Latest Updates
-
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.!
నవంబర్ 14: వరల్డ్ డయాబెటిస్ డే : హెల్తీ ఫుడ్స్ తో డయాబెటిస్ దూరం!
మధుమేహం...ప్రపంచవ్యాప్తంగా మానవాళికి పెను ఆరోగ్య సమస్యగా మారుతున్న వ్యాధి. ఒకప్పుడు అరవై ఏళ్లు పైబడిన వారికి వచ్చే వృద్దుల వ్యాధిగా దీనిని భావించే వారు. ఇప్పుడు ఇది యువకుల వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. డయాబెటిస్ జబ్బు కాదు. కానీ ఎన్నో జబ్బులకు కారణం. ఇది ఒక శారీరక స్థితి.. డైజెస్టివ్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ ప్రాణాంతకమైన వ్యాధికి ముఖ్య కారణం ఒబేసిటి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉండే వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఇలాంటి ఊబకాయస్తుల్లో ఉండే ఫ్యాట్ ఇన్సులిన్ కు అనుసందానం కలిగి ఉంటుంది.
1985లో ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల డయాబెటిస్ కేసులుంటే 2013 నాటికి 382 మిలి యన్లకు పెరిగాయి. 2035 నాటికి 592 మిలియన్ డయాబెటిస్ కేసులు నమోదయ్యే ప్రమాదముందని అంచనా. దాదాపుగా మన దేశంలో ప్రతీ కుటుంబంలో ఒక్కరైనా డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రతీ నలుగురిలో ఒకరు డయాబెటిస్ బాధితులు. ప్రపంచ వ్యాప్తంగా మనదేశమే డయాబెటిస్‌కి కేపిటల్ గా ఉంది. ప్రస్తుతం దేశంలో సుమారు 50 మిలియన్ల డయాబెటిస్ కేసులున్నాయని తెలుస్తోంది. 2025 నాటికి 60 మిలియన్లు దాటే అవకాశాలున్నాయి.
READ MORE:డయాబెటిస్ తో పాటు హార్ట్ సమస్యలున్నవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..
ప్రమాధకరమైన వ్యాధిని నివారించుకోవడానికి మరియు కంట్రోల్ చేసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌తో చెకప్ చేయిస్తూ, సూచనలు పాటిస్తే డయాబెటిస్ పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. మరి డాక్టర్స్ సలహా ప్రకారం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? రెగ్యులర్ డైట్ ఏంటి అనేది చాలా మందిలో మెదిలో ఆలోచన? డాక్టర్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని సూచించినా మీరు రెగ్యులర్ డైట్ లో ఎలాంటి ఆహారం ఉండాలని తెలుసుకోవడం చాలా అవసరం. మరి డయాబెటిస్ ను కంట్రోల్ చేసే ఆహారాలేంటోచూద్దాం...

పండ్లు:
షుగర్ పేషంట్స్ వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన ఆహారాల్లో తాజా పండ్లు ఒకటి. వాటిలో ఆపిల్స్, పీయర్స్, బెర్రీస్, బొప్పాయి, పీచెస్, వంటివి తప్పనిసరిగా తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినిరల్స్ మరియు ఫైబర్ ను పుష్కలంగా పొందవచ్చు.

వెజిటేబుల్స్:
మరో ముఖ్యమైన విషయం డయాబెటిస్ వారు నాన్ స్ట్రార్చ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. నాన్ స్ట్రార్చ్ ఫుడ్ లో ఫ్యాట్ , ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు డయాబెటిక్ డైట్ లో తప్పనిసరి.

త్రుణధాన్యాలు:
బ్రౌన్ రైస్, మిల్లెట్స్, గోధుమలు, బార్లీ వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :
డయాబెటిక్ వారికి అత్యవసరమైన గ్రీన్ టీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కేల, ఆకుకూరలు, లెట్యూస్, అరుగుల వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.

బ్రెడ్:
డయాబెటిస్ ఉన్న వారు వైట్ బ్రెడ్ కు ప్రత్యామ్నాయంగా బ్రౌన్ బ్రెడ్ , మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ను చేర్చుకోవాలి.

ఓట్స్:
డయాబెటిస్ వారికి ఓట్స్ ఒక హెల్తీ ఫైబర్ ఫుడ్ .

నట్స్:
బాదం, పీకెన్స్ మరియు వాల్ నట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

బెవరేజెస్:
అన్ స్వీటెండ్ టీ లేదా కాఫీని మరియు లోఫ్యాట్ మిల్క్ ను డయాబెటిస్ వారికి మంచిది . సోడాలను నివారించాలి.

స్నాక్స్:
బాగా బేక్ చేసి స్నాక్స్ ను డయాబెటిస్ వారికి చాలా ఉపయోగకరమైనవి.



Click it and Unblock the Notifications