Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బరువు తగ్గించుకోవడానికి నివారించాల్సిన సాల్ట్ ఫుడ్స్
ప్రస్తుత రోజుల్లో యంగర్ జానరేషన్ లో ఎక్కువ మంది అన్ని సమయాల్లో తినడానికి ఇష్టపడుతుంటారు. అందుకు మంచి రెస్టారెంట్స్ ను వెతకడం మరియు వెళ్ళడం, వారికి ఇష్టమైన ఆహారాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే రోడ్ సైడ్ ఫుడ్స్ జంక్షన్స్ లో కూడా వారి నచ్చిన ఆహారాలు తయారుచేస్తుండటంతో వంట తయారుచేసే బాధ్యలను తప్పించుకొంటున్నారు. అలా మూడు పూటలా బయటే భుజించేస్తుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే, అది అనారోగ్యకరం అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. బయట ఆహారాలు చూసినప్పుడు మనకు కలర్ ఫుల్ గా ఆకర్షణీయంగా కనబడుతాయి. ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రమే కాదు, ఇవి మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. అంతే కాదు, అటువంటి కలర్ ఫుల్ ఆహారాలు ఎక్కువ సమయం నిల్వ చేయడానికి వాటిలో కలిపి ఉప్పు మన శరీరంలోపలి అవయావాలను డ్యామేజ్ చేస్తాయి.
ఆహారాల్లో ఉండే అదనపు ఉప్పు వల్ల శరీర ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలను కారణం అవుతుంది. వీటివల్ల మీ శరీరంలో అదనపు క్యాలరీలు చేరడంతో పాటు, అధికంగా ఉప్పు ఉన్న ఆహారాలు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్ట్రాల్ ను కూడా పెంచుతుంది. బరువు తగ్గడానికి మీరు నివారించాల్సి కొన్ని సాల్ట్ కలిగి ఆహారాల లిస్ట్ ను బోల్డ్ స్కై మీకు అందిస్తోంది.
‘హై బిపి'నా..ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి: క్లిక్ చేయండి
అయితే, అందుకు ముందుగా, ఇక్కడ కొన్ని హెల్త్ టిప్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఒక రోజుకు ఒక మనిషికి సగటున 2300mg సోడియం అవసరం అవుతుంది. మరియు మీరు డయాబెటిక్ అవయితే 1,500mg మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది.
ఉప్పుతో ముప్పెంత...?ఉప్పును ఎలా తగ్గించుకోవాలి?: క్లిక్ చేయండి
అందువల్ల ఉప్పును మితంగా తీసుకొని, మరియు ఆరోగ్యకరంగా ఉండండి. మరి మీరు నివారించాల్సిన కొన్ని సాల్ట్ ఫుడ్స్ ను మీకోసం కొన్ని ఇక్కడ ఇస్తున్నాం...

బ్రెడ్స్ :
రైస్ తో పోల్చినప్పుడు బ్రెడ్ ఆరోగ్యకరమని మీరు తినడానికి బ్రెడ్ ను ఎంపిక చేసుకుంటుంటారు. అయితే, రెండు బ్రెడ్ స్లైస్ లో 230mg ఉప్పు ఉంటుంది. కాబట్టి బ్రెడ్ ను తినడానికి ముందు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలో గుర్తించుకోండి.

సాండ్విచ్:
బరువు తగ్గించుకోవాలని నిర్ధారించుకొన్నప్పుడు, అధికంగా ఉప్పు ఉన్న సాండ్విచ్ లను తినకుండా నివారించడం మంచిది . సాడ్వించ్ లో ఫిల్ చేసి సాస్ లేదా చట్నీలలో ఉప్పు అధికంగా ఉంటుంది.

సూప్స్:
ఒక బౌల్ సూప్ లో 980mg ల సోడియం ఉంటుంది. మీరు బరువు తగ్గించుకోవాలనుకుంటే, మీరు చిన్న మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. అందులోనూ ఉప్పు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.

చిప్స్:
పిల్లలు మాత్రమే కాదు పెద్దలకు కూడా సాల్ట్ కలిగిన చిప్స్ మరియు వాఫర్స్ చాలా ఇష్టం. మరియు ఎక్కువగా తింటారు. అయితే శరీర ఆరోగ్యానికి మంచి చేయడం కంటే ఎక్కువగా హాని చేస్తాయి. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో ఉప్పు కలిగి ఉంటుంది. చిప్స్ కు చాలా మంది అడిక్ట్ అయ్యి ఉంటారు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ వాటిని అవాయిడ్ చేయడం మంచిది.

చికెన్:
ఇతర మాంసాహారాలతో పోల్చితే, చికెన్ లో అధికంగా ఉప్పు ఉంటుందని మీకు తెలుసా? ఒక సర్వింగ్ చికెన్ లో 600mg సోడియం కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకొనే వారు తినకుండా నివారించాల్సిన సాల్ట్ ఫుడ్స్ లో ఇది ఒకటి.

పిజ్జా:
పిజ్జా అంటే పిల్ల, పెద్ద అందరికీ చాలా ఇష్టం. ఇది జంక్ ఫుడ్ గా మాత్రం ఉండటమే కాదు, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే బరువు తగ్గాలనుకొనే వారు ఈ హై సోడియం జంక్ ఫుడ్ ను నివారించడం చాలా మంచిది.

చీజ్:
చాలా మంది చీజ్ ను హెల్తీ పదార్థం అని సలహా ఇస్తుంటారు. అయితే, చీజ్ ను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అందువల్ల , బరువు తగ్గాలనుకొనే వారికి ఈ సాల్ట్ ఫుడ్ ను నివారించడం ఉత్తమం.

ఊరగాయలు:
మన ప్రతి సౌంత్ ఇండియన్ ప్లేట్స్ లో ఊరగాయ తప్పనిసరిగా ఉంటుంది. ఈ ఊరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి కొన్నిఉప్పును అదనంగా చేర్చుతుంటారు. అందువల్ల ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇవి బ్లడ్ ప్రెజర్ ను పెంచుతాయి కాబట్టి, సాద్యమైనంత వరకూ వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.

కొన్ని రకాల సాస్ లలో:
అన్ని కుషన్స్ లో ఎక్కువగా ఉపయోగించే పదార్థం సోయా సాస్. ఈ సాస్ లో అత్యధికంగా ఉప్ప ఉంటుంది. కాబట్టి మీరు బరువు తగ్గించుకోవాలంటే మీరు ఈ సాస్ ను నివారించడం ఉత్తమం.

బెవరేజెస్:
బెవరేజ్ లో ఆర్టిఫిషియల్ పదార్థాలను చేర్చుతారు. అందువల్ల ఇది కూడా ఒక సాల్ట్ ఫుడ్స్ ఐటమ్స్ క్రిందికే వస్తుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకొనే వారు, బెవరేజెస్ ను నివారించడం ఉత్తమం.



Click it and Unblock the Notifications