కండర సౌష్టవానికి... శక్తి ని పొందడానికి సహాయపడే మంచి ఆహారాలు...!

సాధారణంగా కొంతమంది వయస్సు ఎంత ఉన్నప్పటికీ మూడు పదులు దాటనట్లే కనిపిస్తారు. అంతే కాదు యువతకంటే ఎంతో చురుకుగా పనిచేస్తుంటారు. అదే మరికొందరూ ఎంత తిన్నప్పటికీ నీరసం, అలసట వంటి వాటితో బాధపడుతుంటారు. ఆఫీసుకు వెళ్లినప్పటికీ కూనికిపాట్లు పడుతుంటారు. నిస్సత్తువుగా ఉంటారు.

మగవారి విషయంలో కండరాలు ఉన్న మనిషిని చూస్తానే అబ్బా భలే ఉన్నాడు మనిషి అంటుంటారు. వారిలా మనం ఎప్పుడు తయారవుతాం అని మనస్సులో అనుకుంటారు. దేహ దారుడ్యాన్ని పెంచుకోవాలనుకొనే వారు మంచి పౌష్టికాహారాన్ని తింటే మీరు కండలు పెంచుకోగలుగుతారు, దాన్ని కఠినంగా అమలు చేస్తే అధిక బరువు వదిలించుకో గలుగుతారు, ఆరోగ్యకరమైన బరువును కలిగి వుంటారు. మాంసకృత్తులు, పీచు పదార్ధం ఎక్కువగా వుండి పిండి, కొవ్వు పదార్ధాలు తక్కువగా వుండే ఆహారం తీసుకోవడం ఇందులో ప్రాధమిక ఉద్దేశ్యం.

బాడీనీ స్లిమ్ గా ఉంచుకోవాలంటే.. చాలా వర్క్ అవుట్సే ఉన్నాయి. అయితే వర్క్ అవుట్స్ చేయడంతో బరువు తగ్గుతారు తప్ప మంచి శరీరసౌష్టవం(ఆకారం) కనబడదు. వ్యాయమంలో ముఖ్యంగా కార్డియో మరియు ఏరోబిక్ ఎక్సర్ సైజులను మాత్రమే చేయిస్తుంటారు. అయితే ఇవి మంచి శరీరసౌష్టవాన్నందిచి మజిల్స్ (కండరాలు) ఏర్పడేలా చేసేవి వేరేవి ఉన్నాయి. అలా బాడీ బిల్డప్ చేయాలనుకొనే వారు బాడీ బిల్డిగ్ ఉపయోగపడే ఆహారాలను ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ ఆహారాలు బాడీబిల్డ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. పెద్ద పెద్దగా మజిల్స్ ఉండి.. అందంగా కనబడే శరీర సౌష్టవానికి ఇదిగో డైయట్ లిస్ట్...!

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

గుడ్లు: గుడ్లలో ప్రోటీనుల అధికంగా ఉంటాయి. శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్‌ ఉన్నది. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

చికెన్ బ్రెస్ట్: ప్రతి వంద గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో 30గ్రాముల ప్రోటీనులు ఉంటాయి. దీని విలువ కూడా తక్కువే. తయారు చేయడం చాలా సులభం. కాబట్టి చికెన్ బ్రెస్ట్ ను వివిధ రకాలుగా వండి తిని బాడీ బిల్డ్ చేసుకోండి.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

నీళ్ళు: ఇది ఆహారం కాదు. అయినప్పటికీ మజిల్స్ బిల్డ్ చేయడంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడం ప్రధానాంశం. మన శరీరంలో 70శాతం నీరు ఉంటుంది. మీ కండరాల్లో 75శాతం నీరు కలిగిటుంటుంది. మీ మజిల్స్ ను హైడ్రేట్ గా ఉంచడం వల్ల ఇది ఎనర్జీ పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు జీర్ణక్రియ సక్రమంగా జరగుతుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

ఫిష్ ఆయిల్: ఫిష్ ఆయిల్లో యాంటీఇన్ప్లమేటరీ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. అధికంగా వర్క్ అవుట్స్ చేసేటప్పుడు మీ శరీరం తిరి యథాస్థితికి చేరుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అంటే మీరు మళ్ళీ మీరు వర్క్ అవుట్స్ చేయడానికి తగినంత శక్తిని అంధిస్తుంది. అంతే కాదు ఫిష్ ఆయిల్ మీ జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఇంకా ఇది కండర పుష్టిని పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

టర్కీ: టర్కీ మజిల్ బిల్డింగ్ కు వండర్ ఫుల్ గా సహాయపడుతుంది. దీనిలో ఉండే ప్రోటీనులు, విటమినులు, మినిరల్స్ మజిల్ బిల్డప్ కు బాగా సహాయపడుతాయి.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

పైనాపిల్: పైనాపిల్ జీర్ణవ్యవస్థకు సహాయపడే మంచి ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవడం చాలా మంచిది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

ఆకుకూరలు: మజిల్ గ్రోత్ కు ఉపయోగపడే ఫైటోఎక్డెస్టరాయిడ్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ ఆకు కూరలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి , కండర పుష్టికి చాలా మంచిది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

స్వీట్ పొటాటో: శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

సాల్మన్(Salmon)ఫిష్: మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉన్నటువంటి పోషకాలు, న్యూట్రీషియలన్లు, మనిషికి కావల్సిన శక్తి సామర్థ్యాలను రెట్టింపుచేస్తుంది. ఇంకా ఆర్ బిసి కౌంట్ ను పెంచుతుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇంకా జీర్ణం నిధానంగా అయ్యి, ఆకలి పెంచదు. దాంతో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ నిర్ధిష్టంగా ఉంచుతుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

కాటేజ్ చీజ్: చాలా మండి ఈ చీజ్ ను తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో మజిల్ బిల్డ్ చేసే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

చాక్లెట్ మిల్క్: చాక్లెట్ మిల్క్ మజిల్ బిల్డ్ చేయడానికి చాలా బాగా సహాయపడుతాయి. ఇది జీవక్రియ క్రమబద్దంగా జరిగేలా చేస్తాయి. ఈ చాక్లెట్ మిల్క్ క్రీడాకారులకు చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

రెడ్ మీట్: మటన్ రెడ్ మీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ ను తినడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు. మటన్ లేదా బీఫ్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మట్టన్ లేదా బీఫ్ తరుచూ తీసుకొంటే మజిల్స్ త్వరగా ఏర్పడుతాయి. మటన్ లో కూడా అర్జినైన్ అనే విటమిన్ మజిల్స్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

బీన్స్: బీన్స్ లో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది.

15 బెస్ట్ మజిల్ బిల్డింగ్ ఫుడ్స్...!

బాదాం: బాదాంలో అధిక ప్రోటీనులు మరియు ఫ్యాట్ కలిగి ఉంటుంది. అంతే కాదు ఇందులో విటమిన్ ఇ ఉండి, మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోడుతుంది. మీరు వర్క్ అవుట్ చేసిన వెంటనే మిమ్మిల్నీ తేరుకొనేలా చేస్తుంది.

Story first published: Friday, February 15, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion