Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
డయాబెటీస్ రోగులకు కీళ్ళనొప్పులుంటాయా?

తినే ఆహారాన్ని నిర్దేశిత సమయాలలో తిని రక్తంలోని బ్లడ్ షుగర్ నియంత్రించండి. ఈ రకమైన తినే విధానం వలన డయాబెటీస్ నుండి వచ్చే సమస్యలను నివారించుకోగలరు.
డయాబెటీస్ వుంటే కీళ్ళనొప్పులు తప్పక వస్తాయి. డయాబెటీస్ నరాలను, రక్తప్రసరణను కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా కీళ్ళ నొప్పులు, శరీరంలోని మరికొన్ని ఇతర భాగాలలో సమస్యలు వస్తాయి. డయాబెటీస్ తో వచ్చే సమస్యల కారణంగా వచ్చే కీళ్ళ సమస్య, ఆవ్యాధి వలన వచ్చే కిడ్నీ లేదా రెటినోపతీలతో పోలిస్తే తక్కువగానే చెప్పాలి. అయితే, డయాబెటీస్ వ్యాధి ప్రభావం కీళ్ళ నొప్పులవరకు వచ్చిందంటే, ఇక రోగి పరిస్ధితి తీవ్రంగానే వుందని చెప్పాలి. డయాబెటీస్ రోగులకు ఛార్కోట్ ఫుట్ అని ఒక సమస్య వస్తుంది. ఈ సమస్యలో రోగి పాదం బాగా వాచిపోతుంది. అది మరింత ముదిరితే, పాదం వంకరపోయే ప్రమాదం కూడా వుంది.
ఛార్ కోట్ ఫుట్ లక్షణాలు ఎలా వుంటాయంటే....పాదం కీలు వద్ద వాపు, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన పాదం బాగా వేడిగా కూడా వుంటుంది. పాదం నొప్పి కూడా పుడుతుంది. ఛార్ కోట్ ఫుట్ అనేది శరీర బరువు ఎక్కడ పడితే అక్కడ వచ్చే అవకాశం వుంది. ఒక్కొకపుడు మడమవద్ద కూడా రావచ్చు. ఛార్ కోట్ జాయింట్ కు చికిత్స చేయవచ్చు. అయితే చికిత్సకు చాలా సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో నెలల తరబడి కూడా పట్టవచ్చు. కాలు పై బరువు తొలగించాల్సి వస్తుంది. డయాబెటీస్ రోగులు తమ పాదాలపట్ల ప్రత్యేక శ్రధ్ధ వహించాలి. పాదాల పగుళ్లు వంటివి సమస్యలు ఏర్పరుస్తాయి. పాదాలకు డయాబెటీస్ రోగులు ఎల్లపుడూ పూర్తిగా కవర్ చేస్తూ షూస్ లేదా సాక్స్ వంటివి ధరించాలి.
ప్రతిరోజూ పాదాలను గాయాలకొరకు పరీక్షిస్తూండాలి. పాదాల అడుగుభాగాలను అద్దంలో చూసుకొని పుండ్లు ఏమైనా వుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ఈ రోగులకు పాదాలకు దెబ్బలు ఏమైనా తగిలినప్పటికి స్పర్శ సరిగా వుండకపోవుటచే తెలిసికొనలేరు. డయాబెటిక్ రోగులకు ప్రత్యేకంగా పాదరక్షలు తయారు చేస్తారు. వీలైనంత మేరకు వీరు ఆ పాదరక్షలను ఉపయోగించటం మంచిది. తరచుగా పగుళ్ళలో మట్టి చేరకుండాను, గోళ్ళు వంటివి కత్తిరించేటపుడు గాయాలు కలుగకుండా కూడా వీరు పాదాలపట్ల జాగ్రత్త వహించాలి. డయాబెటీక్ రోగుల పాదాలకు రోగం ముదిరితే స్పర్శ పోతుంది. దానికి కారణం రక్తప్రసరణ సరిగా లేకపోవటమే. కొన్ని మార్లు విపరీతమైన కాళ్ళ నొప్పులు కూడా వీరిని బాధిస్తాయి. పాదాలు శరీరంలో చివరి భాగంలో వుండటం కారణంగా, గుండెనుండి ప్రసరణ అయ్యే రక్తం వీటికి చివరిగా చేరటంతో స్పర్శ కొంతమేరకు కోల్పోవలసి వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications