Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డయాబెటీస్ వ్యాధిని కలిగించే అలవాట్లు

అతిగా పాలుత్రాగడం, పాల ఉత్పత్తులు భుజించడం. అతిగా చక్కెర ఉపయోగించడం, చక్కెర రసాలు త్రాగడం, క్రొత్తగా పండిన ధాన్యాలను, తెల్లని బియ్యాన్ని వంటలలో వాడడం, ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు సేవించడం, అతిగా నిద్ర పోవడం మరియు శరీరశ్రమ లేదా వ్యాయామం కావలసినంత చేయకపోవడం, మానసిక ఆందోళన, భారీ కాయం మరియు అతిగా తినే అహారపు అలవాట్లు, ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం. ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.అతిగా ఆహారం తీసుకోవడం.
మానుకోవలసిన అలవాట్లు
తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు తినటం మానుకోవాలి. స్వీట్లు వంటివి అపరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ సూచిస్తే ఇన్సులిన్ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు. డయాబెటీస్ రోగులు పాదరక్షలు లేకుండా నడవకూడదు. పొగతాగడం పూర్తిగా మానుకోవాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications