Latest Updates
-
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.!
బరువు తగ్గించే హెల్తీ అండ్ లోక్యాలరీ ఫుడ్స్
బరువు తగ్గించుకోవడం కోసం చాలా ఎఫెక్టివ్ గా ఉండే ఫుడ్స్ తీసుకుంటుంటాము. అలాంటి ఫుడ్స్ లో ఖచ్చింతంగా బరువు తగ్గించే లోక్యాలరీ ఫుడ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే అన్నింటిలో ఉండే క్యాలరీలన్నీ సమానం కాదు. ఒక్కో ఆహారపదార్థం శరీరంలో ఒక్కో బాగానికి ఒక్కో విధంగా పనిచేస్తుంది. చాలా వరకూ ఒక్కోరకమైన ఫుడ్స్ ఒక్కో విధమైన క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని ఆకలిని పెంచితే, కొన్ని హార్మోనులను మరియు మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. కాబట్టి, ఏఏ ఆహారంలో ఎలాంటి పోషకవిలువలున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.
READ MORE: వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి...
బరువు తగ్గించే ఆహారాల్లో ఎలాంటి చిన్న ఆహారమైన సరే. వాటి పోషకవిలువలు తెలుసుకోవడం మంచిది. ఎంత తక్కువున్న క్యాలరీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది. అంతే కాదు, వీటి వల్ల డైట్ కంట్రోల్లో ఉంటుంది. డైట్ ఫుడ్స్ లో చాలా ఉన్నాయి. అవన్నీ టేస్టీ మరియు హెల్తీ కూడా, ఇవి కూడా మీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.
ఈ ఆర్టికల్లో బరువు తగ్గించే కొన్ని టాప్ ఫుడ్స్ ఇవ్వడం జరిగింది వాటి, వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు ...

సూప్స్:
భోజనానికి ముందు ఒక కప్పు సూప్ త్రాగింతే చాలా మంచిది. సూప్ ఎలా ఉంటుందన్నది విషయం కాదు. అందులో పూర్తి పోషకాలున్నాయ లేదా అన్నది అవసరం.

బీన్స్ :
బీన్స్ వెజిటేబుల్ చౌకైనది, ఫిల్లింగ్ అండ్ వర్సిటైల్ ప్రోటీన్ వెజిటేబుల్. ఇంకా వాటిలో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఇవి హెల్తీ మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కూడా ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుంది. అలాగే జంక్ ఫుడ్ మీద కోరికలు కలగకుండా చేస్తుంది.

బ్రొకోలి:
అత్యంత ఉపయోగకరమైన వెజిటేబుల్ ఇది. ఇందులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి . మరియు వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించుకోవడానికి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

చికెన్:
రెడ్ మీట్ తో పోల్చితే చికెన్ చాలా మంచిది. చికెన్ తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు . చికెన్ లో విటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.

ఆపిల్స్:
మీ భోజనానికి ముందుగా ఆపిల్స్ తీసుకోండి. ఇది క్యాలరీలను తగ్గిస్తుంది. క్యాలరీలు 15శాతం వరకూ తగ్గించుకోవడానికి సహాయపడుతాయి . బరువు తగ్గించుకోవడంలో ఇది ఒక బెస్ట్ హెల్తీ ఫుడ్.

బాదం:
బాదం ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి మరియు ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్నవి. బాదంలో గ్లిసమిక్ ఇండెక్స్ 0 పర్సెంట్ . అంటే ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ మీద ఎలాంటి దుష్ప్రభావాలు చూపవు. సాధారణంగా ఇవి జీర్ణం అవ్వడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది.

డార్క్ చాక్లెట్:
చాక్లెట్స్ అంటే ఎవరి ఇష్టం ఉండదు చెప్పండి, చాక్లెట్స్ తింటే లావుతారనుకుంటారు. అయితే డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు, బరువు తగ్గించుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది.

మొలకలు
మొలకలను ఏదోఒకవిధంగా తీసుకోవాలి . ఒక సర్వింగ్ మొలకల్లో 4గ్రాముల ప్రోటీలను మన శరీరానికి అందుతాయి. ఇది క్యాలరీలను కరిగించడానికి సహాయపడుతుంది..

ఓట్స్:
ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి, సెరోటినిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కొవ్వు కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, వీటిని మీ రెగ్యులర్ బ్రేక్ ఫ్యాస్ట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

క్యారెట్స్:
పచ్చి మరియు ఉడికించిన క్యారెట్ బరువు తగ్గడానికి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. క్యారెట్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది పొట్టను నింపుతుంది. దాంతో హైక్యాలరీ ఫుడ్ తక్కువగా తింటారు. ఇతర వెజిటేబుల్స్ తో పోల్చితే క్యారెట్లో క్యాలరీలు తక్కువ. కాబట్టి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి.



Click it and Unblock the Notifications