Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బాడీ బిల్డ్ చేసే ఈ ఆహారాలు తప్పనిసరిగా తినాలి..!?
మగవారి విషయంలో కండరాలు ఉన్న మనిషిని చూస్తానే అబ్బా భలే ఉన్నాడు మనిషి అంటుంటారు. వారిలా మనం ఎప్పుడు తయారవుతాం అని మనస్సులో అనుకుంటారు. దేహ దారుడ్యాన్ని పెంచుకోవాలనుకొనే వారు మంచి పౌష్టికాహారాన్ని తింటే మీరు కండలు పెంచుకోగలుగుతారు, దాన్ని కఠినంగా అమలు చేస్తే అధిక బరువు వదిలించుకో గలుగుతారు, ఆరోగ్యకరమైన బరువును కలిగి వుంటారు. మాంసకృత్తులు, పీచు పదార్ధం ఎక్కువగా వుండి పిండి, కొవ్వు పదార్ధాలు తక్కువగా వుండే ఆహారం తీసుకోవడం ఇందులో ప్రాధమిక ఉద్దేశ్యం.
బాడీనీ స్లిమ్ గా ఉంచుకోవాలంటే.. చాలా వర్క్ అవుట్సే ఉన్నాయి. అయితే వర్క్ అవుట్స్ చేయడంతో బరువు తగ్గుతారు తప్ప మంచి శరీరసౌష్టవం(ఆకారం) కనబడదు. వ్యాయమంలో ముఖ్యంగా కార్డియో మరియు ఏరోబిక్ ఎక్సర్ సైజులను మాత్రమే చేయిస్తుంటారు. అయితే ఇవి మంచి శరీరసౌష్టవాన్నందిచి మజిల్స్ (కండరాలు) ఏర్పడేలా చేసేవి వేరేవి ఉన్నాయి. అలా బాడీ బిల్డప్ చేయాలనుకొనే వారు బాడీ బిల్డిగ్ ఉపయోగపడే ఆహారాలను ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ ఆహారాలు బాడీబిల్డ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. పెద్ద పెద్దగా మజిల్స్ ఉండి.. అందంగా కనబడే శరీర సౌష్టవానికి ఇదిగో డైయట్ లిస్ట్...!

ఓట్ మీల్: ఓట్ మీల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మరియు టైప్ 2మధుమేహాన్ని తగ్గిస్తుంది. శరీరం మరియు జీవన చర్యకు ఉపయోగపడు శక్తిని విడుదల చేయుట మరియు కొవ్వు నిల్వలను తగ్గించుటకు ఓట్ మీల్ అద్భుతంగా సహాయపడుతుంది.

వెయ్ ప్రోటీన్ : అత్యధిక నాణ్యత గల ఒక ప్రోటీన్ ఇది, దీన్నివ్యాయామం తర్వాత తీసుకోవడం ద్వారా ఇది శరీరంలో దాదాపు వెంటనే కలిసిపోతుంది. అందుబాటలో ఉండే ఈ వేయ్ ప్రోటీన్ ను నీటితో కలిపి ఒక స్కూప్ తీసుకోవడం ద్వారా ఇది తక్షణ శక్తిని అంధిస్తుంది.

గుడ్లు: గుడ్లలో అధిక ప్రోటీనులు మరియ ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉండి అతి తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. మీ శరీరాన్ని, కండర పుష్టిని పెంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. అధిక కొవ్వును నియంత్రించడానికి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్డు ఆరోగ్యం, పోషక విలువలు కల బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీర కొవ్వు కరిగి ఎనర్జీ వస్తుంది. గుడ్డు పొట్ట నింపుతుంది. కొవ్వును కరిగించి ఎనర్జీగా మార్చి శరీరానికిస్తుంది.

కాటేజ్ చీజ్: చాలా మండి ఈ చీజ్ ను తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో మజిల్ బిల్డ్ చేసే గుణాలు అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి.

పీనట్ బట్టర్: ఇది ఒక ప్రోటీన్, ఇందులో అవసరమైన విటమిన్లు, మెగ్నీషియం, ఫైబర్, ఫోలేట్ మరియు అర్జినైన్ పుష్కలంగా ఉంటుంది. పీనట్ బటర్ కాయధాన్యాల కుటుంబానికి చెందినది కాబట్టి గింజల గుణాలు కలిగి వుంటుంది - చక్కటి చిరుతిండి కూడా. రెండు టీ స్పూన్ల పీనట్ బట్టర్ తరువాతి భోజన౦ దాకా మీ ఆకలిని ఆపుతుంది. దీన్ని పళ్ళు, కరకరలాడేవి, లేదా మెత్తగా వుండే వాటితో ఉపయోగించి కావలసినంత బరువు తగ్గవచ్చు. మరియు హృదయ ఆరోగ్య ప్రోత్సహిస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

కింగ్ పీతలు(కింగ్ క్రాబ్ మీట్): సీఫుడ్ అంటే ఇష్టపడే వారందరికి, ఇది ఒక అద్భుతమైన బోన్ హెల్త్ ఆహారం. కండర పుష్టికి మరియు శరీరం యొక్క రోగనిరోధక శక్తి పెంపొంధించడానికి అవసరమైనటువంటి జింక్ మరియు కావల్సినన్ని యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

గుల్లలు: సముద్రంలో చేపల తర్వాత స్థానం ఓయిస్ట్రస్. వీటిలో జింక్ మరియు కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే వీటిని స్త్రీలు మరియు పురుషులు తీసుకోవడం చాలా అవసరం. పురుషుల సంతానోత్పతి, లైంగిక ఆరోగ్యానికి అవసరమైన జింక్ అత్యధికంగా కలిగి ఉన్నటు వంటి సహజ వనరు. జింక్ మగవారిలో ఆరోగ్యకరమైన టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడమే కాకుండా ఆరోగ్యరమైన స్పెర్మ్(వీర్యం)వృద్ది చెందడానికి సహాయపడుతుంది. పురుషుల్లో జింక్ లోపించడం వల్ల అత్యధికంగా హెయిర్ ఫాల్ సంభవిస్తుంటుంది. కాబట్టి శరీరానికి ఎక్కువ మోతాదులో జింక్ ను అందించే ఓయిస్ట్రెస్. కాబట్టి పురుషు ఆరోగ్యాని, అందానికి అత్యంత ప్రయోజకారినిగా పనిచేస్తుంది ఓయిస్ట్రెస్.

అరటి: పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు: మీ తీసుకొనే డైయట్ ఫుడ్ లో తప్పని సరిగా అరటిపండు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం అధిక శాతంలో ఉండి అత్యధికంగా శరీరానికి కావలసినన్ని మినిరల్స్ ను అంధిస్తుంది. ఇంకా చేసే పనిలో ఏకాగ్రత పెంచడానికి దృష్టి సారించడానికి కావల్సిన డొపమైన్ అనే రసాయనాలను ఇది విడుదల చేస్తుంది. నరాలను ఆరోగ్యంగా ఉంచే సెరోటినీన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పుష్కలమైన పొటాషియం మరియు క్యాల్షియం బోన్ హెల్త్ కు చాలా సహాయపడుతుంది.

చిల్లీస్: ఇన్ఫ్లమేషన్ ను నివారించడంలో ఒక నేచురల్ రెడీ ఈ చిల్లీస్. చిల్లీస్ లో ఉండే క్యాప్ససిన్ అనే అంశం ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జీవక్రియలను సక్రమంగా పనిచేయడానికి మరియు వేగంగా బరువు తగ్గడానికి అవసరం అయ్యే బీటా కెరోటిన్ ఇందులో పుష్కలంగా ఉంది.

స్వీట్ పొటాటో: శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది.

అత్తి పండ్లు: ఒక కఠినమైన లేదా కండరాలు గట్టిగా ఉండే చేసే ఆహారాల్లో ఒకటి ఈ అత్తిపండు. కండర పుష్టికి మరియు శరీరం యొక్క క్షార సంతులనం కొనసాగించడానికి అవసరమయ్యే ఖనిజాలు ఇందులో పుష్కలంగా కలిగి ఉన్నాయి.

పుట్టగొడుగులను: పుట్టగొడుగులను కండరము పుష్టికోసం ప్రోత్సహించే రుచికరమైన మరియు పుష్టికరమైన కూరగాయలతో సమానం.

Quinoa: Quinoa బియ్యం మరియు పిండి మిశ్రమాలకు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయం. ఇందులో పుష్కలమైన అమైనో యాసిడ్స్ ఉండి, ఇది కండర నిర్మాణం కోసం పరిపూర్ణ ఆహారం ఉంది.

గొర్రె మాంసము: మటన్ రెడ్ మీట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రెడ్ మీట్ ను తినడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు. మటన్ లేదా బీఫ్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మట్టన్ లేదా బీఫ్ తరుచూ తీసుకొంటే మజిల్స్ త్వరగా ఏర్పడుతాయి. మటన్ లో కూడా అర్జినైన్ అనే విటమిన్ మజిల్స్ పెరగడానికి బాగా తోడ్పడుతుంది.

టోఫు: సోయాబీన్ తో తయారు చేస్తారు, టోఫులో పుష్కలమైన అమైనో ఆమ్లాలు మరియు ఐసోఫ్లవోన్లు ఉండి ఇవి వర్క్ ఔట్స్ తర్వాత తిరిగి పూర్వస్థితికి చేరుకోవడానికి బాగా సహాయపడుతాయి.

కాయధాన్యాలు: మీరు కండర నిర్మాణాన్ని పెంచుకోదలచుకుంటే కాయధాన్యాలను తీసుకుంటుండాలి. కాయధాన్యాలలో మినిరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ కు బాగా సహాయపడుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ గుండెకు, కండరాలకు ఆక్సిజన్ చేరవేడయడంలో సహాయకారిగా ఉండి శరీరానికి కావలసిన శక్తి, సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో కండరాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు సహాయపడే అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు పాటు మాంసకృత్తులు సమృద్ధిగా ఉన్నాయి.

సాల్మన్ చేప: ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్ ఫిష్ ప్రొటీన్ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి.

అనాస పండ్లు: పైనాపిల్: పైనాపిల్ జీర్ణవ్యవస్థకు సహాయపడే మంచి ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవడం చాలా మంచిది. పైనాపిల్లో ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండేందుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

డార్క్ చాక్లెట్: చాక్లెట్ ఆరోగ్యానికి లాభదాయకం కాదని ఎవరు చెప్పారు?డార్క్ చాక్లెట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లెవనాయిడ్ కంటెంట్స్ బ్లడ్ సర్కులేషన్ కు బాగా సహాయపడుతాయి. మరియు జీవక్రియలను మెరుగుపరుస్తుంది.

పెరుగు: కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వుండే పెరుగు తినడం కూడా ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమే. పెరుగులో ఇతర పోషక విలువలు కూడా వుంటాయి. ఇందులో పుష్కలంగా కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను ఎదుర్కొంతటాయి. మీరు బెర్రీలు, గ్రనోలా లాంటి వాటితో కూడా మీగడ వాడవచ్చు.



Click it and Unblock the Notifications











