Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
లైంగిక సామర్థ్యంతో పాటు స్టామినాను పెంచే 20 వెజ్ ఫుడ్స్...!
పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. ఈ భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోబాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలిసున్న భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి. సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయట పడగలుగుతామని పరిశోధకులు తెలిపారు.
స్టామినా అనేది ఎల్లప్పుడూ గుడ్లకు మరియు మాంసాహారణికి సంబంధం ఉంటుంది. సాధారణంగా మాంసాహారాలే స్టామినా పెరుగుదల సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే , శాఖాహారాల సంగతేంటి అంటే? నాన్ వెజ్ లో లాగే ..వెజిటేరియన్ ఫుడ్ లో కూడాశక్తిని పెంచే మరియు ఫిట్ గా ఉంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వెజిటేరియన్ ఫుడ్ కూడా స్టామినాను పెంచే సామర్ద్యాన్ని కలిగి ఉంటాయి. నాన్ వెజిటేరియన్ కాకుండా వేజిటేరియన్ ఫుడ్ లో స్టామినాను పెంచే అన్ని ఆహారాలను నిర్ధారించుకోవాలి.
నాన్ వెజిటేరియన్ లో చేపలు, గుడ్లు, చికెన్, మటన్ స్టామినాను పెంచుతాయి. అలాగే వెజిటేరియన్ ఫుడ్స్ లో కూడా చాలా రకాల ఆహారాల్లో పూర్తి పోషకాంశాలు ఉన్నాయి. వెజిటేరియన్ ఫుడ్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంతో పాటు, మీకు కావల్సిన ఎనర్జీని అందిస్తాయి. తక్షణ శక్తి అందించే గుణాలు అరటి మరియు గ్రీన్ గ్రేప్స్ లో పుష్కలంగా ఉన్నాయి. పవర్ ఫుడ్ (శక్తివంతమైన ఆహారాలు)ఎప్పుడు అవసరం అవుతుంది. శారీర శ్రము దీర్ఘకాలం పాటు కొనసాగించేటప్పుడు మీరు తప్పనిసరిగా పోషకాలు మినిరల్స్ పుష్కలంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను తీసుకోవాలి.
స్టామినాను అందించే ఆహారాలు వివిధ పోషక సమూహాల నుండి వచ్చినవి. మీరు వెజిటేబుల్స్ తినడం వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్స్, అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం, పండ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వంటివే మీకు స్టామినా అందించే పవర్ ఫుడ్స్ అంతే కాదు ఈ ఆహారాలు కండరములను బలంగా ఉంచడానికి మరియు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. ఈ ఆహారాలన్నింటిని మీ మెనూలో చేర్చుకోన్నట్లైతే మీరు బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నారని భావించవచ్చు . కాబట్టి మాంసాహారం తినని వారు..శాకాహారులు పూర్తి వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకొని మీ ఎనర్జీ లెవల్స్ ను పెంచుకోవచ్చు.మ రి అటువంటి ఆహారాలేంటో ఒకసార చూద్దాం...

అరటి: అరటి ఫైబర్ మరియు సాధారణ ఫ్రక్టోజ్ లేదా నేచురల్ ఫ్రూట్ షుగర్ యొక్క కలయిక. ఒక అరటి పండును తినడం వల్ల తక్షణ శక్తి ఇస్తుంది. మరియు మీకు దీర్ఘ కాలానికి కావల్సిన స్టామినాను పెంచుతుంది.

ప్యూనట్ బట్టర్( శనగ వెన్న): ప్యూనట్ బట్టర్ లో మంచి కొవ్వులు కలిగిన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా కలిగి ఉంది. ఇవి మీ గుండె, మరియు నొప్పి నివారణకు రక్షించడానికి సహాయపడుతుంది. నెమ్మదిగా జీర్ణం అవ్వడమే కాక, దీర్ఘకాల శక్తిని అందిస్తుంది.

బీట్రూట్ జ్యూస్: బీట్రూట్ రసం ఒక 'అలసట కిల్లర్' అని చేయవచ్చు. మీరు వ్యాయామం చేయడానికి ముందు వ్యాయామ సమయాన్ని మరికొంత పొడిగించడం కోసం బీట్ రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. బీట్ రూట్ లో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ సిలు పుష్కలంగా ఉండటం వల్ల స్టామినాను పెంచుతుంది.

నీళ్ళు: మీ శరీరం హైడ్రేషన్ (తేమగా)లో లేకపోతే ఎప్పుటీకి మీరు శక్తివంతలుగా అనిపించదు. నీళ్ళు శరీరంలోని అన్ని టాక్సిన్స్ (విషాలను)తొలగిస్తుంది. కాబట్టి ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించండి.

రెడ్ గ్రేప్: ఎర్ర ద్రాక్షలో తక్షణ శక్తి నిచ్చే నేచురల్ షుగర్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా ద్రాక్షలోని resveratol అనే రసాయనం దీర్ఘకాలానికి ఉపయోగపడే స్టామినాను పెంచడానికి సహాయపడుతుంది

ఓట్ మీల్: ఓట్ మీల్స్ కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ కోవలోనికి వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ కడుపు ఫుల్ గా ఉంచడమే కాకుండా ఎక్కువ సేపు ఆకలి కానివ్వదు. కొన్ని గంటల వరకూ మీకు కావల్సిన శక్తిని అంధిస్తుంది.

