Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
నలభై ఏళ్ళ తర్వాత కూడా ఫిట్ గా ఉంచే సులభ చిట్కాలు..!
ఆరోగ్యం విషయంలో చాలామందికి ఎన్నో అపోహలుంటాయి. వాటిలో తాము నలభైయ్యవ దశకంలోవుంటే మరీనూ...ముఖ్యంగా నలభైయ్యవ దశకంలో ఉన్నప్పుడే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూవుంటే ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయని వైద్యలు పేర్కొన్నారు.
సాధారణంగా యుక్తవయస్సులోవున్నప్పుడు చేసిన వ్యాయామానికన్నా కూడా ఈ వయస్సులో చేస్తే ఫలితం ఎక్కువగా వుంటుందని పరిశోధకులు తెలిపారు. వ్యాయామాలు శరీరంలోని క్యాలరీల ఖర్చుకు అదనపు శక్తిని సమకూర్చడమే కాకుండా రాబోయే గుండె జబ్బులను కూడా నివారిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే నలభైయ్యవ దశకంలో ప్రారంభించిన వ్యాయామం అలాగే కొనసాగిస్తే అరవైయ్యవ దశకం వరకు కూడా అదే ఫిట్‌నెస్‌తో ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా వుండగా మనిషి తనలోని మేధస్సును పెంచుకోవడానికి కూడా వ్యాయామం ఎంతో తోడ్పడుతుంది.
రెగ్యులర్ చెకప్: మీ మెడికల్ కండిషన్ ఉన్నట్లైతే మీరు మెడికల్ చెకప్ చేయించుకోవాలి. మీరు ఏదైనా వ్యాయామం మొదలు పెట్టడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. జిమ్ లేదా జాగింగ్ మొదలు పెట్టే ముంది మెడికల్ చేయించుకోవడం చాలా సాధారణ విషయం.
నడక: ప్రతి రోజూ వ్యాయామంతో పాటు అరగంట పాటు నడవడం చాలా అవసరం. అయితే మీరు నలభైలో అడుగు పెట్టాకి ఇది తప్పనిసరి అవుతుంది. కాబట్టి ప్రతి రోజూ నడవడం మొదలు పెట్టండి. 20 నిముషాలతో మొదలు పెట్టి ఒక గంట వరకూ చేయవచ్చు.
మంచి ఆహారం: మీరు నలభైలో కూడా ఫిట్ గా ఉండాలంటే ఏం తీసుకోవాలి. మంచి ఆహారాన్ని మాత్రమే కాదు పూర్తి పోషకాంభాలున్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మీ శరీరానికి కావల్సిన ఆహారాన్ని తీసుకోవడానికి ఒక డైట్ చార్ట్ ను ఎంపిక చేసుకోండి
నిద్ర: నిద్ర ప్రతి మనిషికి చాలా అవసరం. కనీసం 7-8గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం.
మంచి పుస్తకాలు చదవడం: మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి మంచి పుస్తకాలను చదడం అలవాటు చేసుకోండి. ప్రతి రోజూ నిద్రించే ముందు ఇటువంటి పుస్తకాలు చదివడం అలవాటు చేసుకోండి. ఇవి మిమ్మల్ని పాజిటివ్ గాను మరియు మోటివేటెడ్ గాను ఉంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications