Latest Updates
-
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
నారద జయంతి: వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి!
జీరో సైజుల భామ కరీనా ఫిట్ నెస్ రహస్యం!

కరీనా కపూర్ వెయట్ తగ్గించుకున్న తీరు వింటే ఎవరూ నమ్మరు! అందరూ ఆమె ఆహారాన్ని పూర్తిగా తగ్గించేసిందని, శరీరంలోని అధిక కొవ్వును తొలగించుకోడానికి సర్జరీలు చేయించుకుందని అనేవారు. కాని కరీనా కపూర్ ఒక ఆరోగ్యకరమైన ఆహార, వ్యాయామాల ప్రణాళిక ద్వారా తన బరువు తగ్గించుకొంది. బరువు తగ్గిన తర్వాత బలహీన పడిందంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. పేరొందిన ఈ నటి తిన్నది పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్. తనకిష్టమైన పరోటాలు, జున్ను, పిస్తా, ధాయ్, చైనీస్ తిండ్లను మానేసింది. మంచి పోషక విలువలు కల సూప్ లు, పచ్చని కూరల సలాడ్, పండ్లు, గుడ్లు, ఇంకా ఇతర సన్నబడే కేలరీలు తక్కువగల ఆహారాలను, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు వున్న వాటిని తీసుకుంది.
ఇక ఆమె ఫిట్ నెస్ ఛార్టు పరిశీలిస్తే - క్రమం తప్పకుండా రోజూ రెండు గంటలు యోగా, హృదయ సంబంధిత వ్యాయామాలు చేసేది. ఆమె రెగ్యులర్ గా వేసే ఆసనాలు - సూర్యనమస్కారాలు (50 సార్లు), ప్రాణాయామ, హఠయోగ, పొట్టకు పనికివచ్చే నౌకాసనం, వెన్నుకు భుజంగాసనం, బ్రీతింగ్ వ్యాయామం కపాల భాతి, చేతులకు, కాళ్లకు పర్వతాసన లేదా వీరభధ్రాసనలు వేసేది.
కరీనా కపూర్ ఎంతో ఆరోగ్యకరమైన, పోషక విలువలు కల ఆహారాన్ని తీసుకునేది ఆమె ఎపుడూ కూడా పూర్తిగా ఉపవాసం చేయటం లేదా అతి కఠోర ఆహార నియమాలు పాటించలేదు. కరీనా తాను రోజులో ఉన్న తన పనికి తగినట్లు ఆహారం తీసుకునేది. కరీనా కపూర్ డైట్ ప్లాన్ పరిశీలిస్తే - రోజూ ఉదయం పూట పండ్లు లేదా పాలు తీసుకునేది. కాఫీ, టీలకు స్వస్తి చెప్పింది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ ముక్కలు లేదా పరోటాలు పాలతో తీసుకునేది ప్రతి మూడు గంటలకు ఎనర్జీ కొరకు ఆమె బాదం పప్పులు లేదా సోయా మిల్క్ లేదా ఎలెక్టరాల్ తో కూడిన శాండ్ విచెస్ తీసుకునేది.
కరీనా కపూర్ తన లంచ్ లో చపాతీలు, పచ్చటి ఆకు కూరల పప్పు తీసుకుంది. ఆమె ఆహారంలో రైస్ లేదా ఇతర కొవ్వుపట్టే ఆహారాలు నిషేధం. ఛీజ్ అంటే ఆమెకు చాలా ఇష్టం కాబట్టి శాండ్విచ్ లేదా పరోటాలతో కొంచెం మొత్తంలో ఛీజ్ తినేది. ఇక ఆమె తీసుకునే డిన్నర్ చాలా తేలికగా వుండేది. కొద్దిపాటి పప్పు లేదా సూప్ లతో చపాతి, గ్రీన్ సలాడ్ తినేది. తినే ఆహారం రోజులో చేసే పనులకు అనుగుణంగా వుండాలనేది ఆమె నియమం. పని లేకుంటే తక్కవ ఆహారం. పని వుంటే ఎక్కువ ఆహారం అనేది ఆమె పెట్టుకున్న నియమం.
కరీనా కపూర్ తీసుకునే డైట్ లో ప్రత్యేకత ఏమీ లేదని, సాధారణంగా పోషకాహార నిపుణులు సూచించే ఆహార వ్యాయామ ప్రణాళికలనే ఆమె అనుసరించిందని చెప్పచ్చు. జీరో సైజులకు శరీరాన్ని తీసుకురావాలంటే, భారీగా ఆహారాన్ని తగ్గించేయటంసరియైన పరిష్కారం కాదంటోంది ఈ నాజూకు బాలీవుడ్ భామ. చెప్పింది బాలీవుడ్ సెలిబ్రిటీ కాబట్టి సన్నబడాలనుకునే వారంతా నమ్మాల్సిందే!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications