Latest Updates
-
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా?
టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఖచ్చితంగా తినకూడని 7 ఫుడ్స్
దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. ప్రపంచాన్నే వనికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. ఒక సారి వచ్చిందంటే తర్వాత చచ్చే వరకూ పోదు. సామాన్యంగా దీన్ని నివారించుకోలేము కాబట్టి, డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ఒక వేళ టైప్ 2 డయాబెటిస్ కు గురైనట్లైతే శరీరంలో షుగర్ లేదా ఇన్సులిన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఇన్సులిన్ సరిగా లేనందున ఇన్సులిన్ రెస్టిటెంట్ టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అని పిలుస్తారు. ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ వారిలో బ్లడ్ షుగర్ లెవల్స్ హై లెవల్స్ లో ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ అన్ని వయస్సుల వారికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వారిలో లేదా ఊబకాయ గ్రస్తుల్లో ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గిపోతుంది. దాంతో టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది. టైప్ 2 డాయాబెటిస్ తో బాధపడే వారిలో నీరసం, అలసట, బరువు తగ్గిపోవడం, తరచూ మూత్ర సమస్య, కంటి చూపు బ్లర్ గా కనిపించడం , తరచూ ఎక్కువ ఆకలిగా ఉండటం ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్ కు ముఖ్య లక్షణాలు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మెర్లుగా ఉండటం జరుగుతుంది..
టైప్ 2 డయాబెటిస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ స్టైల్ మరియు ఆహారపు అలవాట్లలో మార్పుల తప్పనిసరిగా చేసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్ వ్యాయామాలు చేయాలి. బాడీ వెయింట్ ను అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ ఆహారాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి . ఇన్సులిన్ రెసిస్టెంట్ ను పెంచుతాయి.ఇటువంటి డయాబెటిస్ ఉన్న వారు హార్ట్ సంబంధి సమస్యలకు ఎక్కువ గురి అవుతుంటారు. కాబట్టి, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను దూరం చేసుకోవచ్చు.టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు కొన్ని ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం....

పంచదార:
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా షుగర్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి. కుక్కీస్, సోడ వంటి ఫుడ్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. కాబట్టి, షుగర్ ఎక్కువగా ఉన్నఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు, ఇన్సులిన్ లోపంతో గ్లూకోజ్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల శరీరంలో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. హైశ్యాచురేటెడ్ ఫుడ్స్ ను తినడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. శ్యాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే పెరుగు, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి

ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్ష వంటి డ్రైడ్ ఫ్రూట్స్ ఆరోగ్య పరంగా హెల్తీ న్యూట్రీషియన్స్, మరియు మినరిల్స్ అధికంగా ఉన్నాయి,. అయితే వీటిలో షుగర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల, వీటిని తినకపోవడమే మంచిది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమబద్దంగా ఉంటాయి.

ప్రొసెస్డ్ మీట్:
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు హార్ట్ డీసీజ్ లు పెరిగే అవకాశాలు ఎక్కువ. ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిస్క్ మరింత పెరుగుతుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచుతుంది.

బేక్డ్ ఫుడ్స్ :
బేక్ చేసిన ఆహారాల్లో కొన్ని రకాల ఫ్యాట్ కంటెంట్స్ ఉండటం వల్ల వీటిని తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచుతుంది. ముఖ్యంగా, వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బేక్ చేసిన ఆహారాలను తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిల్ పెరుగుతాయి .

ఆల్కహాల్ :
లివర్ లో బ్లడ్ షుగర్ వెవల్స్ మరియు ఇన్సులిన్ లెవల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండటం వల్ల శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తాయన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆల్కహాల్ తీసుకోవడం లివర్ కు మంచిది కాదు. కాబట్టి ఆల్కహాల్ ను తీసుకోవడం మానేసి, లైఫ్ ను హెల్తీగా మార్చుకోవాలి.

ఫ్రైడ్ ఫుడ్స్:
ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ లో శ్యాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్నాయి. అటువంటి ఫుడ్స్ అధిక బరువుకు కారణమవుతాయి. దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు కారణమవుతుంది. కాబట్టి, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు ఇటువంటి ఫుడ్స్ కు ఖచ్ఛితంగా దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications