Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎదిగే పిల్లలకూ నేర్పించండి ఫిట్ నెస్ మంత్ర..

1. పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. అవుట్‌డోర్ గేమ్స్, రన్నింగ్, క్లైంబింగ్, సైక్లింగ్‌లు పిల్లల స్టామినాను పెంచటంతోపాటు వారిని శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంచుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల పిల్లల బరువు పెరగకుండా ఉండటంతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు లాంటి జబ్బులు దరిచేరవు.
2. ప్రతిరోజు పిల్లలు ఉదయం, సాయంత్రపు వేళల్లో వివిధ ఆటలు ఆడుకునేలా సమయాన్ని నిర్ధేశించండి. ఉదయం వేళ రన్నింగ్ చేయడం, సాయంత్రపు వేళ అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా ప్రణాళిక రూపొందించండి.
3. పిల్లలను రోజూ ఒకే ఆట ఆడేలా కాకుండా వివిధ రకాల వ్యాయామాలు, క్రీడల్లో పాల్గొనేలా అలవర్చండి. రన్నింగ్ ఒకటే కాదు సైక్లింగ్, ఫుట్‌బాల్, బాడ్మింటన్, టెన్నిస్, వాకింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, యోగా, స్కేటింగ్ లాంటి క్రీడల్లో పాల్గొనేలా పిల్లల్ని ప్రోత్సహించండి.
4. సండే ఉదయం వేళ, సెలవు రోజుల్లో పిల్లలతో పాటు ఇంటిల్లిపాది కలిసి వివిధ ఆటలు ఆడేలా ప్రణాళిక రూపొందించుకోండి. ఫిట్‌నెస్‌తోపాటు మెరుగైన ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి అన్న విషయంపై కుటుంబసభ్యులందరికీ అవగాహన కల్పించండి.
5. మీ పిల్లల వయసును బట్టి వివిధ క్రీడా సంబంధ శిక్షణ కార్యక్రమాలకు పంపించండి. చిన్నారులకు డ్యాన్స్, సైక్లింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్, కొంచెం పెద్ద పిల్లలకు టెన్నిస్, క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ లాంటి క్రీడల్లో శిక్షణ ఇప్పించండి.
6. మీ పిల్లల్ని ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి. డ్రామా, డిబేట్, గ్రూపు డిస్కషన్, మ్యూజిక్ లాంటి కార్యక్రమాల్లోనూ పొల్గొంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications