Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ ను నియంత్రించే ఆహారం!

డయాబెటీస్ నియంత్రణకు ఖచ్చితమైన ఆహార ప్రణాళిక వేసుకునే కంటే కూడా ప్రణాళిక లేకుండా ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించటమే మంచిది. నేటి ఆధునిక తీరుతెన్నుల ఆహార లభ్యతలతో ఆహార ప్రణాళిక చాలావరకు ఆచరించటం కష్టం. డయాబెటిక్ ఆహారం ఏ రకంగా వుండాలంటే, మీరు ఏం తినాలనేది తెలియాలి. ఎంత తినాలనేది తెలియాలి ఏమి తినకూడదో తెలియాలి.
తినాలా ? వద్దా? అనేది కాదు ప్రశ్న ఇక్కడ...తినే ఆహారం సరిగా వుందా? లేదా అనేది నిర్ణయించుకోవాలి. సాధారణంగా తక్కువ పరిమాణంలో మూడు భోజనాలు, మూడు అల్పాహారాలు తీసుకోవాలి. భోజనానికి భోజనానికి మధ్య అల్పాహారం తీసుకోండి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్, మినరల్స్, విటమిన్ నీరు వుండాలి.
డయాబెటీస్ గలవారికి పీచు పదార్ధాలు తినటం చాలా మేలు చేస్తుంది. పీచు పదార్ధాలు కూరగాయలు, కాయ ధాన్యాలు, పండ్లు, బ్రౌన్ బ్రెడ్ మొదలగు వాటిలో వుంటాయి. పీచు పదార్ధాల కారణంగా మలవిసర్జన బాగా జరిగి ఆరోగ్యం ఏర్పడుతుంది. సలాడ్లు, వెజిటబుల్స్ అధికంగా తిని పోషకాహార విలువలను సమతుల్యం చేసుకోండి. డయాబెటీక్ రోగులు మాంసాహారం తినరాదని లేదు. ప్రత్యేకంగా ఏవైనా కిడ్నీ సమస్యలవంటివి వుంటే తప్ప మాంసాహారం, చేపలు మొదలైనవి తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications