Latest Updates
-
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
వంటలలో ఆనందం...తినడంలో ... ?

స్టార్ హోటల్ మాస్టర్ ఛెప్ టీ.వి.లో ఒక వంటకం చూపాడంటే, వన్ ఇండియా లాంగ్వేజీ పోర్టల్ లోని వంటకాల సెక్షన్ లో సింధు ఒక వంటకం చూపబడిందంటే...వాటికి సంబంధించిన పదార్ధాలు అత్యధిక అమ్మకాలు సాగించేస్తున్నట్లు సూపర్ మార్కెట్ రిపోర్టులు తెలుపుతున్నాయి. మరి వీరంతా తెలిపే వంటలు ఏమిటి? అవి మన నడుం కొలతలు తగ్గించటానికి ఉపయోగపడతాయా? గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ రోగులకు తినటానికి ఉపయోగపడతాయా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నలకు ‘లేదు' అనే సమాధానం చెప్పాలి. ఈ వంటకాలన్నిటికి ఏదైనా ఒక డేంజర్ లైట్ పెడితే....అది ఎల్లపుడూ ఎర్రగా వెలుగుతుంది.
ఈ కుక్ నిపుణులు తమ వంటకాలలో కావలసినంత కొవ్వు కల మాంసం, నూనెలు, తీసి పదార్ధాలు, కొవ్వులు, మసాలాలు ఎన్నో అతిగా వాడేయమని చెపుతారు. ఇదంతా నోరూరించేందుకు బాగున్నదని తినిపించేందుకు పనికి వస్తాయి. కాని ఆరోగ్యాన్నివ్వవనే చెప్పాలి. ఈ వంటకాలలో మనకు రోజుకవసరమైన కేలరీలు అన్ని ఒకే భోజనంలో లేదా వంటకంలో వచ్చేస్తాయి.
వంటలో ఆనందం - రెసిపి పుస్తకాలలో సైతం కేలరీలు అధికమే. వీటిలోని పదార్ధాలు వాడుక పరిశీలిస్తే, ఒక్క సెర్వింగ్ లో సగటు కేలరీలు గతంలోని శాతంకంటే నేడు 63 శాతానికి పెరిగిపోయాయి. ఇదంతా షుమారు రెండు లేదా మూడు దశాబ్దాలలో వచ్చిన మార్పు. కేలరీలలో కల ఈ జంప్ కొవ్వు, షుగర్ కారణంగా అని తెలుస్తోంది. అంతేకాదు, తినే పరిమాణంలో కూడా వందని పోషకాహార నిపుణులు చెపుతారు. ఉదాహరణకు 2000 సంవత్సరంలో రెండు చెంచాల నూనె వేయండని చెపితే, నేడు అదే పదార్ధాలకు అది నాలుగు చెంచాల నూనెగా చెపుతున్నారు.
నేడు వచ్చే డిన్నర్ ప్లేట్లు కూడా50 సంవత్సరాల క్రిందటి వాటితో పోలిస్తే 30 శాతం పెద్దవిగా వున్నాయి. మీరు కనుక మీ 30 సెం.మీ. ల ప్లేటును 25 సెం.మీ. ప్లేటు సైజుకు మార్చగలిగితే, ఒక సంవత్సరంలో షుమారు మీరు 8 కె.జి.ల బరువు తగ్గే అవకాశం వుంటుంది. దీని ప్రభావం మీ ఆరోగ్యంపై బాగా కనపడుతుంది.
గతంలోని వంటమనుషులు ఆహారాలను ఎలా బ్యాలన్స్ చేయాలి? వాటి గుణగణాలను తెలుసుకొని ఎలా మితంగా వాడాలి? అవి ఎంత తాజాగా వుండాలి అనేవి బాగా ఆచరించేవారు. మనం తినే లేదా వంటలలో వాడే పదార్ధాలు పర్యావరణానికి, మన ఆరోగ్యానికి అనుకూలంగా వుండేవిగా వుండాలి. మనలను జబ్బులబారిన పడకుండా కాపాడాలి. లేదంటే మరో మారు మనమంతా మన పూర్వీకులను వంటలకై ఆశ్రయించాల్సిందే. రెండు లేదా మూడు దశాబ్దాల క్రిందటి వంట విధానాలను ప్రతివారూ ఆచరించాలి. ఆధునికంగా వచ్చిన బేకరీ ఆహారాలు, జంక్ ఆహారాలకు స్వస్తి చెప్పాలి. అపుడే, నేడు చిన్న వయసులోనే వచ్చేస్తున్న షుగర్ లేదా గుండె జబ్బుల వంటి వ్యాధులను అరికట్టగలుగుతాము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
