Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మధుమేహ రోగుల మందుల సమస్య!

సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కల వారందరూ టాబ్లెట్లతోనే ఆ వ్యాధిని నియంత్రించుకుంటుంటారు. సర్జరీ చేసే సమయాలలోను, లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైనా లేక ఏదేని కారణాల వలన టాబ్లెట్ తిన లేకపోతే ఇన్సులిన్ వాడాలి. టైప్ 1 డయాబెటీస్ వారికి ఇన్సులిన్ తప్పక ఉపయోగించాలి. వీరు టాబ్లెట్లు ఎప్పటికి వాడరాదు.
మధుమేహానికి టాబ్లెట్లు ఎప్పటినుండి వాడాలి?
వైద్యులు టైప్ 2 డయాబెటీస్ వున్నదని పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాత కొంతకాలంపాటు అంటే సుమారు మూడు నెలలపాటు ఆహారం మార్చి మధుమేహ స్ధాయిలను పరిశీలించాలి. ఈ చర్య మధుమేహ రోగులు ఏ రకమైన ఆహారాన్ని భుజించాలనేది కూడా రోగులకు సూచిస్తుంది. ఆహారం మార్చినప్పటికి షుగర్ లెవెల్స్ లో మార్పు లేనపుడు ఇక తప్పనిసరిగా మార్పు చేయబడిన ఆహారంతోపాటు టాబ్లెట్లను వాడటం మొదలుపెట్టాలి.
మధుమేహానికి వాడే టాబ్లెట్లన్ని ఒకటిగానే వుంటాయా?
ఖచ్చితంగా ఒకటిగా వుండవు! ఇవి వివిధ రకాల పవర్ ను కలిగి వుంటాయి. దేశంలో అనేక కంపెనీలు వివిధ రకాల పేర్లతో టాబ్లెట్లను తయారు చేస్తున్నాయి. సుమారుగా వీటిలో 50 పేర్లవరకు కూడా వున్నాయి. వైద్యులు రాసిన పేరుకు మీరు కొన్న టాబ్లెట్ పేరుకు సరిపడినదా లేదా చూడాలి. కొన్ని కంపెనీలు టాబ్లెట్లకు ఇన్సులిన్ పేర్లను కూడా పెడతాయి. కనుక రోగులు ఏ రకమైన డయాబెటీస్ కలిగి వున్నప్పటికి వైద్యులు రాసిన మందు చీటీలతో తాము కొన్న మందులను తప్పక సరిచూసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
