Latest Updates
-
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా..
మీ మూత్రం ఏ రంగులో ఉందో గమనించారా?.. ఈ రంగుల్లో ఉంటే మాత్రం కచ్చితంగా రోగం ఉన్నట్లే!
మన శరీరంలో ఏదైనా సమస్య ఉంటే మూత్ర పరీక్ష ద్వారా తెలుసుకుంటాం కదా. అయితే పరీక్ష లేకుండానే మన మూత్రం రంగును బట్టి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవచ్చు. మూత్రం సాధారణంగా కాకుండా వేరే రంగులో ఉంటే కచ్చితంగా మనం ఎదో సమస్యలో ఉన్నామని అర్ధం చేసుకోవాలి. మూత్రం ఏ రంగులో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.
ఎరుపు లేదా పింక్ కలర్
మూత్రం ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటే కిడ్నీ పాడైందని అర్థం. పింక్ యూరిన్ చూసిన వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మూత్రం సాధారణంగా అదే కలర్‌లో కనిపిస్తుంటుంది. ఏదైనా ఆహరం తిన్నా, లేదా మందులు వేసుకున్నా మూత్రం పింక్ కలర్‌లో మారుతుంటుంది. అందుకే మీ మూత్రం పింక్ కలర్‌లో కనిపించగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎలాంటి ఆహరం తీసుకోకపోయినా, మీ మూత్రం అదే రంగులో కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించండి.

మూత్రం గోధుమ రంగులో ఉంటే..
మీ మూత్రం గోధుమ రంగులో ఉంటే, మీరు డీహైడ్రేషన్‌లో ఉన్నారని లేదా మీకు కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్య ఉందని అర్థం. కాబట్టి మూత్రం రంగు పసుపు రంగులో ఉన్నట్లయితే, మీ మూత్ర పిండాలు, కాలేయంపై శ్రద్ధ వహించాలి. మద్యం సేవించడం వంటివి చేయకూడదు. ప్రమాదం మరింతగా ముదిరినట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పసుపు రంగులో ఉంటే..
మూత్రం పసుపు రంగులో ఉంటే కామెర్లు ఉందని అర్ధం. కాకపోతే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నా కూడా మూత్రం పసుపు రంగులో వస్తుంటుంది. ఒకవేళ మీరు పుష్టిగా నీరు తాగుతున్నా మూత్రం పసుపు రంగులో కనిపిస్తే మాత్రం కచ్చితంగా కామెర్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, వైద్యులను సంప్రదించి దానికి తగిన చికిత్స చేయించుకోవాలి. అలాగే మీ మూత్రం నారింజ లేదా ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటే, కాలేయ ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం మంచిది.
మూత్రం చాలా నురుగుగా ఉంటే
మూత్రంలో ప్రొటీన్ ఎక్కువగా వెళితే, మూత్రం నురుగుగా ఉంటుంది. మీరు మూత్ర విసర్జనకు వెళ్ళిన ప్రతిసారీ మీ మూత్రం నురుగుగా ఉంటే, మీకు కిడ్నీ లేదా మూత్రాశయ సమస్య ఉందని అర్థం. కాబట్టి మీరు దీన్ని కనుగొంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మూత్రం నలుపు రంగులో ఉంటే..
మీరు విసర్జించే మూత్రం నలుపు రంగులో ఉంటే.. మీ శరీరంలో రసాయనం ఉందని అర్థం. మీరు దీన్ని కనుగొంటే, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
రంగు లేకపోతే?
మూత్రంలో రంగు లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నామని కాదు. మూత్రం ఏ రంగులో లేకపోతే మీకు మధుమేహం ఉందని అర్ధం. మూత్రం రంగు తేలికగా ఉన్నా, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్తున్నా మీకు మధుమేహం ఉందని అర్ధం చేసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications