Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
షుగర్ ఉన్నా కంట్రోల్ చేసుకుంటే పర్వాలేదు....!

టైప్1 డయాబెటిస్: ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం ఏర్పడటం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అధిక మూత్రవిసర్జన, దాహం ఎక్కువగా ఉండటం, ఆకలి పెరగడం, బరువు తగ్గడం, కంటి చూపులో తేడా రావడం, నీరసం వంటి లక్షణాలుంటాయి.
టైప్2 డయాబెటిస్: దీన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెల్లిటస్ అని కూడా అంటారు. శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ శరీరం ఆ ఇన్సులిన్‌ను ఉపయోగించుకోలేదు. ఈరకమైన డయాబెటిస్ మధ్య వయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు టైప్ 1 డయాబెటిస్ మాదిరిగానే ఉంటాయి.
డయాబెటిక్ న్యూరోపతి: డయాబెటిస్ అదుపులో లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలలో డయాబెటిక్ న్యూరోపతి ఒకటి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య మొదలవుతుంది. దీని ప్రభావం కాళ్లు, పాదాలు, చేతుల పైన ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని లోపలి అవయవాలపై కూడా ప్రభావం ఉంటుంది. చేతులు, పాదాలలో మంటలు, తిమ్మిర్లు ఉంటాయి. ముట్టుకుంటే తీవ్రమైన నొప్పి ఉంటుంది. నీరసం, కొంచెం దూరం కూడా నడవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మధుమేహం అదుపులో లేనట్లయితే వాటి ప్రభావం అనేక అవయవాలపై పడుతుంది.
జీర్ణవ్యవస్థ: పొట్టకు సబంధించిన నరాలపై ప్రభావం పడటం వల్ల ఆహారం నెమ్మదిగా జీర్ణం కావడం లేదా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్ మూలంగా తలెత్తే జీర్ణసమస్యలను గ్యాస్ట్రోపెసిస్ అంటారు. ఒకవేళ గొంతు భాగంలోని నరాలపై ప్రభావం పడితే ఆహారం మింగడం కష్టమవుతుంది.
రక్తనాళాలు - గుండె: గుండె వేగం పెరుగుతుంది. కూర్చున్నలేదా నిలబడినపుడు రక్తపోటు సడన్‌గా పడిపోతుంది. న్యూరోపతి వల్ల కార్డియాక్ డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
మూత్రనాళం : న్యూరోపతి వల్ల బ్లాడర్ కంట్రోల్ తగ్గిపోతుంది. బ్లాడర్ నుంచి మూత్రం పూర్తిగా వెళ్లదు. దీనివల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ రిస్క్ రెట్టింపు ఉంటుంది.
లంగ్స్: డయాబెటిక్ న్యూరోపతి ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుంది. శ్వాస సరిగ్గా తీసుకోలేరు. బ్రీతింగ్ సమస్యలు ఎక్కువవుతాయి. ఆయాసం వస్తుంది. శరీరానికిక అవసరమయిన ఆక్సిజన్‌ను లంగ్స్ గ్రహించడంలో విఫలమవుతాయి.
అంగస్తంభన సమస్యలు :అంగస్తంభన సాధారణంగా ఉండాలంటే రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలి. కానీ డయాబెటిస్ వ్యాధి రక్తనాళాలను దెబ్బతీస్తుంది. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల రక్తసరఫరా సరిగా జరగక అంగస్తంభన సమస్యలు మొదలవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