కాఫీ: కాఫీ లేదా కెఫిన్ ఒక తక్షణ ఉద్దీపనను కలిగిస్తుంది. ఇది మీ మెదడుకు రీ ఎనర్జీని అంధిస్తుంది మరియు నీటిలో ఉడికించిన ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత మిమ్మల్ని హెచ్చరికగా ఉంచుతుంది. అయితే కెఫిన్ ను ఎక్కువ మేతాదులో తీసుకొంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. తగు మోతాదులో తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంతో పాటు స్టామినాని అంధిస్తుంది.

బీన్స్ : బీన్స్ లో ఇనుము సమృద్ధిగా ఉన్నది మరియు ఇనుము రక్తానికి ఆక్సిజన్ ను చేరవేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. అందువలన, బీన్స్ స్టామినాను పెంపొందించడంలో ఒక మంచి ఆహారం కూడా..

ఆకుకూరలు: ఆకు కూరల్లో పుష్కలమైన ఫైబర్ తో పాటు విటమిన్ C కూడా అధికంగా ఉంటుంది. ఫైబర్ మిమ్మల్ని కడుపు నిండుగా ఉండేట్లు చేస్తే విటమిన్ సి మీకు కావల్సిన పోషక విలువల పెంచుతుంది. పోషకాంశాలను అందిస్తుంది.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు శరీరంలోని టాక్సిన్ ను శుభ్రపరచడానికి మరియు వ్యాధి నిరోధకతను పెంపొందించడానికి కావల్సిన నన్ని ఎనర్జీలెవల్స్ ను కలిగి ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం సిట్రస్ పండ్ల రసాన్ని ఒక గ్లాసు త్రాగడం వల్ల ఆరోజంతా మీకు కావల్సిన శక్తిని అందిస్తుంది.

బ్రౌన్ రైస్: బ్రౌన్ రైస్ కాప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ( ఫైబర్ మరియు విటమిన్ B పుష్కలంగా ఉన్న)కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ లో స్టార్చ్(గంజి) తక్కువ అందువలన నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అదుకే ని, మీరు కడుపు నిండుగా మరియు ఎక్కువ సేపు ఆకలి లేకుండా అనుభూతి కలిగి ఉంటారు. ఇంకా ఎనర్జిటిక్ గా ఉంటారు.

యాపిల్స్: ఆపిల్ ఇనుము పుష్కలంగా ఉన్నది. ఐరన్ మీ రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. మరియు మళ్లీ పని వేగంగా పొందడానికి మీ శరీరంలో ప్రతి సెల్ అనుమతిస్తుంది.

గ్రీన్ టీ: గ్రీన్ టీ జస్ట్ కాఫీ వంటిదే. గ్రీన్ టీ కూడా ఒక మెదడు ఉద్దీపన కలిగిస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల మీ జీవక్రియలన్ని శుభ్రపరుస్తుంది మరియు అలసటను తగ్గిస్తుంది కాబట్టి గ్రీన్ టీ మంచి ఎంపిక.

క్వీనా(Quinoa): Quinoa ఈ ఆహారాన్ని ముఖ్యంగా అథ్లెట్లకు(స్పోర్ట్ ఆడేవారికి)అత్యంత శక్తివంతమైన ఆహారంగా భావిస్తారు. ఇది మాకు అందుబాటులో ఉండే ఒక ఆరోగ్యవంతమైన ధాన్యాలలో ఒకటి. ఇది కండరాలు బలోపేతం చేయడానికి ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు బాగా సహాయం చేస్తాయి.

బాదాం: బాదాంలో విటమిన్ E మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మంచి క్రొవ్వులను కలిగి జీవక్రియలు క్రమబద్దం చేసి తగిన శక్తిని అందిస్తాయి.

సోయాబీన్: కండర నిర్మాణానికి తగినంత పోషక విలువలను సోయాబీన్స్ అందిస్తుంది. కండరాలకు తగినంత బలం మీకు స్టామినాను అందించే శక్తి సామర్థ్యాలను వ్యాయామం తర్వాత రీఎనర్జీ పొందడానికి, బాగా సహాయపడుతాయి.చేయడానికి సామర్థ్యం ఇస్తుంది క్రీజులు.

మాక(Maca): మాక( Maca)పురాతన మూలికా ఔషదం. తక్షణ శక్తిని పెంపొంధించుకోవడానికి మరియు లైంగిక సామర్థ్యంను పెంపొందించుకోవడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మకా వేర్లను అనేక ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు.

డ్రై ఫ్రూట్స్: ఎండిన ఫలాలు అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. మీరు డ్రైఫ్రూట్స్ తిన్నప్పుడు మీ కడుపు ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ సేపు ఆకలి పెంచదు. మరియు ఎక్కువ శక్తిని అంధించడానికి ఉపయోగపడే ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

గుమ్మడికాయ: గుమ్మడికాయ మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో అధిక కేలరీలు లేకున్నా కడుపు నింపుతుంది మరియు హార్మోనులను నియంత్రిస్తుంది. మరియు మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు మరియు శక్తివంతంగా ఉంచేందుకు బాగా సహాయపడుతుంది

మొక్కజొన్న : కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారం మొక్కజొన్న. ఇది మీ శరీరానికి కావల్సిన శక్తిని రూపొంధించడానికి ఉపయోగపడే గ్లైకోజెన్ ను తక్షణం అంధిస్తుంది.



Click it and Unblock the Notifications











