Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ప్రీ డయాబెటిస్ ఉందని చెప్పటానికి 5 సూచనలు
మీరు డయాబెటిస్ కొరకు చెక్ చేయించుకున్నప్పుడు లేదని తెలిస్తే సెలబ్రేట్ చేసుకోండి. కానీ మీకు ప్రీడయాబెటస్ కలిగి ఉంటే? అవును,మీ రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిస్ గా నిర్దారణ అవుతుంది. కానీ అది ఎక్కువ కాదు. అయితే దానిని డయాబెటిస్ అని పిలుస్తారు.
భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రీ డయాబెటిస్ బారిన పడిన వారు ఉన్నారు. కానీ వారిలో చాలా మందికి వారి సమస్య గురించి తెలియదు.
ప్రీ డయాబెటిస్ లో ఎక్కువగా ఎటువంటి లక్షణాలు కనపడవు. మీకు వ్యాధి ఉందో లేదో గుర్తించటానికి సహాయపడే కొన్ని సూచనలు ఉన్నాయి.
టైప్ 2 మధుమేహం హై-రిస్క్ గ్రూప్ లో ఉంది
మీకు మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర కలిగి ఉండటం, ఒక నిశ్చల జీవనశైలి కలిగి ఉండటం,మీ వయస్సు 45 సంవత్సరాలు ఉండటం,ఆసియా,ఆఫ్రికా లేదా హిస్పానిక్ నేపథ్యం కలిగి ఉండటం వలన రావచ్చు.
అధిక బరువు ఉండటం
స్థూలకాయం అనేది ప్రీ డయాబెటస్ కొరకు భారీ ట్రిగ్గర్ గా ఉంది.మీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 ఉంటే,అది ఖచ్చితంగా ఎక్కువ బ్లడ్ షుగర్ ను సూచిస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువు వలన అధిక రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్,గుండె వ్యాధి లేదా పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ వంటివి కూడా వస్తాయి.

క్లాసిక్ డయాబెటిస్ లక్షణాలు కలిగి ఉండటం
ప్రీ డయాబెటిస్ భయపెట్టే విధంగా ఉంటుంది. అనేక మందిలో ప్రీ డయాబెటిస్ సంబందించిన ఎటువంటి లక్షణాలు కనపడవు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మాత్రం చెప్పలేనంత అలసట ఉంటుంది. అలాగే తరచుగా దాహం అవటం మరియు ముత్ర విసర్జనకు వెళ్ళటం జరుగుతుంది.
మీ చర్మంపై నల్లని పాచెస్
ప్రీడయాబెటస్ వ్యక్తులలో భాహ్య చర్మపొర దళసరి అగుట వంటి సాధారణ లక్షణం కనపడుతుంది. మీ శరీర ప్రాంతాల్లో అక్కడక్కడ చర్మం ముడతలు,వింతగా ఉండుట,నల్లని మరియు మందపాటి పాచెస్ చూడవచ్చు. ఎక్కువగా ఈ పరిస్థితి మోకాలు వెనుక మరియు పిడికిలి,మోచేతుల లోపల,మెడ మీద కనిపిస్తుంది.
నిద్ర లేమి
మీరు నిద్ర లేమితో బాధపడుతున్నారా? అయితే మీకు ప్రీ డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం రోజూ ఆరు గంటల కంటే తక్కువ నిద్ర పోయే వ్యక్తులలో ప్రీడయాబెటస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ మరియు నిద్ర బలహీనత మధ్య హార్మోన్ల సంబంధాల ఫలితంగా కూడా ఏర్పడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
