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా కాలేయానికి అంతే హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెర, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ కాలేయాన్ని నెమ్మదిగా నిర్వీర్యం చేస్తాయి.
అసలు లోపల ఏం జరుగుతుంది?
కాలేయం మన శరీరానికి ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది. మనం రోజూ తీపి పానీయాలు లేదా కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జాలు, నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తిన్నప్పుడు వాటిలో ఉండే అధిక కేలరీలు కాలేయంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. ఈ అదనపు కొవ్వుల వల్ల కాలేయం వాపునకు గురవుతుంది. దీనినే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది ఆల్కహాల్ తాగే వారిలో వచ్చే కాలేయ వ్యాధులకు ఏమాత్రం తీసిపోదు.
లక్షణాలు లేకపోవడమే అతిపెద్ద ప్రమాదం
ఈ వ్యాధిలో ఉన్న అతిపెద్ద ముప్పు ఏమిటంటే.. ఇది ఒక సైలెంట్ కిల్లర్. వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించవు. మనం ఆరోగ్యంగానే ఉన్నామని అనుకుంటాం, కానీ లోపల కాలేయం క్రమంగా దెబ్బతింటూ ఉంటుంది.
కాలక్రమేణా ఈ కొవ్వుల వల్ల కణజాలం దెబ్బతిని ఫైబ్రోసిస్, ఆ తర్వాత క్యాన్సర్ లేదా సిర్రోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులుగా మారుతుంది. పరిస్థితి పూర్తిగా చేయి దాటితే కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్) తప్ప వేరే మార్గం ఉండదు.

ఎలా కాపాడుకోవాలి?
వీటికి దూరంగా ఉండండి
కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, బేకరీ స్వీట్లు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. మైదాతో చేసిన జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాల వినియోగాన్ని బాగా తగ్గించాలి.
ఇవి తినండి
ప్రతిరోజూ మీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. మిల్లెట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం కాలేయాన్ని శుభ్రం చేస్తుంది.
చురుకైన జీవనశైలి
ఆహారంతో పాటు శారీరక శ్రమ చాలా ముఖ్యం. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం లేదా వాకింగ్ చేయండి. బరువును అదుపులో ఉంచుకోవడం ఫ్యాటీ లివర్ కు చెక్ పెట్టడానికి ఉత్తమ మార్గం.
రెగ్యులర్ చెకప్స్
మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, మధుమేహం లేదా కాలేయ వ్యాధుల చరిత్ర ఉన్నట్లయితే తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించి తరచుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ లు చేయించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications