Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పుణ్యమా అని గత కొన్నేళ్లుగా లేఆఫ్స్ సంస్కృతి నడుస్తోంది. మన తెలుగు రాష్ట్రాలు ఇందుకు మినహాయింపు కాదు. ఇక విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకూ ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. ప్రమోషన్, జీతం పెరుగుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊహించిన ఇ- మెయిల్స్‌తో భారీ షాక్ ఇస్తున్నాయి కంపెనీ యాజమాన్యాలు. తాజాగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ మహిళ.. కంపెనీ తీరుతో కన్నీళ్ల పర్యంతమవుతోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

ఉన్నత చదువులు చదివిన యువత విదేశాల్లో కెరీర్ నిర్మించుకోవాలని కలలు కనడం కామన్. అక్కడే చదివి ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారూ ఉన్నారు. ఈ క్రమంలో ఏఐ పుణ్యమా అని ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని డైలామాలో ఉన్న వారు ఉద్యోగులు. ముందస్తు సమాచారం లేకుండా, నోటీస్ పీరియడ్ లేకుండా అప్పటికప్పుడే విధుల నుంచి తొలగిస్తూ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ హఠాత్పరిణామాలతో కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత కుంగుబాటుకి గురవుతున్నారు. ఆ బాధ నుంచి తేరుకుని కొత్త ఉద్యోగాల వేటలో పడుతున్నారు. కాగా, గత ఆరు నెలలుగా అమెరికాలో ప్రొబేషన్‌లో ఉన్న మహిళ.. రెగ్యులర్ ఎంప్లాయ్‌గా ఆఫర్ లెటర్ అందుకోకముందే కంపెనీ నుంచి నిష్క్రమించింది.
ఇన్‌స్టాగ్రామ్ వీడియో సమాచారం మేరకు.. భారత్‌కి చెందిన యువతి రుచిక.. అమెరికాలోని ఓ స్టార్టప్ కంపెనీలో సోషల్ మీడియా గ్రోత్ మేనేజర్‌గా చేరారు. ఆరు నెలలుగా ప్రొబేషన్‌లో ఉన్నారు. ప్రొబేషన్ అనంతరం ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని వాగ్ధానం చేసిన కంపెనీ యాజమాన్యం ఆఫర్ లెటర్ ఇవ్వకముందే కంపెనీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుని కాల్ చేయడం ఆమెను షాకింగ్‌కి గురిచేసింది. దీంతో సదరు మహిళ ఇన్‌స్టాలో తన ఆవేదనను పంచుకున్నారు.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా వర్క్‌లోకి లాగిన్ అవుతున్నప్పుడు కంపెనీ మేనేజర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని రుచిక తెలిపారు. బడ్జెట్ పరిమితుల కారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వెంటనే ఆమె పనికి సంంధించిన లాగిన్ ఐడీ, ఖాతాలన్నిటినీ నిలిపివేశారు. కనీసం నోటీస్ పీరియడ్ ఇవ్వడానికి కూడా తనకు అవకాశం ఇవ్వలేదని రుచిక ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి పనిచేసినా
డిసెంబర్‌లో కంపెనీలో చేరిన నాటి నుంచి ఆఫీసు పనికే ప్రాధాన్యత ఇస్తూ పనిచేశానని రుచికి చెప్పుకొచ్చారు. పండుగ సందర్భాల్లోనూ సెలవు తీసుకోకుండా పనిచేశానని, క్లిష్ట పరిస్థితుల్లోనూ విశ్రాంతి లేకుండా పనిచేసినట్లు తెలిపారు. మూడు నెలల ప్రొబేషన్ కాలం అనంతరం పర్మినెంట్ ఉద్యోగిగా చెప్పారని.. కానీ ఇంతవరకు ఆఫర్ లెటర్ ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రకటిస్తూ జూమ్ కాల్ చేశారని వివరించారు.
రుచిక వీడియోపై నెటిజన్లు స్పందించారు. నిరాశ చెందవద్దని అవకాశాలు వస్తూనే ఉంటాయని సలహా ఇచ్చారు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రుచిక సానుకూల దృక్పథంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ లేఆఫ్స్ నుంచి చాలా నేర్చుకున్నానని రుచిక తెలిపారు.



Click it and Unblock the Notifications